AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విద్యార్థులు ఈ అలవాట్లను వదులుకుంటే చాలు.. లైఫ్‌లో సక్సెస్ అవ్వడం పక్కా.. అస్సలు లైట్ తీసుకోవద్దు..

విద్యార్థి దశ మనిషి జీవితానికి అసలైన పునాది.. ఈ సువర్ణయుగంలో వేసే ప్రతి అడుగు భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కానీ తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లు, చెడు అలవాట్లు ఆ బంగారు భవిష్యత్తును ఎలా అంధకారంలోకి నెట్టేస్తాయో తెలుసా? విద్యార్థులు తప్పుకుండా తెలుసుకోవాల్సిన కొన్ని కీలకమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

విద్యార్థులు ఈ అలవాట్లను వదులుకుంటే చాలు.. లైఫ్‌లో సక్సెస్ అవ్వడం పక్కా.. అస్సలు  లైట్ తీసుకోవద్దు..
Tips For Students To Succeed In CareerImage Credit source: Getty Images
Krishna S
|

Updated on: Nov 17, 2026 | 8:55 PM

Share

విద్యార్థి దశ మనిషి జీవితంలో అత్యంత కీలకమైన, పునాది లాంటి సమయం. ఈ దశలో మనం ఎలా ప్రవర్తిస్తామో, ఎలాంటి అలవాట్లను అలవర్చుకుంటామో దానిపైనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కఠోర శ్రమ, మంచి అలవాట్లు ఉన్నత శిఖరాలకు చేరిస్తే.. చిన్న చిన్న చెడు అలవాట్లు, అజాగ్రత్తలు జీవితాన్ని నాశనం చేస్తాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు తమ విజయానికి అడ్డంకిగా మారే కొన్ని పొరపాట్లకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ‘‘కాలం ఎవరికోసమూ ఆగదు’’ అంటారు. సమయం చాలా విలువైనది. దానిని వృథా చేయకుండా సరిగ్గా ఉపయోగించుకునేవారే భవిష్యత్తులో మంచి స్థితికి చేరుకుంటారు. డాక్టర్లు, ఇంజనీర్లు లేదా సివిల్స్ వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించాలంటే టైమ్ మేనేజ్‌మెంట్ ఎంతో ముఖ్యం. సమయాన్ని సరిగ్గా నిర్వహించకపోతే పనులు పెండింగ్‌లో పడిపోతాయి. కాబట్టి ఉదయాన్నే త్వరగా నిద్రలేవడం, చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకోవడం వంటి అలవాట్లు చేసుకోవాలి.

నిర్లక్ష్యం

చదువులో లేదా భవిష్యత్తు వృత్తి జీవితంలో చేసే చిన్న పొరపాట్లు కూడా పెద్ద సమస్యలకు దారితీస్తాయి. అందువల్ల విద్యార్థులు ప్రతి పనిపై శ్రద్ధ పెట్టాలి. అజాగ్రత్తగా ఉండకుండా, తాము చేసే ప్రతి పనిని బాధ్యతగా పూర్తి చేసే లక్షణాన్ని పెంపొందించుకోవాలి.

ఏకాగ్రత లోపం

విద్యార్థి దశలో మనసు చంచలంగా ఉండటం సహజం. చదువుపై దృష్టి పెట్టాల్సిన సమయంలో వినోదాలు, సోషల్ మీడియాపై సమయం కేటాయిస్తే జీవితంలో విజయం సాధించడం అసాధ్యం. లక్ష్యంపై పూర్తి స్పష్టత, చదువుపై ఏకాగ్రత ఉండాలి. ఏకాగ్రతను మెరుగుపరుచుకోవడానికి క్రమం తప్పకుండా ధ్యానం, యోగా సాధన చేయడం ఎంతో మేలు చేస్తుంది.

విమర్శను అంగీకరించకపోవడం

తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా శ్రేయోభిలాషులు చెప్పే సలహాలను వినడానికి చాలామంది యువత కోపగించుకుంటారు. కానీ వారు చెప్పే ప్రతి మాట వెనుక మన మంచే ఉంటుందనే విషయాన్ని గ్రహించాలి. పెద్దల సలహాలను సానుకూలంగా స్వీకరించి, మన తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు సాగినప్పుడే విజయ సోపానాలను అధిరోహించగలుగుతాము.

పనులను వాయిదా వేయడం

రేపు చేద్దాంలే అనుకుంటూ చదువులను, అసైన్‌మెంట్‌లను వాయిదా వేసే అలవాటు చాలా మందిలో కనిపిస్తుంది. పైకి చిన్నదిగా కనిపించే ఈ అలవాటు విద్యార్థుల విలువైన సమయాన్ని వృథా చేయడమే కాక, భవిష్యత్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఏ పనిచేనైనా సకాలంలో పూర్తి చేయడం ఉత్తమం.

ఈ అలవాట్లకు కూడా దూరంగా ఉండాలి

వీటితో పాటు మొబైల్ ఫోన్‌ను అధికంగా వాడటం, ఉదయాన్నే ఆలస్యంగా నిద్రలేవడం, శారీరక శ్రమ లేని నిశ్చల జీవనశైలి వంటివి విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తాయి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు కేవలం పుస్తక విద్యనే కాకుండా.. ఇలాంటి విలువైన జీవిత పాఠాలను నేర్పించడం ద్వారా వారిని ప్రయోజకులను చేయవచ్చు. క్రమశిక్షణతో కూడిన విద్యార్థి జీవితమే అద్భుతమైన భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుంది.

Follow Us