AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మారుతి ఇంటికి ఊహించని గిఫ్ట్ పంపిన ప్రభాస్ ఫ్యాన్స్.. దెబ్బకు షాక్ అయిన డైరెక్టర్

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా పై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు.

మారుతి ఇంటికి ఊహించని గిఫ్ట్ పంపిన ప్రభాస్ ఫ్యాన్స్.. దెబ్బకు షాక్ అయిన డైరెక్టర్
Maruti
Rajeev Rayala
|

Updated on: Dec 31, 2025 | 12:16 PM

Share

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా హారర్ , కామెడీ నేపథ్యంలో తెరకెక్కించాడు దర్శకుడు మారుతి. జనవరి 9న ఈ సినిమాను గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ప్రభాస్ ఈ సినిమాలో సరికొత్తగా కనిపించనున్నారు. చాలా కాలంగా యాక్షన్ సినిమాలతో మెప్పిస్తున్న ప్రభాస్.. ఇప్పుడు రాజా సాబ్ సినిమాతో ఎంటర్టైనర్ తో రానున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, ఫొటోస్, సాంగ్స్, ట్రైలర్స్ సినిమా పై అంచనాలను పెంచేశాయి. ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు.

Year Ender 2025: ఓజీ, సంక్రాంతికి వస్తున్నాం, హిట్3 కాదు.. ఈ ఏడాది బిగెస్ట్ హిట్ సినిమా ఇదే

అలాగే తాజాగా ఈ సినిమా నుంచి రెండో ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. జనవరి 9న సినిమా చూడటానికి ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. కాగా ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మారుతి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ప్రభాస్ ను చూస్తూ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు మారుతి. అలాగే సినిమా ఎక్కడైనా నిరాశపరిస్తే నా ఇంటికి వచ్చేయండి అంటూ అడ్రస్ కూడా చెప్పారు మారుతి. ఆయన మాటలు వింటే సినిమా పై ఆయన ఎంత నమ్మకంగా ఉన్నారో అర్ధమవుతుంది.

ఇవి కూడా చదవండి

ఆ స్టార్ హీరో నన్ను బెదిరించే వాడు.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్ మీనా

అయితే తాజాగా మారుతి ఇంటికి ఓ బహుమతిని పంపించారు ప్రభాస్ అభిమానులు. ప్రీ రిలీజ్ తర్వాత విడుదల చేసిన ట్రైలర్ మెప్పించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఆ ఆనందంలోనే మారుతి ఇంటికి బిర్యానీ గిఫ్ట్ గా పంపించారు అభిమానులు. ఆ బిర్యానీ పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ “డార్లింగ్స్ మాటల్లో చెప్పలేను… ఇంటికి వచ్చిన వెంటనే దీన్ని చూసి ఆశ్చర్యపోయాను. బిర్యానీని పంపినందుకు ధన్యవాదాలు. జనవరి 9న మీకు నేను మరింత ఇస్తాను ” అంటూ రాసుకొచ్చారు మారుతి. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

అందుకే ఇన్ స్టాలో అలాంటి ఫోటోలు షేర్ చేస్తా.. ఓపెన్‌గా చెప్పేసిన ఇనయ సుల్తానా

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.