AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: మ‌గాళ్లు మిస్ అవ్వకుండా చూడాల్సిన మూవీ.. ఓటీటీలో దుమ్ము రేపుతోంది.. తెలుగులోనూ స్ట్రీమింగ్

కొన్ని రోజుల క్రితం థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ లోనూ దుమ్ము రేపుతోంది. రికార్డు వ్యూస్ తో ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది.

OTT Movie: మ‌గాళ్లు మిస్ అవ్వకుండా చూడాల్సిన  మూవీ.. ఓటీటీలో దుమ్ము రేపుతోంది.. తెలుగులోనూ స్ట్రీమింగ్
Aan Paavam Pollathathu Movie
Basha Shek
|

Updated on: Dec 03, 2025 | 9:38 AM

Share

ప్రస్తుతం ఓటీటీలో ఒక సినిమా దుమ్మురేపుతోంది. ఆకట్టుకునే కథ కథనాలతో ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకుంటోంది. కొన్ని రోజుల క్రితమే ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఇగో కారణంగా భార్య, భర్తల మధ్య తలెత్తే సమస్యలను ఇందులో అద్బుతంగా చూపించారు. దంపతుల గొడవల్లో చుట్టు పక్కల ఉండే వాళ్లు ఎలా పెట్రోల్ పోసి ఆనందిస్తారనే విషయాన్ని సటైరికల్ గా చూపించారు. మరీ ముఖ్యంగా అసలైన ఫెమినిజంకి సూడో ఫెమినిజంకి తేడాను కూడా ఈ మూవీలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే… శివ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చుట్టూ తిరుగుతుంది. పెద్దలు నిశ్చయించడంతో శక్తి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మొదటి నెల రోజులు బాగానే ఉంటారు. కానీ ఆ తర్వాతే అసలు సమస్యలు మొదలవుతాయి. దంపతుల మధ్య మనస్పర్థలు మొదలవుతాయి. ఏడాది తిరిగేసరికల్లా కనీసం తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. పరస్పర అంగీకారంతో కోర్టు మెట్లెక్కుతారు. మరి పెళ్లయిన ఏడాదికే శివ-శక్తి.. ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అసలేం జరిగింది? చివరకు వీళ్లిద్దరూ కలిశారా? లేదా? అనేది మిగతా స్టోరీ.

ఇటీవ‌ల తెలుగులో డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చిన ఈ త‌మిళ అనువాద‌ చిత్రం పేు ఆన్ పావం పొల్లతత్తు (Aan Paavam Pollathathu). రెండేండ్ల క్రితం జో అనే సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న హిట్ ఫెయిర్‌ రియో రాజ్ , మాళ‌విక మ‌నోజ్ ఈ మూవీలో మ‌రోమారు హీరో హీరోయిన్లుగా నటించారు. ఆక్టోబ‌ర్ 31 న త‌మిళ నాట థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ రొమాంటిక్, సెటైరిక‌ల్ కామెడీ చిత్రం తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి విజ‌యం సాధించింది. భారీ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం రెండు రోజుల క్రితమే జియో హాట్ స్టార్ ఓటీటీలోకి వచ్చింది.త‌మిళంతో పాటు తెలుగులోనూ అందుబాటులో ఉంది. ప్ర‌తి ఒక్క‌రు మరీ ముఖ్యంగా జెన్‌ జెడ్‌ తప్పక చూడాల్సిన మ‌స్ట్ వాచ్ ఫిలిం ఇది. డోంట్ మిస్‌.

ఇవి కూడా చదవండి

జియో హాట్ స్టార్ లో తెలుగులోనూ స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వైస్ కెప్టెన్సీ పోస్ట్ పాయే.. వన్డే టీం నుంచి పీకేసే..
వైస్ కెప్టెన్సీ పోస్ట్ పాయే.. వన్డే టీం నుంచి పీకేసే..
రాత్రి అన్నం మిగిలిందా? రూపాయి ఖర్చు లేకుండా కరకరలాడే వడియాలు
రాత్రి అన్నం మిగిలిందా? రూపాయి ఖర్చు లేకుండా కరకరలాడే వడియాలు
ఏసీ రూముల్లో ఉన్నా శరీరం డీహైడ్రేట్ అవుతుందా..?
ఏసీ రూముల్లో ఉన్నా శరీరం డీహైడ్రేట్ అవుతుందా..?
సమ్మర్లో తులసి మొక్క గుబురుగా పెరగాలంటే గింజలు ఇలా చల్లాలి..
సమ్మర్లో తులసి మొక్క గుబురుగా పెరగాలంటే గింజలు ఇలా చల్లాలి..
ఆధార్ ఉన్నవారికి కేంద్రం అలర్ట్.. యాప్ సేవలు బంద్
ఆధార్ ఉన్నవారికి కేంద్రం అలర్ట్.. యాప్ సేవలు బంద్
భారత వన్డే జట్టులో ఐపీఎల్ హవా.. ఏ టీం నుంచి ఎంతమంది ఉన్నారంటే?
భారత వన్డే జట్టులో ఐపీఎల్ హవా.. ఏ టీం నుంచి ఎంతమంది ఉన్నారంటే?
OTT టాప్ ట్రెండింగ్‌లో రియల్ క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.4 రేటింగ్
OTT టాప్ ట్రెండింగ్‌లో రియల్ క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.4 రేటింగ్
చిన్న పిల్లలకు నూనె మసాజ్ చేయడం వల్ల ఇన్ని లాభాలా? తల్లిదండ్రులు
చిన్న పిల్లలకు నూనె మసాజ్ చేయడం వల్ల ఇన్ని లాభాలా? తల్లిదండ్రులు
రాత్రికి రాత్రే వీరి అప్పులు మొత్తం తీర్చేస్తారు..
రాత్రికి రాత్రే వీరి అప్పులు మొత్తం తీర్చేస్తారు..
ప్రపంచకప్ హీరోతోపాటు మరో ముగ్గురికి మొండిచేయి.. ఇంత అన్యాయమా?
ప్రపంచకప్ హీరోతోపాటు మరో ముగ్గురికి మొండిచేయి.. ఇంత అన్యాయమా?