Tollywood : మేడమ్.. మీరేనా ఇది.. టాలీవుడ్ హీరోయిన్ ఫస్ట్ ఆడిషన్ వీడియో.. మహేష్ బాబు, ప్రభాస్ తో సినిమాలు..
సోషల్ మీడియాలో నిత్యం ఏదోక ట్రెండ్ నడుస్తూనే ఉంటుంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఆ కొత్త ట్రెండ్ ను ఫాలో అవుతుంటారు. కానీ ఇప్పటివరకు నెట్టింట తమ త్రోబ్యాక్, చిన్ననాటి జ్ఞాపకాలను సైతం సినీతారలు షేర్ చేస్తూనే ఉంటారు. ప్రస్తుతం ఓ హీరోయిన్ త్రోబ్యాక్ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. అందులో ఆమె టాలీవుడ్ క్రేజీ బ్యూటీ. ఇంతకీ ఎవరంటే..

ప్రస్తుతం సోషల్ మీడియాలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ ఫస్ట్ ఆడిషన్ వీడియో తెగ వైరలవుతుంది. ఆమె తెలుగు సినిమాతో నటిగా ప్రయాణం స్టార్ట్ చేసి ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యింది. విమర్శలు, ప్రశంసలు రెండింటిని అందుకుంటూ నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పాన్ ఇండియా లెవల్లో తనకు సెపరేట్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న ఆమె.. మహేష్ బాబు, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇప్పుడు ఆ హీరోయిన్ ఫస్ట్ ఆడిషన్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. అందులో ఆమె వయసు 22 సంవత్సరాలు అని కనిపిస్తుంది. ఆ వీడియోలో తనకు చిన్న దుస్తులు కంఫర్ట్ కాదని తెలిపింది. ఇప్పుడు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు నెటిజన్స్.
ఇవి కూడా చదవండి : Actor Suresh: సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. ఒక్క మాటలో చెప్పేసిన సీనియర్ హీరో..
అందులో కనిపిస్తున్న ఆ హీరోయిన్ మరెవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్. ప్రస్తుతం వైరలవుతున్న ఆ వీడియోలో కృతి మాట్లాడుతూ.. “హాయ్, నేను కృతి సనన్. నా వయసు 5’9. ఇవి నా ప్రొఫైల్స్” అంటూ చెప్పుకొచ్చింది. 2014లో మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే సినిమాతో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది కృతి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత బాలీవుడ్ షిఫ్ట్ అయిన ఈ చిన్నది.. అక్కడే బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ సెటిల్ అయిపోయింది.
ఇవి కూడా చదవండి : Folk Song : యూట్యూబ్లో కోట్ల వ్యూస్.. నెల రోజులుగా ఇంటర్నెట్ షేక్.. ఇప్పటికీ దూసుకుపోతున్న పాట..
ఇటీవల ప్రభాస్ సరసన ఆదిపురుష్ చిత్రంలో సీత పాత్రలో నటించింది. తన నటనపరంగా ప్రశంసలు అందుకున్నప్పటికీ ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇప్పటికీ ఈ సినిమా పై ట్రోల్స్ జరుగుతూనే ఉంటాయి. ఇదెలా ఉంటే.. తేరే ఇష్క్ మే తర్వాత , కృతి సనన్ ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టింది. అలాగ్ కాక్ టెయిల్ 2 అనే చిత్రంలోనూ నటిస్తుంది. ఈ చిత్రం 2012 లో దర్శకుడు హోమి అడజానియా తెరకెక్కించిన కాక్ టెయిల్ సినిమాకు సీక్వెల్. ఇందులో షాహిద్ కపూర్, రష్మిక మందన్న సైతం నటిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Ranu Bombaiki Ranu Song : యూట్యూబ్ సెన్సేషన్.. రానూ బొంబాయికి రాను పాటకు ఎంత అమౌంట్ ఇచ్చారంటే.. డ్యాన్సర్ లిఖిత కామెంట్స్..
