AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: సమ్మక్క సాగర్ బ్యారేజీకి లైన్‌ క్లియర్! NOC ఇచ్చేందుకు చత్తీస్‌ఘడ్‌ సీఎం సానుకూలం

తెలంగాణ వాసులకు ఇదో గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే సమ్మక్క సాగర్ బ్యారేజీ విషయంలో ఛత్తీస్‌ గఢ్‌తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జరిపిన చర్చలు ఫలించాయి. సమ్మక్క సాగర్ బ్యారేజీకి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు ఛత్తీస్ గడ్‌ సీఎం విష్ణుదేవ్ సానుకూలత వ్యక్తం చేశారు. మిగతా అనుమతులకూ ఓకే చెప్పినట్టు సమాచారం.

Telangana: సమ్మక్క సాగర్ బ్యారేజీకి లైన్‌ క్లియర్! NOC ఇచ్చేందుకు చత్తీస్‌ఘడ్‌ సీఎం సానుకూలం
Sammakka Sagar Barrage
Anand T
|

Updated on: Nov 17, 2026 | 9:16 PM

Share

ప్రాజెక్టుల విషయంలో పక్కరాష్ట్రాలతో తెలంగాణ ప్రభుత్వ చర్చలు కొనసాగుతున్నాయి. మొన్న మహారాష్ట్ర వెళ్లి తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై చర్చించిన ప్రభుత్వం మంగళవారం ఛత్తీస్ గడ్‌ వెళ్లి సమ్మక్క సాగర్ బ్యారేజీపై చర్చించింది. ఛత్తీస్ గఢ్ సీఎం విష్ణుదేవ్‌ సాయితో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ భేటీ అయ్యారు. సమ్మక్క సాగర్‌కు NOC ఇవ్వాలని కోరారు. ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో నీటి అవసరాలు పెరిగే అవకాశాలున్నాయని విష్ణుదేవ్‌కు వివరించారు. బ్యారేజీలో గోదావరి జలాలను నిల్వ చేసుకునేందుకు అనుమతి ఇవ్వడంతో పాటు పెండింగ్‌లో ఉన్న ఇతర అనుమతులను కూడా త్వరగా మంజూరు చేయాలని కోరారు.

ములుగు జిల్లా తుపాకులగూడెం దగ్గర గోదావరి నదిపై సమ్మక్కసాగర్ బ్యారేజీని నిర్మించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ బ్యారేజీ వల్ల ఛత్తీస్‌గఢ్‌ పరిధిలోని 33 ఎకరాల భూమి ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. భారీ వరదలు వచ్చినప్పుడు కూడా 100 ఎకరాలకు మించి ముంపునకు గురయ్యే అవకాశం లేదు. ఛత్తీస్ గఢ్ ప్రభుత్వ అనుమానాలను తీర్చేందుకు దీనిపై ఐఐటీ ఖరగ్‌పూర్ ద్వారా ముంపు ప్రభావంపై అధ్యయనం జరిగింది. ముంపు అధ్యయనానికి సంబంధించి 9 కోట్ల 88 లక్షలను తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్‌లోనే చెల్లించింది. ఐఐటీ ఖరగ్‌పూర్ తన అధ్యయన నివేదికను జూలై 30న ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి అందజేసింది. ఈ నివేదిక ఆధారంగా ఎన్‌ఓసీ ప్రక్రియను వేగవంతం చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది.

సమ్మక్క సాగర్ బ్యారేజీ సామర్థ్యం 6.94 టీఎంసీలుగా ఉంది. కరువు ప్రభావిత ప్రాంతాలతో పాటు వెనుకబడిన, గిరిజన ప్రాంతాల్లో సాగు, తాగునీటి అవసరాలను తీర్చడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. ఛత్తీస్‌ గడళ్‌ ప్రభుత్వానికి పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బ్యారేజీ నిర్మాణం పూర్తయినందున ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఎన్‌ఓసీని త్వరగా మంజూరు చేయాలని కోరారు.

రేవంత్ రెడ్డి విజ్ఞప్తికి ఛత్తీస్‌గఢ్ సీఎం సానుకూలంగా స్పందించినట్టు తెలంగాణ సీఎంవో తెలిపింది. NOC ప్రక్రియను కూడా త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చినట్టు స్పష్టం చేసింది. NOCపై ఛత్తీస్‌గడ్‌ సానుకూలంగా స్పందించడంతో సమ్మక్క సాగర్ ప్రాజెక్టు అనుమతుల విషయంలో ముందడుగు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us