AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిరంజీవి, ప్రభాస్ సినిమాలు పెద్ద హిట్ అవ్వాలి.. ఈ సంక్రాంతి నిజమైన సినిమా పండగ : నవీన్ పోలిశెట్టి

మూడు వరుస ఘన విజయాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి, 2026 సంక్రాంతికి తన తదుపరి చిత్రం 'అనగనగా ఒక రాజు'తో అలరించనున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా, శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది.

చిరంజీవి, ప్రభాస్ సినిమాలు పెద్ద హిట్ అవ్వాలి.. ఈ సంక్రాంతి నిజమైన సినిమా పండగ : నవీన్ పోలిశెట్టి
Naveen Polishetty
Rajeev Rayala
|

Updated on: Dec 31, 2025 | 11:50 AM

Share

అసలుసిసలైన పండగ చిత్రంగా జనవరి 14న థియేటర్లలో అడుగుపెట్టనున్న ‘అనగనగా ఒక రాజు’పై భారీ అంచనాలు ఉన్నాయి. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ప్రచార చిత్రాలలో వైవిధ్యం చూపిస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది ఈ చిత్రం. ఇక తాజాగా మరో వైవిధ్యమైన వేడుకను నిర్వహించింది చిత్ర బృందం. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ లో ‘రాజు గారి పెళ్లి రిసెప్షన్ వేడుక’ను ఘనంగా నిర్వహించారు. నవీన్‌ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి ‘అనగనగా ఒక రాజు’ చిత్రంలోని ‘భీమవరం బాల్మా’, ‘రాజు గారి పెళ్లిరో’ పాటలకు వేదికపై డాన్స్ చేసి అందరిలో ఉత్సాహం నింపారు. అతిథులందరికీ స్వాగతం పలికి, నిజంగానే పెళ్లి రిసెప్షన్ వేడుకను తలపించారు. ఇక నవీన్‌ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నూతన వధూవరులులా వేదికపై కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాత్రికేయలు బంధుమిత్రుల్లా ఒక్కొక్కరిగా వేదికపైకి వచ్చి.. ఆ జంటను ఆశీర్వదించడం, గిఫ్ట్ కవర్ ఇచ్చి వారిని ఓ ప్రశ్న అడగటం.. ఇలా ఎంతో కొత్తగా, సరదాగా ఈ వేడుక నడిచింది.

Year Ender 2025: ఓజీ, సంక్రాంతికి వస్తున్నాం, హిట్3 కాదు.. ఈ ఏడాది బిగెస్ట్ హిట్ సినిమా ఇదే

ఈ వేడుకలోనవీన్‌ పొలిశెట్టి మాట్లాడుతూ.. “ఈ నూతన సంవత్సరం 2026 అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను. 2024 అనేది నా జీవితంలో క్లిష్టమైన సంవత్సరం. వరుసగా మూడు విజయాలు అందుకున్న తర్వాత అదే ఉత్సాహంలో మీ ముందుకు మరో అదిరిపోయే సినిమాని తీసుకొద్దాం అనుకున్నాను. కానీ, ఒక యాక్సిడెంట్ జరగడం వల్ల నేను షూటింగ్ కి దూరమయ్యాను. మానసికంగా, శారీరకంగా కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. అయితే అదే సమయంలో మా బృందంతో కలిసి ఈ ‘అనగనగా ఒక రాజు’ కథ రాసుకోవడం జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి షూటింగ్ మొదలుపెట్టాము. ఆ సమయంలో ‘అన్నా సినిమా ఎప్పుడు?’ అని చాలామంది మెసేజ్ లు చేశారు. మీ అందరి ప్రేమ, మద్దతు వల్లే నేను త్వరగా కోలుకోగలిగాను. మీ అందరికీ పేరుపేరునా కృతఙ్ఞతలు. మీ అందరి ప్రేమతోనే మేము ఈ సినిమా షూటింగ్ ని సరదాగా ఆరు నెలల్లో పూర్తి చేయగలిగాము. సినిమా చాలా చాలా బాగా వచ్చింది. ఇంతటి వినోదాత్మక చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేద్దామనే చర్చ వస్తే.. సంక్రాంతికి విడుదల చేస్తే బాగుంటుందని మా నిర్మాతలు భావించారు.

ఆ స్టార్ హీరో నన్ను బెదిరించే వాడు.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్ మీనా

నేను ప్రేక్షకుల నుంచి వచ్చిన వాడినే. ఒకప్పుడు నేను ఏ హీరోల సినిమాలైతే థియేటర్ కి వెళ్ళి చూసేవాడినో.. ఇప్పుడు ఆ అభిమాన హీరోల సినిమాలతో పాటు, నా సినిమా విడుదలవుతుండటం సంతోషంగా ఉంది. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి వల్లే ఇంతటి వినోదంతో నిండిన ఈ చిత్రాన్ని సంక్రాంతి పండుగకు తీసుకొస్తున్నాము. సంక్రాంతికి సినిమా అంటేనే వినోదం. అందులో ఒక వైబ్ ఉంటుంది. నేను, మీనాక్షి సహా టీమ్ అందరం మనసు పెట్టి పనిచేశాం. జనవరి 14న విడుదలవుతున్న ‘అనగనగా ఒక రాజు’ చిత్రాన్ని మీరు కుటుంబంతో కలిసి చూసి ఆనందిస్తారని మేము ఎంతో ఆసక్తిగా ఎదురుచూసున్నాము. ఈ సంక్రాంతికి విడుదలవుతున్న చిరంజీవి గారి ‘మన శంకర వరప్రసాద్ గారు’, ప్రభాస్ గారి ‘ది రాజా సాబ్’తో పాటు అన్ని సినిమాలు విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఇన్ని మంచి సినిమాలతో ఈసారి సంక్రాంతి నిజంగానే తెలుగు ప్రేక్షకులకు సినిమా పండగను తీసుకొని వస్తుంది. తెలుగు సినిమాల సౌండ్ ప్రపంచవ్యాప్తంగా వినిపించాలని కోరుకుంటున్నాను.” అన్నారు.

ఇవి కూడా చదవండి

అందుకే ఇన్ స్టాలో అలాంటి ఫోటోలు షేర్ చేస్తా.. ఓపెన్‌గా చెప్పేసిన ఇనయ సుల్తానా

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.

Follow Us