ఇదెక్కడి సిరీస్ రా బాబు..! దైర్యం ఉన్నవాళ్లే చూడాల్సిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌లలో కొన్నాళ్లుగా హారర్ కంటెంట్ చిత్రాలు అధికంగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. మర్డర్ మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్, ఆసక్తిని రేకెతెత్తించే వెబ్ సిరీస్ నిత్యం సినీప్రియులను ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా హారర్ జోనర్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఓటీటీల్లో హారర్ సినిమాలు చూసేవారి సంఖ్య కూడా ఎక్కువే.

ఓటీటీలో సినిమాలే కాదు వెబ్ సిరీస్ లు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఎన్నో రకాల సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. హారర్, రొమాంటిక్, థ్రిల్లర్ సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దర్శకనిర్మాతలు కూడా అలాంటి సినిమాలే చేయడనికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. థియేటర్స్ లో కొత్త సినిమాలు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అలాగే కొన్ని సినిమాలు సిరీస్ లు డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ ఓటీటీలో దుమ్మురేపుతోంది. ఈ సిరీస్ టాప్ రేటింగ్ తో ఓటీటీని షేక్ చేస్తుంది. ప్రేక్షకులు ఈ సిరీస్ చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంతకూ ఆ సిరీస్ ఏంటంటే..
Year Ender 2025: ఓజీ, సంక్రాంతికి వస్తున్నాం, హిట్3 కాదు.. ఈ ఏడాది బిగెస్ట్ హిట్ సినిమా ఇదే
ఓటీటీలో దుమ్మురేపుతున్న ఈ సిరీస్ ఓ హారర్ థ్రిల్లర్ డ్రామా.. ఈ సిరీస్ ఇప్పుడు ఓటీటీలో సూపర్ హిట్ గా దూసుకుపోతుంది. ఆ సీజన్ మరేదో కాదు బాలీవుడ్ లో తెరకెక్కిన ఖౌఫ్. ఈ సిరీస్‌లో మోనికా పన్వార్ (మధు), రజత్ కపూర్ లీడ్ రోల్స్ చేశారు. పంకజ్ కుమార్, సూర్య బాలకృష్ణన్ దర్శకత్వం వహించారు. ఒక హాస్టల్ గదిలో ఉండే అతీంద్రియ శక్తుల చుట్టూ అల్లిన ఈ భయంకరమైన కథను అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు.
ఆ స్టార్ హీరో నన్ను బెదిరించే వాడు.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్ మీనా
మధు (మోనికా పన్వర్) అనే యువతి గ్వాలియర్ నుంచి ఢిల్లీకి వచ్చి ప్రగతి వర్కింగ్ విమెన్స్ హాస్టల్‌లో ఉంటుంది. ఆ రూమ్‌లో వింత వింత ఘటనలు జరుగుతాయి. మధు తన గత ట్రామాను ఎదుర్కొంటూ, ఆ రూమ్‌లోని అజ్ఞాత శక్తులతో పోరాడాల్సి వస్తుంది. సిరీస్ సూపర్‌నాచురల్ హారర్‌తో పాటు సమాజంలో మహిళలు ఎదుర్కొనే నిజమైన భయాలను కలిపి చూపిస్తుంది. నిజ జీవిత భయాలే ఎక్కువ భయపెడతాయనే కాన్సెప్ట్‌పై ఆధారపడింది ఈ సిరీస్. ఈ సిరీస్ ను అస్సలు మిస్ అవ్వకండి.
అందుకే ఇన్ స్టాలో అలాంటి ఫోటోలు షేర్ చేస్తా.. ఓపెన్‌గా చెప్పేసిన ఇనయ సుల్తానా
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.




