AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suriya : వామ్మో.. ఏందన్నా ఇది.. యంగ్ హీరోకు ఖరీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన సూర్య.. ధర తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

మలయాళ చిత్రసీమలో యంగ్ హీరో నస్లెన్, తమిళ చిత్ర ప్రపంచంలో కూడా తన ఉనికిని చాటుకున్నాడు. అతడు నటించిన తొలి తమిళ చిత్రం 'సీన్' థియేటర్లలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను పొందుతోంది. ఈ క్రమంలోనే హీరో సూర్య తనకు ఖరీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చారని తెలిపారు. తాజాగా ఆ వాచ్ ధర తెలిసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.

Suriya : వామ్మో.. ఏందన్నా ఇది.. యంగ్ హీరోకు ఖరీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన సూర్య.. ధర తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
Naslen
Rajitha Chanti
|

Updated on: Nov 17, 2026 | 8:56 PM

Share

మలయాళ చిత్ర పరిశ్రమలో ఇప్పుడిప్పుడే వరుస హిట్స్ అందకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో నస్లెన్ . తాజాగా కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కూడా తన సత్తా చాటారు. టాలెంటెడ్ డైరెక్టర్ జిత్తు మాధవన్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సీన్’ చిత్రం ద్వారా నస్లెన్ తమిళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రంలో ఆయన చేసిన ‘ఈశ్వరన్’ అనే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఘన విజయం సాధించడంతో పాటు రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో చిత్ర విజయం పట్ల ఆనందం వ్యక్తం చేసిన హీరో సూర్య.. నస్లెన్‌కు ఒక ఖరీదైన లగ్జరీ వాచ్‌ను బహుమతిగా అందించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: ఏం ట్విస్టులు రా బాబూ.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రెండింగ్‏లో నంబర్ వన్..

‘సీన్’ సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న నస్లెన్ తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు. సినిమా షూటింగ్ అనుభవాలను గుర్తుచేసుకుంటూనే, తన చేతికి ఉన్న ఖరీదైన గడియారాన్ని అందరికీ చూపించారు. “ఇది సూర్య సార్ నాకు గిఫ్ట్ ఇచ్చిన వాచ్” అంటూ ఆయన ఎంతో ఆనందంగా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన లగ్జరీ బ్రాండ్ అయిన ‘కార్టియర్’ (Cartier Classic) సంస్థకు చెందిన క్లాసిక్ మోడల్ వాచ్‌ను సూర్య ఆయనకు కానుకగా ఇచ్చారు. దీని మార్కెట్ విలువ సుమారు రూ. 9 లక్షల వరకు ఉంటుందని సమాచారం. సినిమా విజయం సాధించిన సందర్భంగా తనతో పాటు పనిచేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఖరీదైన బహుమతులు ఇవ్వడం సూర్య ప్రత్యేకతగా నిలుస్తుంటుంది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : నన్ను అహాంకారి అనుకున్నారు.. 1500 సినిమాలు చేసినా ఏమీ మిగల్లేదు.. సీనియర్ నటుడు..

ఈ చిత్రంలో సూర్య హీరోగా నటిస్తుండగా, నస్లెన్ అత్యంత సవాలుతో కూడిన విలన్ పాత్రలో నటించారు. సినిమాలో సీనియర్ హీరో సూర్యకు సమానంగా నస్లెన్ నటన ఉందని కొందరు ప్రేక్షకులు ప్రశంసించడం విశేషం. అయితే దీనిపై నస్లెన్ స్పందిస్తూ.. “సూర్య సార్‌కంటే నేను ఒక మెట్టు పైన ఉన్నానని అనలేను. ఆయనొక లెజెండ్, అద్భుతమైన నటుడు. ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడమే నాకు గొప్ప అనుభూతి” అంటూ తన వినయాన్ని చాటుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Gulabi Movie: ఒక్క పాటతో స్టార్ డమ్.. గులాబీ సినిమాను మిస్సైన హీరోయిన్.. ఎవరంటే..

నస్లెన్..

ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవికి భార్యగా, చెల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. 20 ఏళ్లుగా తగ్గని స్టార్ డమ్..

Follow Us