Actor AVS: 500కు పైగా సినిమాలు చేసిన ఈ నటుడు గుర్తున్నాడా? ఈయన కూతురు, అల్లుడు కూడా తెలుగులో స్టార్ నటులే
500కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు ఏవీఎస్ అలియాస్ ఆమంచి వెంకటసుబ్రహ్మణ్యం. టాలీవుడ్ స్టార్ కమెడియన్ గా తెలుగు ఆడియెన్స్ మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అయితే ఈ నటుడి కూతురు, అల్లుడు కూడా సినిమాల్లో నటిస్తున్నారన్న విషయం చాలా మందికి తెలియదు.

ఏవీఎస్ పూర్తి పేరు ఆమంచి వెంకటసుబ్రహ్మణ్యం. సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు రంగస్థల కళాకారుడిగా, మిమిక్రీ ఆర్టిస్టుగా, జర్నలిస్టుగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘మిస్టర్ పెళ్లాం’ సినిమాతో నటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే నంది అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత మాయలోడు, మా విడాకులు, శుభలగ్నం, ఘటోత్కచుడు, శుభలగ్నం, యమలీల, సమరసింహారెడ్డి, ఇంద్ర, యమగోల మళ్లీ మొదలైంది.. ఇలా దాదాపు 500 కు పైగా సినిమాల్లో నటించారు ఏవీఎస్. 90వ దశకంలో అప్పటికే స్టార్ కమెడియన్లుగా వెలిగిపోతోన్న బ్రహ్మనందం, అలీలకు సమానంగా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఏవీఎస్ కేవలం కమెడియన్ గానే కాక రైటర్ గా, నిర్మాతగా, దర్శకుడిగా, పాటల రచయితగా కూడా అనేక సినిమాలు చేశారు. సూపర్ హీరోస్ సినిమాలో హీరోగా కూడా చేశారు. ఇలా 500కు పైగా సినిమాల్లో నటించి కొన్ని దశాబ్దాల పాటు తెలుగు సినిమా ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించిన ఏవీఎస్ 2013లో కన్నుమూశారు. అయితే తన సినిమాల రూపంలో ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు.
ఇదిలా ఉంటే ఏవీఎస్ కూతురు, అల్లుడు కూడా టాలీవుడ్ లో ప్రముఖ నటీనటులే అన్న విషయం చాలా మందికి తెలియదు. ఏవీఎస్ కూతురుపేరు శ్రీ ప్రశాంతి. తెలుగులో పలు సినిమాల్లో నటించిన శ్రీ ప్రశాంతి ఆ మధ్యన నితిన్ తమ్ముడు సినిమాలోనూ ఓ కీలక పాత్రలో మెరిసింది. ప్రస్తుతం సీరియల్స్ లోనూ నటిస్తోంది. అలాగే యూట్యూబ్, సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంటుంది.
ఏవీఎస్ కూతురు, అల్లుడు..
View this post on Instagram
ఇక ఏవీఎస్ కూతురు ప్రశాంతి ప్రముఖ నటుడు శ్రీనివాస్ ని పెళ్లి చేసుకుంది. శ్రీనివాస్ అలియాస్ యాక్టర్ చింటు తెలుగు, తమిళ్ భాషల్లో అనేక సినిమాల్లో సహాయక నటుడు, విలన్ గా చేశారు. ముఖ్యంగా రవిబాబు అవును సినిమా చింటూకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అలాగే రాజా ది గ్రేట్, ఎఫ్2, ఎఫ్3, వాల్తేరు వీరయ్య.. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లోనూ మంచి పాత్రలు పోషించారు. ఇప్పటికీ స్టార్ హీరోల సినిమాల్లో మెరుస్తున్నాడీ ట్యాలెంటెడ్ నటుడు.
అల్లుడు, కూతురితో నటుడు ఏవీఎస్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




