Folk Song: యూట్యూబ్‌ను ఊపేస్తోన్న కొత్త ఫోక్ సాంగ్.. ఆ ఒక్క స్టెప్పుతో నెట్టింట ఆగమాగం..
ప్రస్తుతం తెలంగాణ ఫోక్ సాంగ్స్ సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. నిత్యం ఏదోక పాట నెట్టింట సందడి చేస్తుంది. మొన్నటి వరకు రాను బొంబాయికి రాను అనే పాట సంచలనంగా మారింది. ఆ తర్వాత పేరుగల్ల పెద్దిరెడ్డి, బాయిలోనా బల్లిపలికే పాటలకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మరో కొత్త ఫోక్ సాంగ్ నెట్టింట దుమ్మురేపుతుంది. ఇంతకీ ఈ పాటను విన్నారా..?

ఇటీవల కాలంలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. పెళ్లి బరాత్ నుంచి బర్త్ డే పార్టీస్ వరకు.. ప్రతి చిన్న వేడుకలో ఈ ఫోక్ సాంగ్స్ ఉండాల్సిందే. చిన్న పెద్ద అందరూ ఊర మాస్ స్టెప్పులతో అదరగొట్టేస్తున్నారు. ఒకదాని తర్వాత మరొకటి.. నిత్యం ఏదోక ఫోక్ సాంగ్ యూట్యూబ్ లో రిలీజ్ అవుతూ మాస్ అడియన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. ఇటీవలే పేరుగల్ల పెద్దిరెడ్డి, బాయిలోనా బల్లిపలికే, రాను బొంబాయికి రాను వంటి పాటలు నెట్టింటిని అల్లాడించేశాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో ఫోక్ సాంగ్ ట్రెండ్ అవుతుంది. విడుదలైన కొన్ని రోజుల్లోనే యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. ఈ పాటకు ఇన్ స్టాలో రీల్స్ వైరల్ గా మారాయి.
ఇవి కూడా చదవండి : Ranu Bombaiki Ranu Song : యూట్యూబ్ సెన్సేషన్.. రానూ బొంబాయికి రాను పాటకు ఎంత అమౌంట్ ఇచ్చారంటే.. డ్యాన్సర్ లిఖిత కామెంట్స్..
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న కొత్త ఫోక్ సాంగ్ “చికేనే తెత్తడో నా అల్లుడు.. లేక మటనే తెత్తడో నా అల్లుడు.. బీరే తెత్తడో నా అల్లుడు లేక క్వార్టరే తెత్తడో నా అల్లుడు” అంటూ ఈ ఫోక్ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ ను ఊపేస్తుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదిరిపోయే మాస్ బీట్, మాస్ స్టెప్పులతో శ్రోతలకు భలే కిక్ ఇస్తోంది. ఇప్పుడు ఈ పాటను యూట్యూబ్ లో రిపీటెడ్ మోడ్ లో వింటున్నారు. ప్రస్తుతం ఈ పాటకు ఇన్ స్టాలో చిన్న, పెద్ద అందరూ డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సాంగ్ ఇప్పుడు నెట్టింటిని ఆగం చేస్తుంది.
ఇవి కూడా చదవండి : Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..
ఈ పాటను అంజీ పీట్ల రాయగా.. కళ్యాణ్ కీస్ సంగీతం అందించారు. ఫోక్ సింగర్ ప్రభ మరోసారి తన గాత్రంతో అదరగొట్టింది. శేఖర్ వైరస్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో మాస్ స్టెప్పులు సైతం అదిరిపోయాయి. నాలుగు నిమిషాల మూడు సెకన్లు ఉన్న ఈ పాట.. ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతుంది. ఇంతకీ ఈ పాటకు మీరు స్టెప్పులేశారా.. ?
ఇవి కూడా చదవండి : Actor Suresh: సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. ఒక్క మాటలో చెప్పేసిన సీనియర్ హీరో..
ఇవి కూడా చదవండి : Folk Song : యూట్యూబ్‌లో కోట్ల వ్యూస్.. నెల రోజులుగా ఇంటర్నెట్ షేక్.. ఇప్పటికీ దూసుకుపోతున్న పాట..




