AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ 3 వ్యాధులు ఉన్న వారికి పుచ్చకాయ యమ డేంజర్.. తిన్నారంటే ఇక అంతే..

పుచ్చకాయ వేసవిలో దాహం తీర్చే గొప్ప పండు.. పుచ్చకాయలో 92శాతం నీరు, విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అయితే, అతిగా తీసుకుంటే జీర్ణ సమస్యలు వస్తాయి. డయాబెటిస్, ఆల్కహాల్ తీసుకునేవారు జాగ్రత్తగా ఉండాలి. అయితే, పుచ్చకాయను తినే ముందు దాని ప్రయోజనాలు.. ఎవరు తినకూడదో తెలుసుకుందాం..

ఈ 3 వ్యాధులు ఉన్న వారికి పుచ్చకాయ యమ డేంజర్.. తిన్నారంటే ఇక అంతే..
Watermelon Health Benefits
Shaik Madar Saheb
|

Updated on: Mar 10, 2026 | 3:37 PM

Share

వేసవి వచ్చిందంటే చాలు, దాహం తీర్చుకోవడానికి, శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి మనం అనేక రకాల పండ్లను తింటాం.. వాటిలో పుచ్చకాయ అత్యంత ప్రాచుర్యం పొందింది. పుచ్చకాయలో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. ఇది కేవలం రుచిలో మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాల్లోనూ ముందుంటుంది. వేసవిలో ఉచ్చకాయ తీసుకుంటే.. కడుపు చల్లగా ఉంటుంది. ఇంకా హైడ్రేటెడ్ గా ఉండటంతోపాటు.. వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే, పుచ్చకాయను ఆస్వాదించే ముందు దాని ప్రయోజనాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు..? ఎవరు దీనిని తినకూడదు అనే విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు..

పుచ్చకాయ పోషకాలు..  ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

పుచ్చకాయలో దాదాపు 92 శాతం నీరు ఉంటుంది. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించి, డీహైడ్రేషన్ బారి నుండి రక్షిస్తుంది. పొటాషియం, ఐరన్, కాల్షియం, రాగి, మెగ్నీషియం, విటమిన్ ఎ, బి1, బి6, సి, డి, లైకోపిన్ వంటి అనేక కీలక పోషకాలు ఇందులో ఉన్నాయి.

రోగనిరోధక శక్తి: విటమిన్ ఎ, సి లు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.

జీర్ణక్రియ: అధిక నీటి శాతం, పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.. మలబద్ధకం సమస్యను తగ్గిస్తాయి.

గుండె ఆరోగ్యం: ఎల్.డి.ఎల్. (చెడు కొలెస్ట్రాల్) ను తగ్గించి, రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుంది. గుండె సంబంధిత సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.

రక్తపోటు నియంత్రణ: సిట్రులిన్ అనే యాసిడ్ రక్తపోటును తగ్గించడంలో తోడ్పడుతుంది. హై బిపి ఉన్నవారు పుచ్చకాయను ధైర్యంగా తీసుకోవచ్చు.

కంటి ఆరోగ్యం: లైకోపిన్, విటమిన్ ఎ, విటమిన్ ఇ కంటి సంబంధిత సమస్యలను తగ్గించి, మ్యాక్యులర్ డీజెనరేషన్ ప్రమాదాన్ని నివారిస్తాయి.

మూత్రపిండాల ఆరోగ్యం: మూత్రపిండాలను శుభ్రపరచి, అదనపు లవణాలను, టాక్సిన్లను శరీరం నుండి తొలగిస్తుంది. కిడ్నీలో రాళ్లు ఉన్నవారికి, మలబద్ధకంతో బాధపడేవారికి ఇది మేలు చేస్తుంది.

చర్మ సంరక్షణ: విటమిన్ ఎ, సి, ఇ, అధిక నీటి శాతం చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతుంది. డీహైడ్రేషన్ నుండి కాపాడుతుంది. పుచ్చకాయ గుజ్జును చర్మంపై అప్లై చేయడం వల్ల యాంటీ ఏజింగ్ ప్రయోజనాలు లభిస్తాయి.

ఇతర ప్రయోజనాలు: పుచ్చకాయ కండరాల నొప్పిని తగ్గించడం, కామెర్లు, పైత్యం, వికారం, తలనొప్పి, నోరు తడారిపోవడం వంటి సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం క్యాన్సర్ నిరోధక లక్షణాలు కూడా ఉన్నాయి.. గర్భిణులకు కూడా పుచ్చకాయ మంచిది.

ఎవరు పుచ్చకాయను అతిగా తినకూడదు

పుచ్చకాయ ఆరోగ్యకరమైనదే అయినా, కొన్ని సందర్భాలలో లేదా అతిగా తీసుకుంటే దుష్ప్రభావాలు కలగవచ్చు.

పుచ్చకాయను ప్రతిరోజూ 400 గ్రాముల నుండి 500 గ్రాముల వరకు మాత్రమే తీసుకోవడం మంచిది. అంతకు మించి తింటే విరోచనాలు, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు వస్తాయి.

పుచ్చకాయ తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు, ఎందుకంటే ఇది జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది.

రాత్రి వేళలో పుచ్చకాయను తినడం వల్ల బరువు పెరగడం, పొట్ట సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పగటిపూట మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నించాలి.

ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉన్నవారు పుచ్చకాయను తినకూడదు. ఇది కాలేయ సమస్యలను మరింత తీవ్రతరం చేయవచ్చు.

పుచ్చకాయలో సహజ చక్కెరలు ఉంటాయి కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు తగు మోతాదులో లేదా వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. అతిగా తీసుకుంటే శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంది.

పుచ్చకాయ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ, దానిని సరైన మోతాదులో, సరైన సమయంలో తీసుకోవడం వల్ల మాత్రమే పూర్తి ప్రయోజనాలను పొందవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us