AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రష్యా యుద్ధ భూమిలో తెలంగాణ యువకుడు.. బిడ్డ పుట్టిన శుభవార్త చెప్పలేక భార్య కన్నీరు!

ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్లిన తెలంగాణ యువకులు సమస్యలు ఎదుర్కొంటున్న ఘటనలు ఈ మధ్య కాలంలో తరచూ మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి వెలుగు చూసింది. ఉద్యోగం ఇప్పటిస్తానని ఓ ఏజెంట్ చెప్పిన మాటలు నమ్మి రష్యా వెళ్లిన ఓ తెలంగాణ యువకుడు ఇప్పుడు అక్కడి యుద్ధ భూమిలో చిక్కుకుపోయాడు.

రష్యా యుద్ధ భూమిలో తెలంగాణ యువకుడు.. బిడ్డ పుట్టిన శుభవార్త చెప్పలేక భార్య కన్నీరు!
Telangana Man Forced Into Russia Ukraine War
Anand T
|

Updated on: Nov 17, 2026 | 9:54 PM

Share

ఏజెంట్ల మాటలు నమ్మి ఉద్యోగం కోసం రష్యా వెళ్లిన ఓ తెలంగాణ యువకుడు ఇప్పుడు.. అక్కడి యుద్ధ భూమిలో చిక్కుకుపోయాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ యువకుడు కిషన్, ఇప్పుడు చేతిలో తుపాకీ పట్టుకుని రష్యా-ఉక్రెయిన్ యుద్ధ క్షేత్రంలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా నారాయణపూర్ గ్రామానికి చెందిన కిషన్, రెండు నెలల క్రితం ఉపాధి కోసం రష్యా వెళ్లారు. అయితే వెళ్లిన కొన్ని రోజు తర్వాత అక్టోబర్ 2న భార్య రక్షితకు ఫోన్ చేసి కిషన్ ఆమెతో మాట్లాడారు. కానీ ఆ తర్వాత నుంచి భర్త నుంచి ఒక్క కాల్‌ కూడా రాలేదు. దీంతో ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

అయితే భర్త రష్యా వెళ్లే సమాయానికి భార్య 7 నెలల గర్భిణీగా ఉండగా ఇప్పుడు ఆమె మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయం భర్తకు చెప్పాలని ఆమె ఎంత ప్రయత్నించినా అతని ఆచూకీ లభించడం లేదు. బిడ్డ పుట్టి 20 రోజులు గడుస్తున్నా, కనీసం ఆ శుభవార్తను భర్తకు చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఆమె ఉండిపోయింది. భర్త ఇప్పుడు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో తెలియడం లేదని ఆమె తన ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వ అధికారుల ద్వారా భర్తను సంప్రదించడానికి తమ కుటుంబ సభ్యులు, బంధువులు నిరంతరం ప్రయత్నిస్తున్నా ఫలితం లేకుండా పోయిందని తెలిపింది.తనకు మగబిడ్డ పుట్టిన విషయం కూడా భర్తకు తెలియదు. కుటుంబ అవసరాల కోసం వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేయడం తప్ప తమకు మరో దారి లేకుండా పోయింది కన్నీరు పెట్టుకుంది. అధికారులు స్పందించి తన భర్తను తిరిగి తీసుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలి కోరుతోంది.

అసలేం జరిగింది

రష్యాలో వేర్‌హౌస్ ప్యాకింగ్ ఉద్యోగం ఇప్పిస్తానని ఓ ఏజెంట్ చెప్పిన మాటలు నమ్మిన కిషన్ అతనికి సుమారు రూ.2.50 లక్షలు చెల్లించాడు. దీంతో సెప్టెంబర్ మొదటి వారంలో ఏజెంట్ కిషన్‌ను విజిట్ వీసాపై రష్యాకు పంపించాడు. కానీ అక్కడికి వెళ్లాక పరిస్థితులు పూర్తిగాలు మారిపోయాయి. అక్కడికెళ్లి వేర్ హౌస్‌లో ప్యాకింగ్ చేయాల్సిన కిషన్.. ఇప్పుడు ఆర్మీ యూనిఫాం, హెల్మెట్ ధరించి, భారీ తుపాకీతో యుద్ధ క్షేత్రంలో దిగాడు. నిరంతర కాల్పులు, భారీ బాంబు దాడుల మధ్య బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నాడు.

అయితే ఇండియన్ ఎంబసీ అదికారులు దర్యాప్తు ముమ్మరం చేయడంతో తాజాగా కిషన్‌కు సంబంధించిన పలు కీలక పత్రాలు వెలుగులోకి వచ్చాయి. మాస్కోకు తూర్పున సుమారు 705 కి.మీ దూరంలోని ఉలియానోవ్స్క్ ప్రాంతంలో ఆయన స్థిరనివాసానికి సంబంధించిన ప్రక్రియను రష్యా అధికారులు పూర్తి చేశారు. సెప్టెంబర్ 25న అక్కడి పబ్లిక్ సర్వీసెస్ సెంటర్ లో రష్యా పెన్షన్, సామాజిక బీమా వ్యవస్థలో కిషన్ పేరు నమోదైనట్టు గుర్తించారు. అంతేకాదు ఆయనకు రష్యన్ పాస్‌పోర్ట్‌తో పాటు, రీజినల్ మిలిటరీ కమిషనరేట్ జారీ చేసిన రష్యన్ మిలిటరీ ఐడీ, ВС РОССИИ అని ముద్రించిన మెటల్ పర్సనల్ ట్యాగ్ కూడా జారీ చేశారు.

అప్పుల బాధతో విదేశాలకు

అయితే కిషన్ గతంలో మస్కట్‌లోని ఓ పెట్రోల్ బంక్‌లో ఏడాది పాటు పనిచేసి నెలకు రూ.50 వేల వరకు సంపాదించేవారు. కానీ మొదటి బిడ్డ పెట్టిన తర్వాత కుటుంబ పోషణ భార్య ఒక్కతే చూసుకోవడం కష్టమవుతోందని 2024-25లో స్వగ్రామానికి తిరిగి వచ్చారు. గ్రామంలో భార్యాభర్తలిద్దరూ కలిసి ఇస్త్రీ పని చేసుకునే వారు. కానీ ఆదాయం సరిపోకపోవడంతో పాటు ఇంటికోసం తెచ్చిన అప్పుల వడ్డీలు పెరగడంతో రష్యాలో ఎక్కువ సంపాదించవచ్చన్న ఏజెంట్ మాటలు నమ్మి కిషన్ అక్కడి వెళ్లాడు. చివరకు ఇలా యుద్ధ భూమిలో చిక్కుకుపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమ బిడ్డను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us