AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Paradise: కాంబో అదిరింది భయ్యా.. నానితో ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్.. ది ప్యారడైజ్ నుంచి క్రేజీ అప్డేట్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోలలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హీరో నాని. సహజ నటనతో సినిమా ప్రపంచంలో న్యాచురల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు వరుస హిట్లతో ఫుల్ జోష్ మీద దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం నాని నటిస్తున్న సినిమా ది ప్యారడైజ్. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే.

The Paradise: కాంబో అదిరింది భయ్యా.. నానితో ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్.. ది ప్యారడైజ్ నుంచి క్రేజీ అప్డేట్..
Nani
Rajitha Chanti
|

Updated on: Dec 26, 2025 | 11:56 AM

Share

న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ది ప్యారడైజ్. దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నాని జోడిగా కయాదు లోహర్ కథానాయికగా నటించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన రానుంది. ఇప్పటికే విడుదలైన పోసర్స్ మూవీపై మరింత బజ్ క్రియేట్ చేశాయి. అయితే కొన్ని రోజులుగా ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గత రెండు మూడు రోజులుగా ఈ మూవీ హీరోయిన్ ఎవరనే విషయం పై చర్చ జరగ్గా.. ఇప్పుడు మరో క్రేజీ అప్డేట్ తెరపైకి వచ్చింది. లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి : Actor: ఒక్క సినిమాతోనే అమ్మాయిల డ్రీమ్ బాయ్‏గా.. వరుస హిట్లకు కేరాఫ్ అడ్రస్ ఈ హీరో.. క్రేజ్ చూస్తే..

ఈ మూవీలో గ్లామరస్ స్పెషల్ సాంగ్ ఉంటుందని సమాచారం. ఈ పాట కోసం ముందుగా తమన్నాను అనుకున్నప్పటికీ.. అనుహ్యంగా అదే అవకాశం పూజా హెగ్డేకు తలుపు తట్టినట్లు తెలుస్తోంది. ది ప్యారడైజ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసేందుకు పూజా సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. దీంతో ఇప్పుడు ఈ మూవీపై మరింత హైప్ క్రియేట్. కొన్నాళ్లుగా వరుస ప్లాపులతో సతమతమవుతున్న పూజా.. ఇప్పుడు నాని లాంటి డైనమిక్ హీరోతో కలిసి నటిస్తుండడంపై మరింత బజ్ పెరిగింది.

చాలా రోజులుగా సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది పూజా. ఇప్పటివరకు ఆమె నటించిన పలు చిత్రాలు డిజాస్టర్స్ కాగా.. తెలుగులో పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయి.. అయినప్పటికీ తమిళంలో మాత్రం వరుస ఆఫర్స్ అందుకుంటుంది పూజా. చివరగా సూర్య జోడిగా రెట్రో సినిమాలో మెరిసిన ఈ అమ్మడు.. ఇప్పుడు నాని సరసన స్పెషల్ సాంగ్ చేయనుంది.

ఇవి కూడా చదవండి : 1000కి పైగా సినిమాలు.. సిల్క్ స్మిత కంటే ముందే ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్.. చివరి రోజుల్లో ఎంతగా బాధపడిందంటే..

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

ఇవి కూడా చదవండి : Actress Srilakshmi : 500లకు పైగా సినిమాలు.. ఈ నటి మేనకోడలు తెలుగులో క్రేజీ హీరోయిన్.. 300 కోట్లు కొల్లగొట్టింది..

నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..