AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gopichand: మళ్లీ విలన్‌గా హీరో గోపీచంద్.. ప్రభాస్ సినిమాలో మాత్రం కాదు.. పూర్తి వివరాలివే

కెరీర్ ప్రారంభంలో జయం, వర్షం, నిజం తదితర సినిమాల్లో విలన్ గా భయపెట్టాడు గోపీచంద్. అయితే ఆ తర్వాత హీరోగా మారిపోయాడు. అయితే ఇప్పుడీ మ్యాచో స్టార్ మళ్లీ విలన్ గా చేసేందుకు రెడీ అవుతున్నారని టాక్. అయితే ప్రభాస్ సినిమాలో మాత్రం కాదు.

Gopichand: మళ్లీ విలన్‌గా హీరో గోపీచంద్.. ప్రభాస్ సినిమాలో మాత్రం కాదు.. పూర్తి వివరాలివే
Gopichand
Basha Shek
|

Updated on: Nov 17, 2026 | 8:56 PM

Share

మ్యాచో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. అయన హిట్ చూసి చాలా ఏళ్లయిపోయింది. మ్యాచో స్టార్ కథల ఎంపికలు బాగానే ఉన్నా ప్రేక్షకులు ఆశించినంత వినోదాన్ని మాత్రం అందించలేపోతున్నాయి. పంతం, చాణక్య, గౌతమ్ నంద, సిటీమార్, పక్కా కమర్షియల్, రామబాణం, భీమా సినిమాలు ఫ్లాప్ కాగా ఉన్నంతలో విశ్వం కాస్తా బాగానే ఆడింది. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. అందులో ఒకటి సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కతోన్న పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ భరతవర్ష. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. దీంతో పాటు వెంకట్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు మ్యాచో స్టార్. అయితే ఇప్పుడు గోపీచంద్ కు సంబంధించి ఒక ఆసక్తికర విషయం నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. ఈ మ్యాచో స్టార్ మళ్లీ విలన్‌గా చేస్తున్నాడట. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఇప్పుడీ న్యూస్ హాట్ టాపిక్ అయిపోయింది.

కాగా కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో విలన్ గా నటించాడు గోపీచంద్. జయం, నిజం, వర్షం తదితర చిత్రాల్లో ప్రతినాయక పాత్రల్లో అదరగొట్టేశాడు. అయితే హీరోగా మారిన తర్వాత విలన్ రోల్స్ పూర్తిగా దూరం పెట్టేశాడు. రెండేళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ సినిమా అయితేనే విలన్ పాత్ర చేస్తానన్నాడు. అయితే ఇప్పుడు ఆశ్చర్యకరంగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కొత్త మూవీలో గోపీచంద్ విలన్‌గా చేస్తున్నాడన్న వార్త నెట్టింట తెగ వైరలవుతోంది.  కాగా ఈ ఏడాది ఇప్పటికే కరుప్పు(వీరభద్రుడు), విశ్వనాథ్ అండ్ సన్స్, సీన్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు సూర్య. ప్రస్తుతం తనతోనే ‘జై భీమ్’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తీసిన టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు సూర్య. దీంతో పాటు కెప్టెన్ మిల్లర్, డిసి చిత్రాలతో మెప్పించిన అరుణ్ మాతేశ్వరన్‌ డైరెక్షన్ లోనూ ఓ సినిమాకు కమిట్ అయ్యాడు సూర్య. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టులోనే గోపీచంద్ విలన్ గా చేయనున్నారట. ఇది సాధారణ విలన్ రోల్ కాదని గోపీచంద్ పాత్ర ఫవర్ ఫుల్ గా ఉండనుందని సమాచారం.  మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

ఇవి కూడా చదవండి

సూర్య సినిమాలో విలన్ గా గోపీచంద్..

Gopichand, Suriya

Gopichand, Suriya

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us