AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు… టాలీవుడ్ నటుడి ఎమోషనల్

చూడడానికి సినిమా ఇండస్ట్రీ చాలా అందంగా రంగులు రంగులుగా కనిపిస్తుంటుంది. కానీ ఈ వెలుగుల వెనక వెలుగులోకి రాని ఎన్నో చీకటి కోణాలు ఉన్నాయి. క్యాస్టింగ్ కౌచ్, కుల వివక్ష కారణంగా ట్యాలెంట్ ఉన్నా చాలా మంది గుర్తింపు తెచ్చకోలేకపోయారు. ఈ నటుడు కూడా సరిగ్గా అలాంటి కోవకే చెందుతాడు.

Tollywood: హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు... టాలీవుడ్ నటుడి ఎమోషనల్
Dhandoraa Movie Actor Ravi Krishna
Basha Shek
|

Updated on: Dec 28, 2025 | 4:31 PM

Share

క్యాస్టింగ్ కౌచ్ ఉదంతం సినిమా ఇండస్ట్రీలోని చీకటి కోణాన్ని బట్ట బయలు చేసింది. స్టార్ హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు, టెక్నీ షియన్ల చేతిలో ఎంతో మంది హీరోయిన్లు వేధింపులకు గురయ్యారు. ఇప్పుడిప్పుడే చాలా మంది నటీమణులు తమకు జరిగిన అన్యాయంపై నోరు విప్పుతున్నారు. తాజాగా సినిమా ఇండస్ట్రీలోని కుల వివక్షపై నోరు విప్పాడు ఓ టాలీవుడ్ ట్యాలెంటెడ్ నటుడు. చాలా సినిమాల్లో అవకాశం వచ్చినప్పటికీ చివరికీ తన కులం చూసి తీసేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఒకటి కాదు రెండు కాదు.. మూడు సినిమాలు అగ్రిమెంట్‌ వరకు వచ్చి తన కులం చూసి ఆగిపోయాయంటూ ఎమోషనల్ అయ్యాడు. అతను మరెవరో కాదు విరూపాక్ష సినిమాలో తాంత్రికుడిగా అందరినీ భయపెట్టిన సీరియల్ నటుడు రవి కృష్ణ. ఇటీవల విడుదలైన దండోరాలో కీలక పాత్ర పోషించాడు రవి. తక్కువ కులానికి చెందిన యువకుడిగా అద్బుతంగా నటించాడు. అగ్ర కులానికి చెందిన అమ్మాయితో ప్రేమలో పడి.. ఆమె కులం వాళ్ల చేతిలో హత్యకు గురైన కుర్రాడి పాత్రలో రవి నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే దండోరా సినిమాలో మాదిరే నిజ జీవితంలో తాను కూడా కుల వివక్షకు గురయ్యానని ఎమోషనల్ అయ్యాడు రవి. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అతను తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయలు పంచుకున్నాడు.

‘మాది విజయవాడ. మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ. మా ఇంట్లో ఎవ్వరికీ సినిమా నేపథ్యం లేదు. కానీ నాకు సినిమాలంటే పిచ్చి. ఇంటర్‌ పూర్తయ్యాక సినిమాల్లోకి వెళతా అంటే..ఇంట్లో తిట్టారు. దీంతో డిగ్రీ పూర్తి చేసి సినిమాల్లోకి వచ్చాను. సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్‌లో ఉంటుందని తెలియక చెన్నై వెళ్లాను. అక్కడ ఓ సీరియల్‌కి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశా. కానీ కొన్నాళ్ల తర్వాత వాళ్లే ఓ తెలుగు సీరియల్‌ చేస్తే అందులో నటించాను. అది మూడు నెలలకే ఆగిపోయింది. ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్‌లో ఉంటుందని తెలుసుకొని.. ఇక్కడకు వచ్చాను. మా మేనత్త వాళ్ల ఇంట్లో ఉంటూ ఛాన్సుల కోసం తిరిగాను. మొగలి రేకులు సీరియల్‌కి ఆడిషన్స్‌ జరుగుతున్నాయని తెలిసి వెళ్లాను. అయితే వాళ్లు అప్పటికే పూర్తయిపోయానని చెప్పారు. ఎలాగోలా వారిని రిక్వెస్ట్‌ చేసి ఆడిషన్స్‌ ఇచ్చాను. అలా ఆ సీరియల్‌తో నా కెరీర్‌ ప్రారంభం అయింది. ఆ తర్వాతే సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. కానీ ఇక్కడే నాకు కుల వివక్ష ఎదురైంది.’

ఇవి కూడా చదవండి

దండోరా సినిమా సక్సెస్ ఈవెంట్ లో రవి కృష్ణ..

View this post on Instagram

A post shared by YouWe Media (@youwemedia)

‘కొంతమంది నన్ను హీరోగా సెలెక్ట్‌ చేసి చివరిలో నా కులం చూసి పక్కకు తప్పించారు. ఓ సినిమాకి హీరోగా సెలెక్ట్‌ అయ్యాను. అగ్రిమెంట్‌ సమయంలో నా ఆధార్‌ కార్డు పంపించాను. అ‍క్కడ నా కులం చూసి తప్పించారు. కారణం ఏంటని అడిగితే.. ఈ కథ మీకు సూట్ కాదు.. ఇంకో ప్రాజెక్ట్‌కు చూద్దాం అని చెప్పారు. అలా మూడు సినిమాలు అగ్రిమెంట్‌ వరకు వచ్చి..కులం చూసి ఆగిపోయాయి’ అని రవి ఎమోషనల్ అయ్యాడు.

View this post on Instagram

A post shared by YouWe Media (@youwemedia)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..
టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే
టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే
బీపీని కంట్రోల్‌ చేసే ఐదు సూపర్ ఫుడ్స్.. డైట్‌లో ఉంటే
బీపీని కంట్రోల్‌ చేసే ఐదు సూపర్ ఫుడ్స్.. డైట్‌లో ఉంటే
తెగిపోయిన చెవిని కాలికి అమర్చి, తిరిగి తలకు అతికించిన వైద్యులు
తెగిపోయిన చెవిని కాలికి అమర్చి, తిరిగి తలకు అతికించిన వైద్యులు