AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యమహా ​లవర్స్‌కి అదిరిపోయే న్యూస్.. 108 కిలోమీటర్ల రేంజ్​తో 125cc స్కూటర్​.. చూస్తే షాకే

ఎలక్ట్రిక్ టూవీలర్లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ Yamaha మరో కొత్త స్కూటర్‌ను పరిచయం చేసింది. Xenter E పేరుతో తీసుకొచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ ఆకర్షణీయమైన డిజైన్‌, శక్తివంతమైన మోటార్‌, మెరుగైన బ్యాటరీ సామర్థ్యంతో ప్రత్యేకంగా నిలుస్తోంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 108 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ వెల్లడించింది. పనితీరు విషయంలో ఈ స్కూటర్‌ను 125cc పెట్రోల్ స్కూటర్‌తో పోల్చవచ్చని యమహా తెలిపింది.

యమహా ​లవర్స్‌కి అదిరిపోయే న్యూస్.. 108 కిలోమీటర్ల రేంజ్​తో 125cc స్కూటర్​.. చూస్తే షాకే
Yamaha Xenter E Electric Scooter
Nikhil
|

Updated on: Nov 17, 2026 | 8:50 PM

Share

రోజువారీ ప్రయాణాలకు అనువుగా ఉండేలా Xenter Eను రూపొందించారు. స్లిమ్ బాడీ డిజైన్‌, 16 అంగుళాల వీల్స్‌, రెండు చక్రాలకు డిస్క్ బ్రేకులు వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా 7.5kW గరిష్ట పవర్‌, 33.3Nm టార్క్‌ ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్‌ ఈ స్కూటర్‌కు ప్రధాన ఆకర్షణ. అయితే దీని ధర, భారత్‌లో విడుదలకు సంబంధించిన వివరాలను కంపెనీ వెల్లడించలేదు.

Yamaha Xenter E డిజైన్‌

ఈ స్కూటర్ ముందు భాగంలో దీర్ఘచతురస్రాకార హెడ్‌ల్యాంప్‌ను అందించారు. ప్రత్యేకమైన ఏప్రన్ డిజైన్‌, అల్యూమినియం స్వింగ్‌ఆర్మ్‌, 16 అంగుళాల వీల్స్‌ ఉన్నాయి. సస్పెన్షన్ కోసం ముందు టెలిస్కోపిక్ ఫోర్క్స్‌, వెనుక స్వింగ్‌ఆర్మ్‌తో కూడిన షాక్ అబ్జార్బర్‌ను అమర్చారు. బ్రేకింగ్ కోసం ముందు, వెనుక రెండు చక్రాలకు డిస్క్ బ్రేకులు ఇచ్చారు. ఇందులో 3-ఫేజ్ ఎక్సైటేషన్ ఎలక్ట్రిక్ మోటార్‌ ఉంది. ఇది గరిష్టంగా 7.5kW పవర్‌, 33.3Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మోటార్‌ను నేరుగా చాసిస్‌కు అమర్చడం మరో ప్రత్యేకత. 70.2Ah బ్యాటరీ ప్యాక్‌తో ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 108 కిలోమీటర్ల రేంజ్‌ లభిస్తుంది. 0 నుంచి 100 శాతం ఛార్జింగ్‌కు సుమారు 5.5 గంటలు పడుతుంది. స్కూటర్ ఎత్తు 790 మిల్లీమీటర్లు కాగా, బరువు సుమారు 121 కిలోగ్రాములు.

భారత్‌లో ధర..

యమహా ఇప్పటికే భారత ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్‌లో Aerox-E స్కూటర్‌ను కూడా తీసుకొచ్చింది. జూలైలో విడుదలైన ఈ మోడల్‌ పెట్రోల్ Aerox 155 డిజైన్‌ను పోలి ఉంటుంది. కంపెనీ అందించిన వివరాల ప్రకారం, ఇది భారత్‌లో యమహా రెండో ఎలక్ట్రిక్ టూవీలర్. దీని ధర రూ.2.82 లక్షలుగా ఉంది. Aerox-Eలో 1.5kWh డిటాచబుల్ బ్యాటరీని అందించారు. దీని మోటార్‌ 12.9hp పవర్‌, 48Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. IDC ప్రమాణాల ప్రకారం ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 117 కిలోమీటర్ల రేంజ్‌ అందిస్తుంది. ఇందులో Eco, Standard, Power అనే మూడు రైడింగ్ మోడ్స్‌తో పాటు Boost మోడ్‌ కూడా ఉంది. ట్విన్ LED హెడ్‌ల్యాంప్స్‌, LED టెయిల్ ల్యాంప్‌, TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌, స్మార్ట్‌ఫోన్ యాప్ ఆధారిత కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. Xenter E భారత్‌లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

Follow Us