OTT Cinema : ప్రియుడితో అమ్మాయి వీడియో కాల్.. చివరకు..ఓటీటీలోకి సరికొత్త రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ..
ఓటీటీలోకి నిత్యం కొత్త కొత్త కంటెంట్ చిత్రాలు వస్తుంటాయి. అటు హార్రర్, సస్పెన్స్ త్రిల్లర్ సినిమాలు చూసేందుకు జనాలు ఆసక్తి చూపిస్తుంటారు. కానీ ఈమధ్య కాలంలో లవ్ అండ్ ఎంటర్టైనర్, కామెడీ డ్రామాలకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా దాదాపు మూడు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తుంది.

ఓటీటీలోకి ఇప్పుడు సరికొత్త రొమాంటిక్ త్రిల్లర్ మూవీ రాబోతుంది. రాజాసాబ్ మూవీ డైరెక్టర్ మారుతి నిర్మించిన మూవీ ఇది. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు బ్యూటీ. ప్రస్తుతం ఐఎండీబీలో 8.8 రేటింగ్ ఉంది. జనవరి 2 నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.ఈ రొమాంటిక్ త్రిల్లర్ మూవీలో అంకిత్ కొయ్య, నీలఖి, నరేష్ వీగే, వాసుకీ కీలకపాత్రలు పోషించారు. అలాగే ఆర్వీ సుబ్రహ్మాణ్యం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
ఇవి కూడా చదవండి : Actor Suresh: సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. ఒక్క మాటలో చెప్పేసిన సీనియర్ హీరో..
కథ విషయానికి వస్తే.. నారాయణ (నరేశ్) క్యాబ్ డ్రైవర్. అతడికి తన కూతురు అలేఖ్య (నీలఖి) అంటే ప్రాణం. ఆమె సంతోషం కోసం ఏమైనా చేస్తాడు. అలేఖ్య ఇంటర్ చదువుతుంటుంది. అనుకోకుండా ఒకరోజు పెట్ ట్రైనర్ అర్జున్ (అంకిత్)తో పరిచయం ఏర్పడుతుంది. కొంతకాలానికి ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. ఒకరోజు అర్జున్ తో అలేఖ్య అసభ్యకరంగా వీడియో కాల్ మాట్లాడుతుంది. ఆ విషయాన్ని గుర్తించిన తల్లి వాసుకీ కూతురిపై చేయి చేసుకుంటుంది. దీంతో కోపం తన ప్రియుడితో కలిసి వెళ్లిపోతుంది అలేఖ్య. వారిద్దరి కోసం నారాయణ సైతం హైదరాబాద్ వెళ్లిపోతాడు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఈ ప్రేమ జంటకు.. అమ్మాయిలను వేధించే ముఠా నుంచి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి.. ? చివరకు నారాయణ తన కూతురిని కలుసుకున్నాడా లేదా ? అనేది సినిమా.
ఇవి కూడా చదవండి : Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..
ఈ సినిమాను రాజాసాబ్ సినిమా డైరెక్టర్ మారుతి నిర్మించారు. ప్రాణంగా చూసుకున్న కూతురు.. ప్రేమ పేరుతో పారిపోయి… ఆ తర్వాత మోసపోతే ఓ తండ్రి పడే బాధ ఎలా ఉంటుందనే అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో మరోసారి తన నటనతో కట్టిపడేశారు నరేశ్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ప్రేక్షకులకు ఈ సినిమా ఎక్కువగా కనెక్ట్ అవుతుంది.
ఇవి కూడా చదవండి : Ranu Bombaiki Ranu Song : యూట్యూబ్ సెన్సేషన్.. రానూ బొంబాయికి రాను పాటకు ఎంత అమౌంట్ ఇచ్చారంటే.. డ్యాన్సర్ లిఖిత కామెంట్స్..
