AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కట్టిపడేస్తున్న యంగ్ హీరోయిన్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న క్రేజీ వీడియో!

సినిమా ఇండస్ట్రీలోకి ఎంతోమంది ముద్దుగుమ్మలు వస్తుంటారు.. వెళ్తుంటారు. కానీ కొందరు మాత్రమే తమ క్యూట్ లుక్స్, ఎక్స్‌ప్రెషన్స్, నటనతో, అంతకుమించి సెలెక్టెడ్ క్యారెక్టర్స్‌తో కుర్రాళ్ల మనసు దోచుకుంటారు. సరిగ్గా ఇలాంటి క్రేజ్‌నే సంపాదించుకుంది ఈ యంగ్ హీరోయిన్. ప్రస్తుతం కెరీర్‌‌లో బిజీగా ఉంది కూడా.

క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కట్టిపడేస్తున్న యంగ్ హీరోయిన్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న క్రేజీ వీడియో!
Young Heroine
Nikhil
|

Updated on: Dec 31, 2025 | 12:34 PM

Share

చిన్న సినిమాలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన నటనతో ఆకట్టుకుంటోంది ఈ భామ. మంచి స్క్రిప్ట్‌లు సెలక్ట్ చేసుకుంటూ తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటోంది. చబ్బీ లుక్స్‌తో, స్వచ్ఛమైన నవ్వుతో తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే దగ్గరైన ఈ సుందరి, ఇప్పుడు సినిమాలతోనే కాదు సోషల్ మీడియా పోస్టులతోనూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా తాజాగా ఈమె షేర్ చేసిన వీడియో ఆకట్టుకుంటోంది.

Varsha Bollamma

Varsha Bollamma

బయట సైలెంట్.. లోపల మాత్రం వయోలెంట్!

సాధారణంగా ఈ బ్యూటీని చూస్తే చాలా సైలెంట్ గా కనిపిస్తుంది. కానీ ఈమె మనసులో ఎన్ని రకాల ఫన్నీ ఆలోచనలు తిరుగుతుంటాయో తాజా వీడియోలో బయటపెట్టేసింది. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లేదా ఎవరైనా సీరియస్ గా మాట్లాడుతున్నప్పుడు మన ముఖం చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది కానీ, మెదడులో మాత్రం ఏవేవో వింత ఆలోచనలు వస్తుంటాయి. సరిగ్గా అదే కాన్సెప్ట్‌ను ఈ చిన్నది తనదైన శైలిలో ఎంతో ఫన్నీగా ఆవిష్కరించింది. ఎదుటివారు ఏదో చెబుతుంటే ఈమె ఇచ్చే రియాక్షన్స్, మధ్యలో వచ్చే ఆ ఫన్నీ థాట్స్ చూస్తుంటే ఎవరైనా సరే నవ్వకుండా ఉండలేరు.

నెటిజన్ల మనసు దోచుకుంటున్న ఎక్స్‌ప్రెషన్స్

ఈ వీడియోలో ఆ ముద్దుగుమ్మ ఇచ్చిన హావభావాలు నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి. “నిజమే కదా.. మన పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది” అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. కేవలం గ్లామర్ ప్రదర్శనకే ప్రాధాన్యత ఇవ్వకుండా, ఇలాంటి రిలేటబుల్ అండ్ ఫన్నీ కంటెంట్‌తో ప్రేక్షకులకు మరింత చేరువవుతోంది ఈ చిన్నది. అందుకే ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్దిసేపట్లోనే వేల సంఖ్యలో లైకులు, షేర్లతో దూసుకుపోతోంది. కింద ఉన్న వీడియోలో చకచకా టైప్ చేస్తూ ..‘2026లో నాకు కావాల్సినవన్నీ లిస్ట్ రాసి దేవుడికి పంపిస్తున్నాను’ అని సరదాగా పోస్ట్ రాసి పెట్టింది. అంతేకాదు, తన ఫ్రెండ్స్ కోసం పాపులర్ గేమ్ GTA 6 కూఆ 2026లో రిలీజ్ కావాలని కోరుకుంటున్నానని జత చేసింది.

కెరీర్ పరంగా దూసుకుపోతున్న భామ

తెలుగులో ఒక చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత వరుసగా పెద్ద ప్రాజెక్టులలో అవకాశాలు దక్కించుకుంటోంది ఈ నటి. కేవలం హీరోయిన్ గానే కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా యువ హీరోల సరసన ఈమె కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుండటంతో మేకర్స్ కూడా ఈమె వైపు మొగ్గు చూపుతున్నారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు ఇలా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉండటం ఈమెకు ప్లస్ పాయింట్ అవుతోంది.

మొత్తానికి తన మనసులోని ‘ఫన్నీ థాట్స్’ పేరుతో ఈ ముద్దుగుమ్మ చేసిన సందడి ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ క్వీన్ రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.