AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Raja Saab: ‘ది రాజా సాబ్’ మూవీ రన్ టైమ్ ఫిక్స్.. ప్రభాస్ సినిమా ఎంతసేపు ఉందంటే?

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ ది రాజా సాబ్. మారుతి తెరకెక్కించిన ఈ హారర్ థ్రిల్లర్ కామెడీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది.

The Raja Saab: 'ది రాజా సాబ్' మూవీ రన్ టైమ్ ఫిక్స్.. ప్రభాస్ సినిమా ఎంతసేపు ఉందంటే?
The Raja Saab Movie
Basha Shek
|

Updated on: Dec 03, 2025 | 6:32 AM

Share

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా ది రాజా సాబ్. సలార్, కల్కి వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత డార్లింగ్ నటిస్తోన్న ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. మారుతి తెరకెక్కిస్తోన్న ఈ హారర్ థ్రిల్లర్ కామెడీలో ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ప్రభాస్ తో రొమాన్స్ చేయనున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సినిమా షూటింగ్ కూడా పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటోన్న ది రాజా సాబ్ వచ్చే ఏడాది సంక్రాంతికి (2026 జనవరి 9న ) ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ టైమ్ దగ్గర పడుతుండడంతో ది రాజా సాబ్ మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. అదేంటంటే..

ఇటీవల కాలంలో ప్రభాస్‌ నటించిన సినిమాలన్నీ రన్‌ టైమ్‌ దాదాపు 3గంటలపైనే ఉన్నాయి . అదే సమయంలో డైరెక్టర్ తీసిన సినిమాలు మాత్రం తక్కువ నిడివితోనే ఉంటాయి. ఈ క్రమంలో ప్రభాస్ సినిమా రన్ టైమ్ ఎంతోనని తెలుసుకునేందుకు చాలా మంది ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనిపై ఒక క్లారిటీ వచ్చింది. ‘ది రాజా సాబ్‌’కు సంబంధించి అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్‌ ఓపెన్‌ అయ్యాయి. ఈ క్రమంలో భారీ రన్‌టైమ్‌తో ఈ మూవీని విడుదల చేస్తున్నారు. టికెట్‌ బుకింగ్‌ వెబ్‌సైట్‌లో ఉంచిన వివరాల ప్రకారం ది రాజా సాబ్ మూవీ రన్‌టైమ్‌ సుమారు 3 గంటలా 14 నిమిషాలుగా కనిపిస్తోంది. మొత్తానికి ప్రభాస్ గత సినిమల్లాగే ది రాజా సాబ్ కూడా భారీ రన్ టైమ్ తో ఉందన్నమాట.

ఇవి కూడా చదవండి

ది రాజాసాబ్ సినిమాలో ప్రభాస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వైస్ కెప్టెన్సీ పోస్ట్ పాయే.. వన్డే టీం నుంచి పీకేసే..
వైస్ కెప్టెన్సీ పోస్ట్ పాయే.. వన్డే టీం నుంచి పీకేసే..
రాత్రి అన్నం మిగిలిందా? రూపాయి ఖర్చు లేకుండా కరకరలాడే వడియాలు
రాత్రి అన్నం మిగిలిందా? రూపాయి ఖర్చు లేకుండా కరకరలాడే వడియాలు
ఏసీ రూముల్లో ఉన్నా శరీరం డీహైడ్రేట్ అవుతుందా..?
ఏసీ రూముల్లో ఉన్నా శరీరం డీహైడ్రేట్ అవుతుందా..?
సమ్మర్లో తులసి మొక్క గుబురుగా పెరగాలంటే గింజలు ఇలా చల్లాలి..
సమ్మర్లో తులసి మొక్క గుబురుగా పెరగాలంటే గింజలు ఇలా చల్లాలి..
ఆధార్ ఉన్నవారికి కేంద్రం అలర్ట్.. యాప్ సేవలు బంద్
ఆధార్ ఉన్నవారికి కేంద్రం అలర్ట్.. యాప్ సేవలు బంద్
భారత వన్డే జట్టులో ఐపీఎల్ హవా.. ఏ టీం నుంచి ఎంతమంది ఉన్నారంటే?
భారత వన్డే జట్టులో ఐపీఎల్ హవా.. ఏ టీం నుంచి ఎంతమంది ఉన్నారంటే?
OTT టాప్ ట్రెండింగ్‌లో రియల్ క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.4 రేటింగ్
OTT టాప్ ట్రెండింగ్‌లో రియల్ క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.4 రేటింగ్
చిన్న పిల్లలకు నూనె మసాజ్ చేయడం వల్ల ఇన్ని లాభాలా? తల్లిదండ్రులు
చిన్న పిల్లలకు నూనె మసాజ్ చేయడం వల్ల ఇన్ని లాభాలా? తల్లిదండ్రులు
రాత్రికి రాత్రే వీరి అప్పులు మొత్తం తీర్చేస్తారు..
రాత్రికి రాత్రే వీరి అప్పులు మొత్తం తీర్చేస్తారు..
ప్రపంచకప్ హీరోతోపాటు మరో ముగ్గురికి మొండిచేయి.. ఇంత అన్యాయమా?
ప్రపంచకప్ హీరోతోపాటు మరో ముగ్గురికి మొండిచేయి.. ఇంత అన్యాయమా?