AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా కులం కారణంగా ఛాన్స్‌లు ఇవ్వలేదు.. చిన్న చిన్న పాత్రలు చేసుకోపో అన్నారు : రవికృష్ణ

సీరియల్స్ నుంచి చాలా మంది నటీ నటులు హీరోలుగా, హీరోయిన్స్ గా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలా వచ్చిన వారిలో నటుడు రవికృష్ణ ఒకరు. విరూపాక్ష సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు రవికృష్ణ.. వైవిధ్యమైన పాత్రలో కనిపించి అలరించాడు రవి కృష్ణ.

నా కులం కారణంగా ఛాన్స్‌లు ఇవ్వలేదు.. చిన్న చిన్న పాత్రలు చేసుకోపో అన్నారు : రవికృష్ణ
Actor Ravikrishna
Rajeev Rayala
|

Updated on: Dec 29, 2025 | 2:30 PM

Share

బుల్లి తెర నుంచి వెండి తెరకు అడుగులేసిన వారు చాలా మంది ఉన్నారు.. హీరోలుగా, హీరోయిన్స్‌గా, కమెడియన్స్‌గా సహాయకపాత్రల్లో నటిస్తూ అలరిస్తున్నారు. వారిలో రవికృష్ణ ఒకరు. సీరియల్స్ లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు రవికృష్ణ. బుల్లితెరపై మొగలిరేకులు సీరియల్‌లో దుర్గ పాత్రతో టీవీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు, ఇక  వెండితెరపై విరూపాక్ష సినిమాలో భైరవ పాత్రతో ప్రేక్షకులను భయపెట్టాడు. అలాగే ఇటీవలే దండోరా చిత్రంలో కీలకపాత్రతో ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. తాజాగా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

రవికృష్ణ తన వృత్తిని సీరియల్స్‌కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రారంభించాడు. మొదట్లో రోజుకు 50 రూపాయలు ఇచ్చేవారని అని తెలిపాడు. నటుడిగా మారిన తర్వాత రోజుకు 750 రూపాయలు వరకు చేరుకున్నారు. మొగలిరేకులు సీరియల్‌లోని దుర్గ పాత్ర ఆయనకు విశేష గుర్తింపు తెచ్చిపెట్టింది. సీరియల్స్‌లో చిన్న విరామం లభించినప్పుడు బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్నాడు. అక్కడి నుండి సినిమాల పై దృష్టి సారించి, విరూపాక్షలో మంచి అవకాశాన్ని అందుకున్నాడు. అయితే, ఇండస్ట్రీలో కుల వివక్ష ఒక చేదు అనుభవంగా మిగిలిందని అన్నాడు రవికృష్ణ. కులం కారణంగా సినిమా ఆఫర్స్ కోల్పోయాను అని అన్నాడు.

సినిమా ఆఫర్స్ వచ్చినపుడు అగ్రిమెంట్ చేయటానికి నా పేరు ఇవ్వండి అని అడిగినప్పుడు. తన పాన్ కార్డు లేదా ఆధార్ పంపిన తర్వాత తన పూర్తి పేరు, ఇంటిపేరు తోట చూసి కొన్ని ప్రాజెక్టులు తన చేజారినట్లు ఆయన వెల్లడించాడు. ఈ విధంగా మూడు, నాలుగు ప్రాజెక్టులను కోల్పోయానని తెలిపాడు. కొందరు దర్శకులు నేరుగా చెప్పకుండా హీరో కంటే నువ్వు కొంచెం హైట్ ఎక్కువ ఉన్నావు వంటి కారణాలు చూపించి అవకాశాలు నిరాకరించినట్లు పేర్కొన్నాడు. టెలివిజన్ నటుడిగా సినిమాలకు మారినప్పుడు కూడా అనేక వివక్షలను ఎదుర్కొన్నట్లు రవికృష్ణ తెలిపాడు. నువ్వు సీరియల్ నటుడివి కదా.! చిన్నచిన్న క్యారెక్టర్స్ చేసుకో. ఇక్కడ హీరో అవ్వాలని మైండ్‌లో పెట్టుకోకు అని కొందరు అన్నారని తెలిపాడు. విరూపాక్ష తర్వాత అంతా మారిపోయింది. ప్రస్తుతం తనను ఒక నటుడిగా పరిశ్రమ ఆదరిస్తోందని తెలిపాడు రవికృష్ణ.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.

మెగా పవర్ స్టార్, యంగ్ టైగర్ పాత్రలు యానిమేషన్ రూపంలో!
మెగా పవర్ స్టార్, యంగ్ టైగర్ పాత్రలు యానిమేషన్ రూపంలో!
సెలబ్రిటీల ప్రేమ కొట్టేసిన మూగజీవాలు..ఒక్కో పెట్ ధర లక్షల్లో!
సెలబ్రిటీల ప్రేమ కొట్టేసిన మూగజీవాలు..ఒక్కో పెట్ ధర లక్షల్లో!
రామాయణ క్యాస్టింగ్ చూస్తుంటేనే కళ్లు బైర్లు కమ్మేస్తున్నాయ్
రామాయణ క్యాస్టింగ్ చూస్తుంటేనే కళ్లు బైర్లు కమ్మేస్తున్నాయ్
సెక్యూరిటీని తోసేసి పైన పడ్డ జనం.. భయమేసిందన్న స్టార్​ యాక్టర్​!
సెక్యూరిటీని తోసేసి పైన పడ్డ జనం.. భయమేసిందన్న స్టార్​ యాక్టర్​!
తెలుగు ముగింట్లో మాయ చేస్తున్న మలయాళీ ముద్దుగుమ్మలు
తెలుగు ముగింట్లో మాయ చేస్తున్న మలయాళీ ముద్దుగుమ్మలు
తిరుమల సంపదకే రక్షకులు.. శంఖనిధి, పద్మనిధులు దర్శిస్తే..
తిరుమల సంపదకే రక్షకులు.. శంఖనిధి, పద్మనిధులు దర్శిస్తే..
మరోసారి కలెక్టర్లు, మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్.. ఏమన్నారంటే?
మరోసారి కలెక్టర్లు, మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్.. ఏమన్నారంటే?
దుబాయ్‌లో 20 లక్షల బంగారం కొని, భారత్‌లో అమ్మితే ఎంత మిగులుతుంది?
దుబాయ్‌లో 20 లక్షల బంగారం కొని, భారత్‌లో అమ్మితే ఎంత మిగులుతుంది?
దేశ ప్రజలకు బంపర్ న్యూస్.. తగ్గనున్న వీటి ధరలు..
దేశ ప్రజలకు బంపర్ న్యూస్.. తగ్గనున్న వీటి ధరలు..
మహిళలకు గుడ్ న్యూస్.. రూ.5లక్షలు కాదు ఏకంగా రూ.8 లక్షలు..
మహిళలకు గుడ్ న్యూస్.. రూ.5లక్షలు కాదు ఏకంగా రూ.8 లక్షలు..