OTT Movie: ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో దుమ్మురేపుతోన్న కన్నడ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
కొన్ని నెలల క్రితమే థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు కన్నడ నాట మంచి స్పందన వచ్చింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. ఇప్పుడీ థ్రిల్లర్ మూవీ సడెన్ గా స్ట్రీమింగ్ కు వచ్చింది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.

గత వారం పలు కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగులో పాటు ఇతర భాషలకు చెందిన సినిమాలు కూడా ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సందడి చేస్తున్నాయి. అలా గత వారం ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోన్న సినిమాల్లో ఒక కన్నడ మూవీ కూడా ఉంది. మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఇప్పుడు ప్రస్తుతం ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. ఈ ఏడాది ఆగస్టులో ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సిద్ధార్థ్ అనే యువకుడు చాలా రిజర్వ్ డ్ గా ఉంటాడు. అనుకోకుండా ఒక రాత్రి ట్రిప్ కు వెళతాడు. కానీ వెళ్తూ వెళ్తూ తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం అతని జీవితాన్ని టర్న్ చేస్తుంది. ఊహించని ఫోన్ కాల్, అడవిలో దారి తప్పిపోవడంతో భయంకరమైన అనుభవాలు ఎదురవుతాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పోరాడాల్సి వస్తుంది. అదే సమయంలో అతని ప్రెగ్నెంట్ వైఫ్ బాగా గుర్తు కొస్తుంది. మరి సిద్ధార్థ్ ఆ డేంజరస్ సిట్యూయేషన్ నుంచి బయటపడ్డాడా? తన భార్యను కలుసుకున్నాడా? అసలు సిద్దార్థ్ చిక్కుల్లో పడడానికి కారణమెవరు? వంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఈ సినిమాలో మిస్టరీ, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా నే ఉన్నాయి. అలాగే ట్విస్టులు కూడా ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందిస్తాయి. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సీట్ ఎడ్జ్ ఫీల్ ఇచ్చే ఈ సినిమా పేర వృత్త (Vritta). లికిత్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో మాహిర్ మొహియుద్దీన్, హరిణి సుందరరాజన్, చైత్ర జె. అచార్ ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే శ్రీనివాస్ ప్రభు, మాస్టర్ అనురాగ్, శశికళ తదితరులు సపోర్టింగ్ రోల్స్ లో మెరిశారు. డిసెంబర్ 26 నుంచి జీ5 ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఒరిజినల్ లాంగ్వేజ్ కన్నడ తో పాటు మలయాళం, హిందీ, తమిళ్, తెలుగు లాంగ్వేజెస్‌లో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది. మిస్టరీ థ్రిల్లర్ ఇష్టపడేవాళ్లకి ఈ మూవీ మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.
జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ .. తెలుగు వెర్షన్ కూడా..
Attention! ಕನ್ನಡದ ಹೊಚ್ಚ ಹೊಸ Mystery Thriller movie‘ವೃತ್ತ’ is now streaming on ಕನ್ನಡ ZEE5.
STREAMING NOW #vrittaonzee5 #vritta #vrittafilm #zee5kannada #Z5Kannada pic.twitter.com/eBlW5KuwqN
— ZEE5 Kannada (@ZEE5Kannada) December 29, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




