AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఆడవాళ్ల రక్తం తాగే పోలీస్.. ఓటీటీలో ఒళ్లుగగుర్పొడిచే క్రైమ్ థ్రిల్లర్..క్లైమాక్స్ వేరే లెవెల్

ఇతర జానర్లతో పోల్చుకుంటే ఓటీటీలో క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాకు కాస్త ఆదరణ ఎక్కువ. ప్రేక్షకుల్లో చాలామంది ఈ రకమైన చూసేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక హారర్ క్రైమ్ థ్రిల్లర్ గురించే.ఈ సినిమా చూస్తుంటే హాలీవుడ్ జాంబీ మూవీస్ గుర్తొస్తాయి.

OTT Movie: ఆడవాళ్ల రక్తం తాగే పోలీస్.. ఓటీటీలో ఒళ్లుగగుర్పొడిచే క్రైమ్ థ్రిల్లర్..క్లైమాక్స్ వేరే లెవెల్
OTT Movie
Basha Shek
|

Updated on: Dec 26, 2025 | 7:55 PM

Share

ఈ మధ్యన సస్పెన్స్, హారర్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఓటీటీ ఆడియెన్స్ ను బాగా అలరిస్తున్నాయి. భాషతో సంబంధం లేకుండా ఈ జానర్ సినిమాలను చూసేస్తున్నారు ఆడియెన్స్. ఇతర భాషలతో పోల్చితే తెలుగులో ఈ జానర్ సినిమాలు కొంచెం తక్కువే అయినా అప్పుడప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు ఆడియెన్స్ ను బాగా భయపెడుతుంటాయి. అలా కొన్ని నెలల క్రితం తెలుగులో వచ్చిన ఓ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది. హాలీవుడ్ లో సూపర్ హిట్ ఫ్రాంఛైజీ జాంబీ మూవీస్ తరహాలో ఆడవాళ్ల రక్తం తాగే ఓ నరరూప రాక్షసుడి చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ కు మాత్రం అందరూ షాకవుతారు.. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. హైదరాబాద్ లో కొందరు అమ్మాయిలు కనిపించకుండా పోతారు. దీని వెనక గల మిస్టరీని ఛేదించేందుకు స్పెషల్‌ ఆఫీసర్లుగా హీరో, హీరోయిన్లు రంగంలోకి దిగుతారు. అదే సమయంలో ఎప్పుడో అంతరించిపోయిందనుకున్న ఓ తెగకు చెందిన ఓ వ్యక్తి నగరంలో ఉన్నాడని పోలీసులు తెలుసుకుంటారు. అతనే ఆ అమ్మాయిలను అపహరించి వారి రక్తం తాగుతుంటాడని తెలుస్తుంది. మరి ఆడవాళ్ల రక్తం తాగే మనిషి ఎవరు? అతని వెనక ఉన్న కథేంటి? పోలీసులు ఎలా అతనిని పట్టుకున్నారో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఆద్యంతం ఆకట్టుకునే కథా కథనాలు, ఉత్కంఠభరిత సన్నివేశాలు, అద్దిరిపోయే ట్విస్టులతో ప్రేక్షకులను థ్రిల్ కు గురి చేసే ఈ సినిమా పేరు హిడింబ. స్టార్ యాంకర్ తమ్ముడు ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు ఈ మూవీలో హీరోగా నటించాడు. కన్నెగంటి తెరకెక్కించిన ఈ సినిమాలో నందితా శ్వేతా హీరోయిన్ గా నటించింది. థియేటర్లలో ఓ మాదిరిగా ఆడిన ఈ సినిమా ఓటీటీలో మాత్రం అదరగొట్టింది. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ ఎవ్వరూ ఊహించని విధంగా మైండ్ బ్లాక్ అయ్యేలా ఉందని కామెంట్స్ వినిపించాయి. మరి మీరు ఈ సినిమాను చూశారా? లేకపోతే అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్ స్టార్ ఓటీటీల్లో హిడింబను చూసి ఎంజాయ్ చేయండి

ఇవి కూడా చదవండి

రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మామూలు క్రేజ్ కాదు భయ్యా.. 12 రోజుల్లో 1.5 కోట్ల అప్లికేషన్లు..
మామూలు క్రేజ్ కాదు భయ్యా.. 12 రోజుల్లో 1.5 కోట్ల అప్లికేషన్లు..
లెమన్ టీ ఆరోగ్యానికి మంచిదేనా? ఈ సమస్యలు ఉన్నవారు దూరంగా ఉండాలి!
లెమన్ టీ ఆరోగ్యానికి మంచిదేనా? ఈ సమస్యలు ఉన్నవారు దూరంగా ఉండాలి!
ఎలుగుబంటి దాడి.. మృత్యువు అంచున బాలుడు.. అంతలో..
ఎలుగుబంటి దాడి.. మృత్యువు అంచున బాలుడు.. అంతలో..
తెలంగాణలో మీ సేవ సర్టిఫికెట్లకు కొత్త సెక్యూరిటీ పేపర్..
తెలంగాణలో మీ సేవ సర్టిఫికెట్లకు కొత్త సెక్యూరిటీ పేపర్..
సీజేఐ ఒక్క కామెంట్‌తో పుట్టుకొచ్చిన మక్కీ జనతా పార్టీ..
సీజేఐ ఒక్క కామెంట్‌తో పుట్టుకొచ్చిన మక్కీ జనతా పార్టీ..
ఈజీగా బరువు తగ్గేందుకు జపనీస్‌ 3-3-3 వాకింగ్ ఫార్ములా..ఇది నిజంగా
ఈజీగా బరువు తగ్గేందుకు జపనీస్‌ 3-3-3 వాకింగ్ ఫార్ములా..ఇది నిజంగా
దుబాయ్‌లో పంజాబీ ట్రక్ డ్రైవర్‌కు రూ.1.3 కోట్ల లాటరీ..!
దుబాయ్‌లో పంజాబీ ట్రక్ డ్రైవర్‌కు రూ.1.3 కోట్ల లాటరీ..!
అందమైన జా లైన్ కోసం సులువైన చిట్కాలు.. ముఖంపై కొవ్వుకు చెక్!
అందమైన జా లైన్ కోసం సులువైన చిట్కాలు.. ముఖంపై కొవ్వుకు చెక్!
విజయవాడ ఉత్సవ్‌లో చంద్రబాబు, తమిళనాడు సీఎం విజయ్‌..
విజయవాడ ఉత్సవ్‌లో చంద్రబాబు, తమిళనాడు సీఎం విజయ్‌..
ఒక్క విన్నపంతో కదిలిన దేశం.. అనాథ అమ్మాయికి అద్భుత కళ్యాణం!
ఒక్క విన్నపంతో కదిలిన దేశం.. అనాథ అమ్మాయికి అద్భుత కళ్యాణం!