Maadhavi Latha: టాలీవుడ్ హీరోయిన్‌కు బిగ్ షాక్.. దేవుడిపై దుష్ప్రచారం.. పోలీస్ కేసు నమోదు
టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ మాధవీలత చిక్కుల్లో పడింది. ఆమెపై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దేవుడిపై సోషల్ మీడియాలో అభ్యంతరకరంగా పోస్టులు పెట్టారని మాధవీలతతో పాటు పలువురు యూట్యూబర్లపై కేసులు నమోదు చేసినట్లు సరూర్ నగర్ పోలీసులు తెలిపారు.

నచ్చావులే, స్నేహితుడా తదితర సినిమాల్లో హీరోయిన్‌గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది తెలుగమ్మాయి మాధవీలత. అయితే ఆ తర్వాత నటనను పూర్తిగా పక్కన పెట్టేసిందీ అందాల తార. బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తోన్న మాధవీలత ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. షిరిడీ సాయిబాబా దేవుడు కాదంటూ వరుసగా పోస్ట్ లు షేర్ చేసింది. ఇప్పుడు ఆ పోస్టులే నటిని ఇబ్బందుల్లోకి నెట్టాయి. మాధవీ లత వ్యాఖ్యలు సాయిబాబా భక్తుల మనోభావాలను దెబ్బతీశాయంటూ పలువురు పోలీసులను ఆశ్రయించారు. నటిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. దీంతో మాధవీలతతో పాటు ఆమెకు మద్దతుగా ఇంటర్వ్యూలు చేసి.. ఆ వీడియోలను వైరల్ చేసిన కొందరు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు, ఇతర సోషల్ మీడియా వ్యక్తులపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. మంగళవారం ఉదయం 10 గంటలకు విచారణ నిమిత్తం తమ ఎదుట హాజరుకావాలని పోలీసులు వీరందరికీ నోటీసులు జారీ చేశారు.
కాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన అతిథి సినిమాలో ఓ చిన్న పాత్ర తో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది మాధవీలత. ఆతర్వాత నచ్చావులే సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన స్నేహితుడా సినిమాలోనూ కథానాయికగా యాక్ట్ చేసింది. తమిళంలోనూ విశాల్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో యాక్ట్ చేసింది. అయితే ఎక్కువ కాలం హీరోయిన్ గా కెరీర్ కొనసాగించలేకపోయింది. క్రమంగా అవకాశాలు కనుమరుగుకావడంతో నటనకు బ్రేక్ ఇచ్చేసింది. ఇదే క్రమంలో రాజకీయాల్లోకి అడుగు పెట్టింది. బీజేపీలో చేరి ఎన్నికల్లోనూ పోటీ చేసింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి ఓడిపోయిన మాధవీ లత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. సామాజిక మఅంశాలపై తన గళం వినిపిస్తుంటుంది. ఇలా ఇటీవల సాయి బాబాపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకుంది.
మాధవీ లత ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




