ఈ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకండి.. ఆసుపత్రికి వెళ్లకపోతే ప్రాణానికి ప్రమాదమే!
samatha
25 may 2026
ఉరుకుల పరుగుల జీవితంలో, అధిక ఒత్తిడి, సరైన ఆహారం తీసుకోకపోవడం , మారిన జీవన శైలి కారణంగా చాలా మంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా, చాలా మంది బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడుతున్నారు.
బిజీ షెడ్యూల్స్
ఈ మధ్య కాలంలో స్త్రీలు, పురుషులు చాలా మంది బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా, అసలు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం
బ్రేయిన్ స్ట్రోక్
ముఖ్యంగా బ్రెయిన్ స్ట్రోక్ అనేది, కొన్ని రకాల మందులు వాడటం, అధిక రక్తపోటు, షుగర్ నియంత్రణలో లేకపోవడం, నరాల బలహీనత వలన ఏర్పడుతుంది.
అధిక రక్తపోటు, ఒత్తిడి
అలాగే మీకు స్ట్రోక్ వచ్చే ముందు అది కొన్ని సంకేతాలను ఇస్తుంది. వాటిని ముందుగా గుర్తించి, సరైన సమయంలో చికిత్స తీసుకుంటే పెద్ద ప్రమాదం నుంచి బయటపడవచ్చునంట.
సంకేతాలు
ఉన్నట్టుండి బ్యాలెన్స్ తప్పడం, కళ్లు తిరగడం, నడవలేకపోవడం. ఒక కన్ను లేదా రెండు కళ్లలో చూపు మసకబారడం, డబుల్ విజన్
మైకం కమ్మడం
ముఖం ఒకవైపు వాలిపోవడం. నవ్వమంటే నోరు ఒక పక్కకు లాగినట్టు ఉంటుంది. ఒక చెయ్యి లేదా కాలు పైకి ఎత్త లేకపోవడం, తిమ్మిరి, నీరసం
మఖం వాలిపోయినట్లు
మాట తడబడడం, పలక లేకపోవడం, ఎదుటి వాళ్ళు చెప్పేది అర్థం కాకపోవడం. కారణం లేకుండా భరించలేని తలనొప్పి, వాంతులు అవ్వడం.
తలనొప్పి
ఉన్నట్టుండి కళ్లు తిరిగి పడిపోవడం, గందరగోళంగా ప్రవర్తించడం. మాటల్లో అస్పష్టత, చెప్పేది అర్థం చేసుకోకుండా ఏదో ఏదో మాట్లాడటం.