AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఆ 17 మంది పిల్లలు ఏమయ్యారు? ఓటీటీలోకి 2400 కోట్ల హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

ఈ సినిమా కోసం రూ.335 కోట్ల బడ్జెట్ ఖర్చు పెడితే ఓవరాల్ గా రూ.2,400 కోట్ల రికార్డు కలెక్షన్స్ తెచ్చిపెట్టింది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమాలోని ఊహించని ట్విస్టులు, ఉత్కంఠభరిత సన్నివేశాలు ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించాయి

OTT Movie: ఆ 17 మంది పిల్లలు ఏమయ్యారు? ఓటీటీలోకి 2400 కోట్ల హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
Weapons Movie
Basha Shek
|

Updated on: Dec 25, 2025 | 3:13 PM

Share

థియేటర్లు అయినా, ఓటీటీలయినా ప్రజెంట్ హారర్ థ్రిల్లర్ సినిమాలదే హవా. భాషతో సంబంధం లేకుండా మరీ ఈ సినిమాలను చూసేస్తున్నారు ఆడియెన్స్. ముఖ్యంగా ఓటీటీలో ఈ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే ప్రతివారం పలు ఓటీటీ సంస్థలు ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాలను అనువాదం చేసి మరీ ఆయా భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. అలా ఇప్పుడు ఓ బిగ్గెస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి రానుంది. ఈ ఏడాది ఆగస్టులో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. సుమారు రూ. 335 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ ఓవరాల్ గా రూ. 2400 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఐఎమ్ డీబీలోనూ ఈ సినిమాకు 7.5 రేటింగ్ దక్కడం విశేషం. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ ప్లస్, వుడు గూగుల్ వీడియోప్లే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. కాకపోతే రెంటల్ బేసిస్ లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో చాలా మంది ఈ సినిమాను చూడలేకపోతున్నారు. అందుకే  ఇప్పుడు కొత్తగా  మరో ఓటీటీలోకి ఈ బ్లాక్ బస్టర్ సినిమా రానుంది. అది కూడా ఉచితంగా చూసే అవకాశం. తెలుగులోనూ ఈ బ్లాక్ బస్టర్ మూవీ  అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంది.

ఇవి కూడా చదవండి

ఈ సినిమా కథ విషయానికి వస్తే..  మేబ్రూక్ అనే ఊరి చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. సరిగ్గా రాత్రి 2:17 గంటలకు.. ఇళ్లలో ఉన్న 17 మంది చిన్న పిల్లలు ఒకేసారి  అదృశ్యమైపోతారు. వాళ్లు తిరిగి ఇంటికి రారు. ఒక స్కూల్ క్లాస్ రూమ్‌లో మిగిలిన పిల్లలందరూ మాయమైపోతే.. ఒక్క పిల్లాడు మాత్రమే మిగులుతాడు. దీంతో అందరి అనుమానం ఆ క్లాస్ టీచర్ జస్టిన్ మీద పడుతుంది. ఇంతకీ ఆ 17 మంది పిల్లలు ఏమయ్యారు? ఆ టీచర్ పాత్ర ఏంటి? ఆ ఒక్క పిల్లాడు ఎలా మిగిలాడు? అన్న ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఈ హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు వెపన్స్. జనవరి 08 నుంచి ఈ మూవీ జియో హాట్ స్టార్ లో ఫ్రీగా స్ట్రీమింగ్ కు రానుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ సంస్థ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది.

జియో హాట్ స్టార్ లో ఫ్రీగా స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్