AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET Re-Examination: నీట్‌ పరీక్షపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ లేఖ..!

NEET Re-Examination: అభ్యర్థుల సౌకర్యార్థం సురక్షితమైన తాగునీరు, కూర్చునేందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యార్థుల ప్రయోజనాలు, వారి ఆరోగ్యమే అన్నింటికంటే ముఖ్యమని మంత్రి పేర్కొన్నారు. పరీక్ష నిర్వహించే రోజున అంటే జూన్ 21న అభ్యర్థుల కోసం తగిన రవాణా సదుపాయాలు కూడా అందుబాటులో ఉండేలా..

NEET Re-Examination: నీట్‌ పరీక్షపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ లేఖ..!
Dharmendra Pradhan
Subhash Goud
| Edited By: |

Updated on: May 25, 2026 | 8:58 PM

Share

NEET Re-Examination: 2026 జూన్ 21న జరగనున్న నీట్ (UG) పునఃపరీక్షను సజావుగా, పారదర్శకంగా, విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లకు, అడ్మినిస్ట్రేటర్లకు లేఖ రాశారు. ప్రస్తుతం దేశంలో ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల సౌకర్యం, హెల్త్‌ను దృష్టిలో ఉంచుకుని పరీక్షా హాళ్లలో అన్ని అవసరమైన ఏర్పాట్లు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు.

ప్రస్తుత ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మీ రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతంలో పరీక్షలు నిర్వహించే జిల్లా అధికారులు, అన్ని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, అలాగే ఇతర విద్యాసంస్థలకు తగిన ఆదేశాలు జారీ చేయాల్సిందిగా అభ్యర్థిస్తు్న్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: LPG Gas Tips: వంట గ్యాస్‌ను ఆదా చేసే రహస్యం మీకు తెలుసా? ఇలా చేస్తే 30 రోజులకు సరిపోయే సిలిండర్‌ను 45 రోజుల పాటు వాడుకోండి..!

అలాగే అభ్యర్థుల సౌకర్యార్థం సురక్షితమైన తాగునీరు, కూర్చునేందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యార్థుల ప్రయోజనాలు, వారి ఆరోగ్యమే అన్నింటికంటే ముఖ్యమని మంత్రి పేర్కొన్నారు. పరీక్ష నిర్వహించే రోజున అంటే జూన్ 21న అభ్యర్థుల కోసం తగిన రవాణా సదుపాయాలు కూడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాలను కోరారు.

ఇది కూడా చదవండి: Bank Holidays: వినియోగదారులకు అలర్ట్‌.. జూన్‌లో ఎన్ని రోజులు బ్యాంకులు మూసి ఉంటాయో తెలుసా..?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us