AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా హృదయం బరువెక్కింది.. ఇది చెప్పలేని బాధ..! ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన బండ్ల గణేష్

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఇప్పుడేమీ సినిమాలు చేయడం లేదు. కానీ సినిమా హీరోల ఫంక్షన్లకు, సినిమా సక్సెస్ ఈవెంట్లకు తరచూ హాజరవుతున్నారు. ఎప్పటిలాగే తన కామెంట్స్ తో నెట్టింట ట్రెండ్ అవుతున్నారు. త్వరలోనే నిర్మాత బిజీ కానున్నారు.

నా హృదయం బరువెక్కింది.. ఇది చెప్పలేని బాధ..! ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన బండ్ల గణేష్
Bandla Ganesh
Rajeev Rayala
|

Updated on: Dec 31, 2025 | 12:32 PM

Share

నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ప్రస్తుతం సినిమాలు తగ్గించారు. నటుడిగా కెరీర్ మొదలు పెట్టిన ఆయన.. ఆతర్వాత నిర్మాతగా మారారు. నటుడిగా స్టార్ హీరోల సినిమాల్లో చిన్న పాత్రలు, కొన్ని కీలక పాత్రల్లో కనిపించిన బండ్ల గణేష్. ఆతర్వాత నిర్మాతగా మారి సినిమాలు చేసి మెప్పించారు. ఆంజనేయులు సినిమాతో నిర్మతగా మొదలు పెట్టి గబ్బర్ సింగ్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు బండ్ల గణేష్. ఈ సినిమా తర్వాత టెంపర్ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చిన బండ్ల ఇప్పుడు తిరిగి సినిమాల్లో బిజీ కానున్నారు. ఇప్పటికే బీజీ బ్లాక్ బస్టర్ అనే బ్యానర్ ను అనౌన్స్ చేశారు. త్వరలోనే ఈ బ్యానర్ లో వరుసగా సినిమాలు చేయనున్నారు.

Year Ender 2025: ఓజీ, సంక్రాంతికి వస్తున్నాం, హిట్3 కాదు.. ఈ ఏడాది బిగెస్ట్ హిట్ సినిమా ఇదే

కాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బండ్ల గణేష్.. తాజాగా ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. “2025 సంవత్సరం ముగుస్తోంది అనగానే నా హృదయం భారంగా మారుతోంది. ఎందుకంటే ఇది కేవలం ఒక సంవత్సరం కాదు.. నా జీవితాన్ని తిరిగి రచించిన కాలం. నా బతుకుకి కొత్త అర్థం, కొత్త దారి చూపించిన మహత్తర సమయం. భగవంతుడు స్వయంగా మనుషుల రూపంలో నా జీవితంలో అడుగుపెట్టి, నేను ఊహించనంత ప్రేమను, అండను, అద్భుతాలను ప్రసాదించిన సంవత్సరం ఇది”

ఇవి కూడా చదవండి

ఆ స్టార్ హీరో నన్ను బెదిరించే వాడు.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్ మీనా

ఇలాంటి దివ్యమైన రోజులు వెళ్ళిపోతున్నాయంటే.. ఎందుకో చెప్పలేని బాధ, మధురమైన వేదన కలుగుతోంది. భగవంతుని నేను ఒక్కటే ప్రార్థిస్తున్నాను.. 2025 లాగా ఆశ నింపే రోజులు, విశ్వాసాన్ని బలపరిచే సంఘటనలు, సంకల్పాన్ని దృఢం చేసే అనుభవాలు రాబోయే ప్రతి సంవత్సరంలో కూడా నాకు, మన అందరికీ దక్కాలని. అందరి జీవితాల్లో వెలుగు నిండాలి, అందరి ప్రయాణాలు అర్థవంతంగా మారాలి. అదే నా హృదయపూర్వక సంకల్పం.” అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు బండ్లగణేష్. ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

అందుకే ఇన్ స్టాలో అలాంటి ఫోటోలు షేర్ చేస్తా.. ఓపెన్‌గా చెప్పేసిన ఇనయ సుల్తానా

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.

ఎగ్జైటెడ్‌గా రామ్ చరణ్.. అభిమానులను మెప్పిస్తాడా?
ఎగ్జైటెడ్‌గా రామ్ చరణ్.. అభిమానులను మెప్పిస్తాడా?
1200 కోట్ల సినిమా.. దెబ్బకు కనిపించకుండా పోయిన హీరో.. మూడేళ్లకు..
1200 కోట్ల సినిమా.. దెబ్బకు కనిపించకుండా పోయిన హీరో.. మూడేళ్లకు..
శ్రేయస్‌కు నో ఛాన్స్.. 3వ స్థానంలో ఇషాన్ ఫిక్స్: సూర్యకుమార్
శ్రేయస్‌కు నో ఛాన్స్.. 3వ స్థానంలో ఇషాన్ ఫిక్స్: సూర్యకుమార్
27 ఏళ్ల తర్వాత సొంత నక్షత్రంలో శని.. ఈ రాశులవారికి జాక్‌పాట్
27 ఏళ్ల తర్వాత సొంత నక్షత్రంలో శని.. ఈ రాశులవారికి జాక్‌పాట్
వారికి సూపర్ గుడ్ న్యూస్.. ఈ నెల 23 వరకు 50 శాతం డిస్కౌంట్..
వారికి సూపర్ గుడ్ న్యూస్.. ఈ నెల 23 వరకు 50 శాతం డిస్కౌంట్..
ఇమ్యూనిటీ, జీర్ణక్రియ ఇబ్బందులకు ఈ 5 ఫుడ్స్‌తో చెక్ పెట్టేయచ్చు
ఇమ్యూనిటీ, జీర్ణక్రియ ఇబ్బందులకు ఈ 5 ఫుడ్స్‌తో చెక్ పెట్టేయచ్చు
SIPలో ఏడాదిగా రాబడి లేదా.. అయితే ఇలా చేయండి!
SIPలో ఏడాదిగా రాబడి లేదా.. అయితే ఇలా చేయండి!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు శుభవార్త.. అకౌంట్లోకి డబ్బులు వచ్చాయ్.
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు శుభవార్త.. అకౌంట్లోకి డబ్బులు వచ్చాయ్.
టికెట్ రేట్ల పెంపుపై 90 రోజుల ముందే డెసిషన్..
టికెట్ రేట్ల పెంపుపై 90 రోజుల ముందే డెసిషన్..
పెంపుడు కుక్కకు 'నిలువెత్తు బంగారం'తో తులాభారం.. ఎందుకో తెలిస్తే
పెంపుడు కుక్కకు 'నిలువెత్తు బంగారం'తో తులాభారం.. ఎందుకో తెలిస్తే