AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : స్టార్ హీరోల ఫెవరేట్‏గా మారిన ఎల్లో స్నీకర్స్.. నెట్టింట తెగ ట్రెండింగ్.. ప్రత్యేకత ఏంటంటే..

సాధారణంగా సినీతారల ఫ్యాషన్ అభిమానులు ఎక్కువగా ఫాలో అవుతుంటారు. తమకు ఇష్టమైన స్టార్స్ ధరించిన షర్ట్స్, షూస్, గ్లాసెస్ ఇలా ప్రతి విషయంలోనూ తమ ఫెవరేట్ సెలబ్రెటీస్ ధరించినవే ఉపయోగిస్తుంటారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎల్లో స్నీకర్స్ ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. ఇంతకీ ఆ స్నీకర్స్ స్టైల్ ఏంటో తెలుసుకుందాం రండి.

Tollywood : స్టార్ హీరోల ఫెవరేట్‏గా మారిన ఎల్లో స్నీకర్స్.. నెట్టింట తెగ ట్రెండింగ్.. ప్రత్యేకత ఏంటంటే..
Mammootty ,mohanlal
Rajitha Chanti
|

Updated on: Nov 17, 2026 | 8:39 PM

Share

సాధారణంగా స్టార్ హీరోల ఫ్యాషన్ సెన్స్, స్టైల్ ప్రయోగాలు ఎప్పుడూ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంటాయి. అలాగే మలయాళ చలనచిత్ర పరిశ్రమలో తమ అద్భుతమైన నటనతో దశాబ్దాలుగా ప్రేక్షకుల హేమహీమలుగా వెలుగొందుతున్న మెగాస్టార్ మమ్ముట్టి , కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ కేవలం సినిమాలతోనే కాకుండా, తమ ఫ్యాషన్ సెన్స్‌తోనూ ఎప్పుడూ ట్రెండ్ సెట్ చేస్తుంటారు. ముఖ్యంగా వయసుతో సంబంధం లేకుండా ఇద్దరు దిగ్గజ నటులు ఎంపిక చేసుకునే స్టైలిష్ దుస్తులు, గ్లాసెస్ , షూస్ యువతను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. తాజాగా ఈ ఇద్దరు సూపర్‌స్టార్లు ధరించిన ఒకే రకమైన ‘మరపురాని’ బ్రాండెడ్ స్నీకర్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: ఏం ట్విస్టులు రా బాబూ.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రెండింగ్‏లో నంబర్ వన్..

తాజాగా జరిగిన ఒక సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ మమ్ముట్టి చాలా స్టైలిష్ అండ్ మాస్ లుక్‌లో హాజరయ్యారు. ఎప్పటిలాగే తన యంగ్ లుక్‌తో అందరినీ ఆశ్చర్యపరిచిన ఆయన.. రెడ్ కలర్ షర్ట్, వైట్ ప్యాంట్‌ ధరించి వేదికపైకి వచ్చారు. అయితే ఆయన ధరించిన దుస్తుల కంటే.. ఆయన వేసుకున్న సన్‌ఫ్లవర్ ఎల్లో రంగు స్నీకర్స్ అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించాయి. తెల్లటి ప్యాంట్‌కు కింది భాగంలో మెరిసిపోతున్న ఆ ఎల్లో కలర్ షూస్, వాటిపై ఉన్న ఇన్డిగో గీతలు ఆ లుక్‌కి మరింత రిచ్ అండ్ ట్రెండీ లుక్‌ను తెచ్చిపెట్టాయి. అంతకుముందు మలయాళ చిత్రసీమలోని మరో దిగ్గజం మోహన్ లాల్ కూడా సరిగ్గా ఇదే రకమైన డిజైన్ ఉన్న స్నీకర్స్ ధరించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇలా మాలీవుడ్ టాప్ స్టార్స్ ఇద్దరూ ఒకే రకమైన బ్రాండ్ షూస్‌ను ఇష్టపడటంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : నన్ను అహాంకారి అనుకున్నారు.. 1500 సినిమాలు చేసినా ఏమీ మిగల్లేదు.. సీనియర్ నటుడు..

మమ్ముట్టి , మోహన్ లాల్ ధరించిన ఈ ప్రత్యేకమైన స్నీకర్స్ ప్రపంచవ్యాప్తంగా పేరున్న ప్రముఖ జపాన్ బ్రాండ్ అయిన ‘ఆన్‌ట్సుకా టైగర్’ (Onitsuka Tiger) సంస్థకు చెందినవిగా తేలింది. ఈ బ్రాండ్ అందించే ‘సెరానో స్లిప్-ఆన్’ (Serrano Slip-On) కేటగిరీకి చెందినవి ఇవి. లెస్ కట్టే పనిలేకుండా, చాలా సులభంగా కాళ్లలోకి జారవిడుచుకునేలా (Slip-on design) వీటిని తయారు చేశారు. పైన ఉండే ఎలాస్టిక్ భాగం సాగే గుణం కలిగి ఉండటం వల్ల ధరించడానికి ఎంతో సౌకర్యంగా ఉంటాయి. స్టైల్‌తో పాటు కంఫర్ట్‌కు పెద్దపీట వేసే ఈ లగ్జరీ స్నీకర్స్ ధర విషయానికి వస్తే.. మన దేశం కరెన్సీలో దీని విలువ సుమారు రూ. 10,500 వరకు ఉంటుందని తెలుస్తోంది. ఏదేమైనా ఈ ఇద్దరు దిగ్గజ నటుల సింప్లిసిటీ , ట్రెండీ ఫ్యాషన్ ఛాయిస్‌ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవికి భార్యగా, చెల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. 20 ఏళ్లుగా తగ్గని స్టార్ డమ్..

మమ్ముట్టి…

మోహన్ లాల్

ఎక్కువ మంది చదివినవి : Gulabi Movie: ఒక్క పాటతో స్టార్ డమ్.. గులాబీ సినిమాను మిస్సైన హీరోయిన్.. ఎవరంటే..

Follow Us