OTT Movie: అమ్మాయిలకు సైనేడ్ ఇచ్చి చంపే సైకో.. OTTలో రియల్ క్రైమ్ స్టోరీ.. IMDBలోనూ టాప్ రేటింగ్
కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. అతి తక్కువ రోజుల్లోనే .85 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. ఐఎమ్ డీబీలోనూ ఈ మూవీకి టాప్ రేటింగ్ దక్కడం విశేషం.

ప్రస్తుతం మలయాళ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఓటీటీలో ఈ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే ఓటీటీ సంస్థలు కూడా ప్రతి వారం మలయాల సూపర్ హిట్ సినిమాలను ఆయా భాషలకు తగ్గట్టుగా డబ్బింగ్ చేసి మరీ స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఇదొక ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైంది. ఆసక్తికరంగా సాగే కథ కథనాలు, గూస్ బంప్స్ తెప్పించే సీన్స్, ఊహించని ట్విస్టులు ఆడియెన్స్ కు మంచి థ్రిల్ ఇచ్చాయి. అందుకే రిలీజైన అతి తక్కువ వ్యవధిలోనే రూ. 85 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఇదొక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. దేశవ్యాప్తంగా వరుస హత్యలతో భయాందోళనలు రేకెత్తించిన సీరియల్ కిల్లర్ ‘సైనేడ్ మోహన్’ కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. కేరళ-తమిళనాడు సరిహద్దు గ్రామాల్లో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళలను తీసుకెళ్లడం, వారిని సైనేడ్ ఇచ్చి పాశవికంగా హత్యలు చేస్తుంటాడు సైకో కిల్లర్. పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా తప్పించుకుంటుంటాడు. మరి ఈ సీరియల్ కిల్లర్ ను పోలీసులు ఎలా పట్టుకున్నారు? అతను అమ్మాయిలనే ఎందుకు టార్గెట్ చేసుకున్నాడు? చివరకు ఈ సైకో కిల్లర్ ఏమయ్యాడు? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఎక్కడా బోర్ కొట్టకుండా సాగే ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ గా సాగే ఈ మూవీ పేరు కలంకావల్. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఇందులో ‘స్టాన్లీ దాస్’ అనే సీరియల్ కిల్లర్ పాత్రలో అద్భుతంగా నటించారు. అలాగే అతనిని పట్టుకునే పోలీసాఫీసర్ పాత్రలో జైలర్ నటుడు వినాయకన్ యాక్ట్ చేశారు. థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్దమైంది. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన వెలువడింది. కచ్చితమైన తేదీ ప్రకటించకపోయినా జనవరిలో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోనీ లివ్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. కొత్త సంవత్సరం కానుకగా జనవరి 02వ తేదీ నుంచి మమ్ముట్టి సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొచ్చే అవకాశముందని తెలుస్తోంది.
సోనీ లివ్ లో స్ట్రీమింగ్..
The legend returns, darker and deadlier. Mammootty in a performance that will leave you breathless. Biggest blockbuster of the season, #Kalamkaval streaming this January only on Sony LIV!#Mammootty @mammukka #Vinayakan #MammoottyKampany #JithinKJose @rajisha_vijayan pic.twitter.com/3ggagRwcAe
— Sony LIV (@SonyLIV) December 29, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




