AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: ఈ వారం ఓటీటీల్లో 20కు పైగా కొత్త సినిమాలు.. ఆ రెండు మాత్రం మిస్ అవ్వకండి

ఈ వారం థియేటర్లలో పాటు ఓటీటీలోనూ పలు కొత్త సినిమాలు సందడి చేయనున్నాయి. ముఖ్యంగా ఓటీటీలో ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి.

OTT Movies: ఈ వారం ఓటీటీల్లో 20కు పైగా కొత్త సినిమాలు.. ఆ రెండు మాత్రం మిస్ అవ్వకండి
OTT Movies
Basha Shek
|

Updated on: Dec 02, 2025 | 7:45 AM

Share

ఈ వారం థియేటర్లలో పెద్దగా సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. బాలకృష్ణ అఖండ 2 మాత్రమే సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనుంది. అలాగే హిందీలో రణ్ వీర్ సింగ్ ‘ధురంధర్’ అనే చిత్రం రిలీజ్ కానుంది. ఇవి రెండు తప్పితే వేరే చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. మరోవైపు ఓటీటీల్లో మాత్రం హిట్ సినిమాలు చాలానే రాబోతున్నాయి. తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ సినిమాలు ఈ లిస్టులో ఉండటం విశేషం. ఈ వీకెండ్ లో రష్మిక నటించిన రెండు సినిమాలు స్ట్రీమింగ్ కు రానున్నాయి. ‘ద గర్ల్‌ఫ్రెండ్’ తో పాటు హారర్ థ్రిల్లర్ మూవీ ‘థామా’ ఓటీటీలో సందడి చేయనుంది. అలాగే ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, డీయస్ ఈరే, స్టీఫెన్ చిత్రాలు కూడా చాలా ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇవన్నీ తెలుగులోనే స్ట్రీమింగ్ కానున్నాయి. వీటితో పాటు మరికొన్ని డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. మరి డిసెంబర్ మొదటి వారంలో ఏ ఓటీటీలో ఏ మూవీస్ స్ట్రీమింగ్ కానున్నాయో తెలుసుకుందాం రండి

నెట్‌ఫ్లిక్స్

  • ట్రోల్ 2 (నార్వేజియన్ సినిమా) – డిసెంబరు 01
  • కిల్లింగ్ ఈవ్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – డిసెంబరు 02
  • మై సీక్రెట్ శాంటా (ఇంగ్లిష్ మూవీ) – డిసెంబరు 03
  • ద గర్ల్‌ఫ్రెండ్ (తెలుగు మూవీ) – డిసెంబరు 05
  • జే కెల్లీ (ఇంగ్లిష్ సినిమా) – డిసెంబరు 05
  • స్టీఫెన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – డిసెంబరు 05
  • ద న్యూయర్కర్ ఎట్ 100 (ఇంగ్లిష్ మూవీ) – డిసెంబరు 05

అమెజాన్ ప్రైమ్ వీడియో

ఇవి కూడా చదవండి
  • థామా (తెలుగు డబ్బింగ్ సినిమా) – డిసెంబరు 02
  • ఓ వాట్ ఫన్ (ఇంగ్లిష్ మూవీ) – డిసెంబరు 03

ఆహా

  • ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్ (తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్) – డిసెంబరు 05

జియో హాట్‌స్టార్

  • ద బ్యాడ్ గాయ్స్ 2 (ఇంగ్లిష్ సినిమా) – డిసెంబరు 01
  • డీయస్ ఈరే (తెలుగు డబ్బింగ్ మూవీ) – డిసెంబరు 05

జీ5 ఓటీటీలో

  • ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో (తెలుగు సినిమా) – డిసెంబరు 05
  • ఘర్‌వాలీ పెడ్వాలీ (హిందీ వెబ్ సిరీస్) – డిసెంబరు 05
  • బే దునే తీన్ (మరాఠీ వెబ్ సిరీస్) – డిసెంబరు 05

సోనీ లివ్

  • కుట్రమ్ పురిందవన్ (తమిళ వెబ్ సిరీస్) – డిసెంబరు 05

సన్ నెక్స్ట్ ఓటీటీలో..

  • అరసయ్యన ప్రేమ పసంగ (కన్నడ సినిమా) – డిసెంబరు 05

ఆపిల్ టీవీ ప్లస్

  • ద హంట్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – డిసెంబరు 03
  • ద ఫస్ట్ స్నో ఆఫ్ ఫ్రాగల్ రాక్ (ఇంగ్లిష్ మూవీ) – డిసెంబరు 05

బుక్ మై షో

  • ద లైఫ్ ఆఫ్ చక్ (ఇంగ్లిష్ సినిమా) – డిసెంబరు 04

Note: ఇవి కాక వారం  కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ లను ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండా స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.