AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ స్టార్ హీరో నన్ను బెదిరించే వాడు.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్ మీనా

సీనియర్ హీరోయిన్ మీనా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళంలోనూ సినిమాలు చేసిందీ అందాల తార. స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తెలుగుతో అయితే మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, రజినీ వంటి స్టార్ హీరోలతో అనేక బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది.

ఆ స్టార్ హీరో నన్ను బెదిరించే వాడు.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్ మీనా
Meena
Rajeev Rayala
|

Updated on: Dec 30, 2025 | 11:47 AM

Share

ఒకప్పుడు హీరోయిన్స్ గా రాణించి ఇప్పుడు సహాయక పాత్రల్లో మెప్పిస్తున్నారు కొందరు హీరోయిన్స్. అలాగే అమ్మ, అత్త, వదిన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అలాంటి వారిలో మీనా ఒకరు. తెలుగులో ఒకానొక సమయంలో తోప్ హీరోయిన్ గ పేరు తెచ్చుకున్నారు మీన. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసి స్టార్స్ గా ఎదిగారు మీన. ఇప్పటికీ ఆమె సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు మీన. గతంలో మీనా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేశారు. నటి మీనా తన కెరీర్‌లో నరసింహ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రను కోల్పోయిన వైనం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

నరసింహ సినిమా సమయంలో ఒక విభిన్నమైన పాత్రను చేయాలని మీనా ఆసక్తి చూపగా, ఆమె తల్లి మాత్రం ఆ పాత్ర సరిగా ఉండదని అభిప్రాయపడ్డారట. ఆ పాత్రే నీలాంబరి. మీనా తల్లి సలహా విన్న తర్వాత, చిత్ర దర్శకుడు, హీరోతో సహా చిత్ర బృందం దీనిపై మరోసారి ఆలోచించారట. ఈ పాత్ర చేస్తే తప్పు జరుగుతుందా.? మీనా కెరీర్ కు ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా.? అని ఆలోచించారట. ఆతర్వాత మీనాకు సౌందర్య పోషించిన పాత్రను చేయమని అడగ్గా, ఆమె అంతగా ఆసక్తి చూపించలేదట. తాను చేయాలనుకున్న విభిన్న పాత్రనే చేస్తానని, లేకపోతే అసలు సినిమా చేయనని ఆమె స్పష్టం చేశారు. ఈ కారణంగానే ఆమె ఆ పాత్రను చేయలేకపోయారట.

అయితే, ఆ పాత్రను మీనా చేసి ఉంటే అది ఆమెకు ఒక ల్యాండ్‌మార్క్ క్యారెక్టర్ అయ్యి ఉండేదని దర్శకుడు అభిప్రాయపడ్డారట. మీనా గనుక ఆ పాత్రను పోషించి ఉంటే ఆ పాత్ర మరోలా ఉండేదని దర్శకుడు అన్నారట. అలాగే టాలీవుడ్ హీరోల గురించి మీనా మాట్లాడుతూ.. నేను షూటింగ్ లో చాలా సైలెంట్ గా ఉంటాను. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ , రాజేంద్ర ప్రసాద్ ఇలా అందరితో కలిసి నటించా.. అందరూ షూటింగ్ లో చాలా సరదాగా ఉంటారు. బాలకృష్ణ గారు మనం సైలెంట్ గా ఉన్నా ఆయనే వచ్చి మాట్లాడతారు. చాలా సరదాగా ఉంటారు అని తెలిపారు మీనా. అలాగ మోహన్ బాబు గారు తనను బెదిరించేవారు అని తెలిపారు. ఆయనతో సినిమా చేసేటప్పుడు షూటింగ్ లో అస్సలు మాట్లాడేదాన్ని కాదు అని సరదగా చెప్పారు మీనా. మోహన్ బాబు పైకి సీరియస్ గా కనిపిస్తారు కానీ అయన చాలా సరదాగా మనిషి.. షూటింగ్ సమయంలో ఆయన పిలల్లతో కలిసి ఆడుకునేదాన్ని అంటూ చెప్పుకొచ్చారు మీనా.

ఇవి కూడా చదవండి
Mohan Babu

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.