AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha Marriage: సమంత- రాజ్‌ల పెళ్లి.. అతిథులకు గిఫ్ట్స్ గా ఏమిచ్చారో తెలుసా? వీడియో ఇదిగో

సమంత, రాజ్ నిడిమూరుల వివాహం డిసెంబర్ 1న కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్‌లో అట్టహాసంగా జరిగింది. కేవలం అత్యంత సన్నిహితులు, స్నేహితులు మాత్రమే ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు ఈ నేపథ్యంలో తమ పెళ్లికి వచ్చిన అతిథులకు సమంత- రాజ్ నిడిమోరు సర్ ప్రైజ్ గిఫ్ట్స్ అందించారు.

Samantha Marriage: సమంత- రాజ్‌ల పెళ్లి.. అతిథులకు గిఫ్ట్స్ గా ఏమిచ్చారో తెలుసా? వీడియో ఇదిగో
Samantha Raj Nidimoru Wedding
Basha Shek
|

Updated on: Dec 03, 2025 | 8:40 AM

Share

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్న వీరు డిసెంబర్ 1న కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్‌లోని లింగ భైరవి ఆలయంలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సమంత పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ కొత్త దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా సమంత, రాజ్ లకు సంబంధించిన అత్యంత సన్నిహితులు, స్నేహితులు మాత్రమే ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. అందులో సమంత క్లోజ్ ఫ్రెండ్ శిల్పా రెడ్డి కూడా ఉంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో సమంత పెళ్లికి సంబంధించి కొన్ని పోస్టులు పెట్టింది. ఇదే సందర్భంగా పెళ్లికి వచ్చిన అతిథులకు సమంత దంపతులు ఎలాంటి గిఫ్ట్స్ ఇచ్చారన్న విషయాన్ని కూడాశిల్పా రెడ్డి ఓ వీడియో పోస్ట్ రూపంలో పంచుకుంది.

తమ పెళ్లికి హాజరైన అతిథులకు ఓ గిఫ్ట్ ప్యాక్ అందించారు సమంత, రాజ్ నిడిమోరు దంపతులు. ఇందులో ఈషా పూల నుండి తయారు చేసిన అగరబత్తులు, సద్గురువు సందేశం, భారతదేశంలో తయారైన చాక్లెట్ బార్స్, సమంత ఎంచుకున్న సీక్రెట్ ఆల్కెమిస్ట్ బ్రాండ్ పెర్ఫ్యూమ్ బాటిల్స్ ఉన్నాయి. దీంతో పాటు శిల్పా వీడియోలో సమంత పెళ్లి తంతును మొత్తం పంచుకుంది. ఉదయం 6.00 గంటలకు వేడుక ప్రారంభమైనప్పటి నుండి రోజంతా ఎలా గడిచిందో వివరిస్తూ ఈ వీడియోలో తెలిపింది. ప్రస్తుతం సమంత పెళ్లికి సంబంధించి శిల్పా రెడ్డి షేర్ చేసిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

సమంత క్లోజ్ ఫ్రెండ్ శిల్పా రెడ్డి ఇన్ స్టాలో షేర్ చేసిన పోస్ట్..

సమంత- రాజ్ నిడిమోరుల పెళ్లి ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వైస్ కెప్టెన్సీ పోస్ట్ పాయే.. వన్డే టీం నుంచి పీకేసే..
వైస్ కెప్టెన్సీ పోస్ట్ పాయే.. వన్డే టీం నుంచి పీకేసే..
రాత్రి అన్నం మిగిలిందా? రూపాయి ఖర్చు లేకుండా కరకరలాడే వడియాలు
రాత్రి అన్నం మిగిలిందా? రూపాయి ఖర్చు లేకుండా కరకరలాడే వడియాలు
ఏసీ రూముల్లో ఉన్నా శరీరం డీహైడ్రేట్ అవుతుందా..?
ఏసీ రూముల్లో ఉన్నా శరీరం డీహైడ్రేట్ అవుతుందా..?
సమ్మర్లో తులసి మొక్క గుబురుగా పెరగాలంటే గింజలు ఇలా చల్లాలి..
సమ్మర్లో తులసి మొక్క గుబురుగా పెరగాలంటే గింజలు ఇలా చల్లాలి..
ఆధార్ ఉన్నవారికి కేంద్రం అలర్ట్.. యాప్ సేవలు బంద్
ఆధార్ ఉన్నవారికి కేంద్రం అలర్ట్.. యాప్ సేవలు బంద్
భారత వన్డే జట్టులో ఐపీఎల్ హవా.. ఏ టీం నుంచి ఎంతమంది ఉన్నారంటే?
భారత వన్డే జట్టులో ఐపీఎల్ హవా.. ఏ టీం నుంచి ఎంతమంది ఉన్నారంటే?
OTT టాప్ ట్రెండింగ్‌లో రియల్ క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.4 రేటింగ్
OTT టాప్ ట్రెండింగ్‌లో రియల్ క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.4 రేటింగ్
చిన్న పిల్లలకు నూనె మసాజ్ చేయడం వల్ల ఇన్ని లాభాలా? తల్లిదండ్రులు
చిన్న పిల్లలకు నూనె మసాజ్ చేయడం వల్ల ఇన్ని లాభాలా? తల్లిదండ్రులు
రాత్రికి రాత్రే వీరి అప్పులు మొత్తం తీర్చేస్తారు..
రాత్రికి రాత్రే వీరి అప్పులు మొత్తం తీర్చేస్తారు..
ప్రపంచకప్ హీరోతోపాటు మరో ముగ్గురికి మొండిచేయి.. ఇంత అన్యాయమా?
ప్రపంచకప్ హీరోతోపాటు మరో ముగ్గురికి మొండిచేయి.. ఇంత అన్యాయమా?