Tarun : తరుణ్ సినిమాలు మానేయడానికి కారణం అదే.. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే.. రోజా రమణి..
ఒకప్పుడు తెలుగు సినిమా ప్రపంచంలో ప్రేమకథ చిత్రాలతో సంచలనం సృష్టించిన హీరో తరుణ్. అప్పట్లో యూత్ లవర్ బాయ్. బాలనటుడిగా తెరంగేట్రం చేసి.. ఆ తర్వాత హీరోగా వరుస హిట్స్ అందుకున్నారు. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు తరుణ్. కానీ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.

తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన హీరో తరుణ్. ఎన్నో ప్రేమకథ చిత్రాలతో హిట్స్ అందుకున్నాడు. దాదాపు పదేళ్లపాటు బ్యాక్ టూ బ్యాక్ విజయాలను ఖాతాలో వేసుకుని.. అప్పట్లో యూత్ ఫేవరేట్ గా నిలిచాడు. అప్పట్లో లవ్ స్టోరీ సినిమాలతో ట్రెండ్ సెట్ చేసిన తరుణ్.. ఇప్పుడు మాత్రం సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో తరుణ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు ఆయన తల్లి రోజా రమణి. 1967లో బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసి, హీరోయిన్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా 54 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగించారు. ప్రహ్లాద వంటి పాత్రలతో పేరుపొందిన ఆమె, 500 పైగా చిత్రాలకు డబ్బింగ్ చెప్పి, ఎందరో హీరోయిన్లకు ప్రాణం పోశారు.
ఇవి కూడా చదవండి : Ranu Bombaiki Ranu Song : యూట్యూబ్ సెన్సేషన్.. రానూ బొంబాయికి రాను పాటకు ఎంత అమౌంట్ ఇచ్చారంటే.. డ్యాన్సర్ లిఖిత కామెంట్స్..
హీరోయిన్‌గా, సహాయ నటిగా పలు భాషల్లో వందలాది చిత్రాలలో నటించిన ఆమె, వివాహం తర్వాత డబ్బింగ్ కళాకారిణిగా కొనసాగారు. 500 పైగా చిత్రాలకు డబ్బింగ్ చెప్పి, దాదాపు 400 మంది హీరోయిన్లకు ఆమె గాత్రాన్ని అందించారు. ముగ్గురు మొనగాళ్ళు చిత్రంలో ముగ్గురు హీరోయిన్లకు (నగ్మా, రోజా, రమ్యకృష్ణ) వేర్వేరు వాయిస్ మోడ్యులేషన్స్‌తో డబ్బింగ్ చెప్పడం ఆమె ప్రతిభకు నిదర్శనం. నరేష్, హరీష్ వంటి నటుల లేడీ గెటప్‌లకు కూడా ఆమె డబ్బింగ్ చెప్పడం విశేషం. తెలుగు సినీ పరిశ్రమలో ఐదు దశాబ్దాలకు పైగా తనదైన ముద్ర వేసిన ఒక రోజారమణి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కొడుకు గురించి చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి : Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..
వివాహం తర్వాత, ఆమె నటనకు విరామం ఇచ్చి, డబ్బింగ్ రంగంలోకి ప్రవేశించారు. అనుకోకుండా మొదలైన ఈ ప్రయాణం 500 పైగా చిత్రాలకు గాత్రాన్ని అందించే స్థాయికి చేరింది. సుహాసిని, రమ్యకృష్ణ, మీనా, రోజా, దివ్యభారతి, శిల్పాశెట్టి, దీప్తి భట్నాగర్, మీనాక్షి శేషాద్రి, ఖుష్బూ వంటి సుమారు 400 మంది ప్రముఖ హీరోయిన్లకు ఆమె డబ్బింగ్ చెప్పారు. నటనకు విరామం ఇవ్వడం తన వ్యక్తిగత నిర్ణయమేనని, భర్త చక్రపాణి గానీ, ఇతర కుటుంబ సభ్యులు గానీ ఎప్పుడూ ఒత్తిడి చేయలేదని ఆమె స్పష్టం చేశారు. ఒకప్పుడు హీరోగా స్టార్ డమ్ సంపాదించుకున్న తన తనయుడు తరుణ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉండేందుకు గల కారణాలను వెల్లడించారు. తరుణ్ ఇప్పుడు వ్యాపారరంగంలో బిజీగా ఉన్నారని.. తన దృష్టిని కేవలం బిజినెస్ పై పెట్టారని అన్నారు. అటు సినిమాలతోపాటు.. ఇటు వ్యాపారరంగంలోనూ సక్సె్స్ అయ్యారంటూ చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి : Actor Suresh: సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. ఒక్క మాటలో చెప్పేసిన సీనియర్ హీరో..
ఇవి కూడా చదవండి : Folk Song : యూట్యూబ్‌లో కోట్ల వ్యూస్.. నెల రోజులుగా ఇంటర్నెట్ షేక్.. ఇప్పటికీ దూసుకుపోతున్న పాట..
