AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Thanuja: మళ్లీ అందరి మనసులు గెల్చుకున్న బిగ్‌బాస్ తనూజ.. ఏం చేసిందో చూశారా? వీడియో వైరల్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ముగిసింది. ఈ రియాలిటీ షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్ ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయిపోయారు. కొందరు కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఎంజాయ్ చేస్తున్నారు. మరికొందరు టీవీషోలతో బిజీ అయిపోయారు. కానీ రన్నరర్ గా నిలిచిన తనూజ పుట్టస్వామి మాత్రం చాలా డిఫరెంట్ గా..

Bigg Boss Thanuja: మళ్లీ అందరి మనసులు గెల్చుకున్న బిగ్‌బాస్ తనూజ.. ఏం చేసిందో చూశారా? వీడియో వైరల్
Bigg Boss Telugu 9 Runner Up Tanuja Puttaswamy
Basha Shek
|

Updated on: Dec 29, 2025 | 7:53 PM

Share

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ముగిసింది. కామనర్ గా హౌస్ లోకి అడుగు పెట్టిన పవన్ కల్యాణ్ పడాల విజేతగా నిలిచాడు. బిగ్ బాస్ టైటిల్ ను గెల్చుకుని చరిత్ర సృష్టించాడు. ఇక మొదటి నుంచి విన్నర్ అని భావించిన తనూజ రన్నరప్ తోనే సరిపెట్టుకుంది. కాగా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ముగిశాక కంటెస్టెంట్స్ ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. చాలా మంది కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో సరదాగా గడుపుతున్నారు. మరికొందరు టూర్లు, వెకేషన్స్ తో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే రన్నరప్ గా నిలిచిన తనూజా మాత్రం డిఫరెంట్ అనిపించుకుంది. తాజాగా ఆమె ఒక అనాథశరణాలయానికి వెళ్లింది. ఒక రోజంతా అక్కడి పిల్లలతో సరదాగా గడిపింది. పిల్లలకు ముచ్చట్లు చెప్పింది. వారు డ్యాన్స్‌ చేస్తుంటే చప్పట్లు కొట్టింది. తర్వాత పిల్లలందరికోసం పాటలు కూడా పాడింది. అలాగే కేక్‌ కట్‌ చేసి అందరికీ తినిపించింది. అనంతరం వారికి కడుపు నిండేలా భోజనం వడ్డించింది. ఈ సందర్భంగా ఓ చిన్నారికి గోరుముద్దలు పెడుతూ తనూ వారితో కలిసి భోజనం చేసింది.

ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది తనూజ. పిల్లలందరినీ తన ఫ్యామిలీగా అభివర్ణించింది.. ‘నా కుటుంబాన్ని చూసి ఎన్నాళ్లయిందో! వారి ప్రేమలు, చిరునవ్వులు, జ్ఞాపకాలు.. మమ్మల్ని మళ్లీ దగ్గర చేశాయి. చాలాకాలం తర్వాత వారితో మళ్లీ కాలక్షేపం చేశాను. నా మనసు ఆనందంతో నిండిపోయింది. ఇది నా లైఫ్‌లో మర్చిపోలేని మధురమైన జ్ఞాపకాల్లో ఒకటిగా నిలిచిపోతుంది’ అని తనూజ ఎమోషనలైంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు తనూజపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరితోనూ ఒక టీవీ షో కోసం రీసెంట్ గా ఒక షూట్ జరిగింది. ఈ షూట్ లో బిగ్ బాస్ సీజన్ 9కి సంబందించిన దాదాపు అందరు కంటెస్టెంట్స్ హాజరయ్యారు. కానీ తనూజ మాత్రం రాలేదు. కొంత కాలం ఆమె మీడియాతో పాటు టీవీ షోలకు దూరంగా ఉండాలనుకుంటోందట. అందుకే ఎలాంటి ఆఫర్స్ వచ్చినా సున్నితంగా తిరస్కరిస్తోందట.

అనాథాశ్రమంలో బిగ్ బాస్ తనూజ.. వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మళ్లీ అందరి మనసులు గెల్చుకున్న బిగ్‌బాస్ తనూజ.. వీడియో వైరల్
మళ్లీ అందరి మనసులు గెల్చుకున్న బిగ్‌బాస్ తనూజ.. వీడియో వైరల్
హైదరాబాద్ వాసులకు మరోసారి ఈగల్ టీమ్ హెచ్చరిక
హైదరాబాద్ వాసులకు మరోసారి ఈగల్ టీమ్ హెచ్చరిక
తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం వాతావరణం ఎలా ఉంటుంది..?
శ్రీశైలంలో ఆన్ లైన్ విధానానికి భక్తులలో అనూహ్య స్పందన
శ్రీశైలంలో ఆన్ లైన్ విధానానికి భక్తులలో అనూహ్య స్పందన
కోచ్ పదవి నుంచి గౌతమ్ గంభీర్ అవుట్? క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ
కోచ్ పదవి నుంచి గౌతమ్ గంభీర్ అవుట్? క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ
ఆమ్లెట్ Vs ఉడికించిన గుడ్డు.. బరువు తగ్గడానికి ఏది మంచిది?
ఆమ్లెట్ Vs ఉడికించిన గుడ్డు.. బరువు తగ్గడానికి ఏది మంచిది?
కొత్త సంవత్సరం గిఫ్ట్.. ఏపీలోని రైతులకు ప్రభుత్వం నుంచి శుభవార్త.
కొత్త సంవత్సరం గిఫ్ట్.. ఏపీలోని రైతులకు ప్రభుత్వం నుంచి శుభవార్త.
KCR దగ్గరకు వెళ్లి పలకరించిన CM రేవంత్ రెడ్డి
KCR దగ్గరకు వెళ్లి పలకరించిన CM రేవంత్ రెడ్డి
శత్రువుల గుండెల్లో వణుకు.. ఆర్మీ చేతికి అత్యాధునిక అస్త్రాలు..
శత్రువుల గుండెల్లో వణుకు.. ఆర్మీ చేతికి అత్యాధునిక అస్త్రాలు..
ధోనీ కారులో సిగరెట్ ప్యాకెట్.. వైరల్ వీడియోతో సోషల్ మీడియా షేక్
ధోనీ కారులో సిగరెట్ ప్యాకెట్.. వైరల్ వీడియోతో సోషల్ మీడియా షేక్