AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress : శ్రీదేవి చనిపోయే ముందు నన్ను కలిసింది.. నాకు ఏం చెప్పిందంటే.. సీనియర్ హీరోయిన్..

సీనియర్ నటి జయమాలిని శ్రీదేవితో తన అనుబంధాన్ని, ఆమె మరణం గురించి చెబుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కృష్ణ, శోభన్ బాబు, ఎంజీఆర్ వంటి దిగ్గజాలతో నటించిన ఆమె.. దశాబ్దాలుగా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. ఆసక్తికర విషయాలు పంచుకుంది.

Actress : శ్రీదేవి చనిపోయే ముందు నన్ను కలిసింది.. నాకు ఏం చెప్పిందంటే.. సీనియర్ హీరోయిన్..
Jayamalini, Sridevi
Rajitha Chanti
|

Updated on: Dec 26, 2025 | 3:04 PM

Share

నటి జయమాలిని తన సినీ కెరీర్‌లో దిగ్గజ నటులతో పనిచేసిన అనుభవాలను, ముఖ్యంగా శ్రీదేవి మరణంపై తన భావోద్వేగాలను పంచుకున్నారు. సినీ రంగంలో ఒకప్పుడు తాను అత్యంత వేగంగా డ్యాన్స్ చేసేదానినని, కృష్ణ వంటి నటులు తన వేగాన్ని అందుకోవడానికి కష్టపడేవారని గుర్తుచేసుకున్నారు. ఎంజీఆర్, శోభన్ బాబు వంటి ప్రముఖులతో తనకున్న అనుబంధాన్ని వివరించారు. అలాగే శ్రీదేవిని చిన్నతనం నుంచీ తెలిసిన జయమాలిని, శారద గారితో కలిసి శ్రీదేవిని ఒక కార్యక్రమంలో పిలవాలని అనుకున్న ఆరు నెలలకే ఆమె మరణించారని గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యారు. అలాగే సిల్క్ స్మిత జీవితం గురించి కూడా బాధపడ్డారు.

ప్రముఖ నటి జయమాలిని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సిల్క్ స్మిత గురించి మాట్లాడుతూ, ఆమె తన పెళ్లి సమయంలో బొకేతో వచ్చి కారులో కూర్చున్నారని, ఆమె గురించి తాను చాలా బాధపడతానని, తల్లిదండ్రులు పక్కన ఉంటే తన జీవితం మరోలా ఉండేదని అన్నారు. తనది పెద్దలు చూసి నిశ్చయించిన వివాహమని, 1994లో తిరుపతిలో జరిగిందని, 1995లో బాబు పుట్టాడని తెలిపారు. తన తల్లి సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన తనను పెళ్లి చేసుకోవడానికి మొదట అత్తగారు ఇష్టపడకపోయినా, తన ప్రవర్తన, గుడికి వెళ్లడం చూసి మంచి అమ్మాయి అని తెలుసుకొని అంగీకరించారని చెప్పారు.

శ్రీదేవి వంటి ప్రముఖులు కూడా తన తల్లిని డబ్బు గురించి కాకుండా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోమని సలహా ఇచ్చారని వివరించారు. శారద వంటి సీనియర్ నటీమణులతో తనకున్న స్నేహాన్ని గుర్తుచేసుకుంటూ, అందరూ కలిసి గెట్-టుగెదర్‌లు జరుపుకోవాలని ప్లాన్ చేశామని.. అప్పుడే నటి శారద శ్రీదేవిని కూడా పిలవాలని కోరారని..కానీ ఆ తర్వాత ఆరు నెలల్లోనే ఆమె మరణించడం తనను ఎంతగానో కలచివేసిందని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు.

ఇవి కూడా చదవండి : 1000కి పైగా సినిమాలు.. సిల్క్ స్మిత కంటే ముందే ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్.. చివరి రోజుల్లో ఎంతగా బాధపడిందంటే..