Champion Movie: ‘ఛాంపియన్’ అదరగొట్టాడు.. శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
బాక్సాఫీస్ వద్ద 'ఛాంపియన్' అదరగొట్టాడు. శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక హీరోగా నటించిన ఈ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు మొదటి రోజే కళ్లు చెదిరే కలెక్షన్లు వచ్చాయి. ఈ మేరకు సినిమా కలెక్షన్ల వివరాలను వైజయంతీ నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

పెళ్లి సందడి తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రోషన్ ఛాంపియన్ గా మన ముందుకు వచ్చాడు. క్రిస్మస్ కానుకగా గురువారం (డిసెంబర్ 25)న రిలీజైన ఈ సినిమాకు ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమా చాలా బాగుందని, రోషన్ యాక్టింగ్ అదిరిపోయిందని, హీరోయిన్ అనస్వర రాజన్ చాలా అందంగా, క్యూట్ గా కనిపించిందని ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఇక ‘ఛాంపియన్’ రివ్యూలు కూడా చాలా వరకు పాజిటివ్ గానే వచ్చాయి. ఈ క్రమంలో మొదటి రోజే రోషన్ సినిమాకు కళ్లు చెదిరే కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమా కు ప్రపంచవ్యాప్తంగా రూ.4.5 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఛాంపియన్ మూవీ కొత్త పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది.
ప్రదీప్ అద్వైతం తెరకెక్కించిన ఛాంపియన్ సినిమాలో హీరో, హీరోయిన్లతో పాటు సంతోష్ ప్రతాప్, అవంతిక, కృతి కంజ్ సింగ్ రాథోడ్, హైపర్ ఆది తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఓ క్యామియో రోల్ లో ఆకట్టుకున్నారు. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై ప్రియాంక దత్, జీకే మోహన్, జెమిని కిరణ్ సంయుక్తంగా ఈ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను నిర్మించారు. మిక్కీ జే మేయర్ ఈ మూవీకి స్వరాలు సమకూర్చారు. బ్రిటీష్ కాలంలో జరిగిన బైరాన్‌పల్లి గ్రామంలో జరిగిన ఘటన నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.
ఛాంపియన్ మొదటి రోజు కలెక్షన్ల వివరాలివే..
A HOUSEFULL festive day at the cinemas ❤️🔥
People’s #CHAMPION opens big with 4.5 CRORE+ worldwide GROSS on Day 1 💥
Experience the historic journey on the big screen now.@IamRoshanMeka @PradeepAdvaitam #AnaswaraRajan @ActorSanthosh @madhie1 @MickeyJMeyer @AshwiniDuttCh… pic.twitter.com/jL0uSEGcjm
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) December 26, 2025
సినిమా ప్రమోషన్లలో హీరో రోషన్.. వీడియో..
𝐇𝐎𝐔𝐒𝐄𝐅𝐔𝐋𝐋𝐒 𝐚𝐧𝐝 𝐨𝐮𝐫 𝐇𝐄𝐀𝐑𝐓𝐒 𝐚𝐫𝐞 𝐅𝐔𝐋𝐋 🫶
Our #Champion and Chandrakala received a overwhelming welcome from the audience at Mallikarjuna theatre, Hyderabad 🤩❤️🔥#PeoplesCHAMPION running successfully in cinemas near you!@IamRoshanMeka @PradeepAdvaitam… pic.twitter.com/qSKMX8xoRe
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) December 25, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




