AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెమట జిడ్డుకు పర్మనెంట్ చెక్.. ఎండల్లోనూ ఫ్రెష్‌గా ఉండాలంటే ఈ సింపుల్‌ టిప్స్ ఫాలో అవ్వండి..

వేసవి కాలంలో చెమట పట్టడం అనేది చల్లగా ఉండటానికి మన శరీరం చేసే సహజ ప్రయత్నమే అయినా.. అది మితిమీరితే మాత్రం చర్మ ఇన్ఫెక్షన్లు, అసౌకర్యానికి దారితీస్తుంది. ముఖ్యంగా 45 డిగ్రీలు దాటుతున్న ఈ ఎండల్లో చర్మ సంరక్షణ పెద్ద సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో ప్రముఖ స్కిన్ కేర్ ఎక్స్‌పర్ట్ షహనాజ్ హుస్సేన్ అందించిన కొన్ని సింపుల్ చిట్కాలు మీకోసం..

చెమట జిడ్డుకు పర్మనెంట్ చెక్.. ఎండల్లోనూ ఫ్రెష్‌గా ఉండాలంటే ఈ సింపుల్‌ టిప్స్ ఫాలో అవ్వండి..
Excessive Sweating In Summer
Krishna S
|

Updated on: May 25, 2026 | 8:58 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో రోహిణి కార్తె ఎండలు రోళ్లు పగిలేలా మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటేస్తుండటంతో బయటకు వెళ్లినా.. ఇంట్లో ఉన్నా నిమిషాల్లో శరీరం చెమటతో తడిసిపోతోంది. వేసవిలో శరీరాన్ని చల్లబరచడానికి మన బాడీ చేసే సహజమైన ప్రక్రియే చెమట. అయితే నిరంతరాయంగా పట్టే చెమట వల్ల చర్మం జిగటగా మారడం, దురద, బ్యాక్టీరియా చేరి దుర్వాసన రావడం వంటి సమస్యలు రోజంతా మన మూడ్‌ను పాడుచేస్తాయి. మరి ఈ వేసవిలో కూడా ఎల్లప్పుడూ చల్లగా, తాజా పరిమళాలతో మెరిసిపోవడం ఎలా? భారతదేశపు ప్రముఖ సౌందర్య నిపుణురాలు షహనాజ్ హుస్సేన్ అందించిన 6 అద్భుతమైన చిట్కాల గురించి తెలుసుకుందాం..

లోపలి నుండి చల్లదనం..

వేసవిలో తాజాగా, ఎనర్జిటిక్‌గా ఉండటానికి అత్యంత కీలకమైన నియమం పుష్కలంగా నీరు తాగడం. శరీరంలో నీటి శాతం సమృద్ధిగా ఉన్నప్పుడు ఇంటర్నల్ బాడీ టెంపరేచర్ కంట్రోల్‌లో ఉంటుంది. చెమట రూపంలో శరీరం కోల్పోయే నీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేయడం చాలా ముఖ్యం. అందుకోసం రోజుకు కనీసం 8 నుండి 10 గ్లాసుల నీటిని ఖచ్చితంగా తాగాలి. మీరు ఎండలోకి వెళ్తున్నా లేదా జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్నా.. డీహైడ్రేషన్, అలసట బారిన పడకుండా ఉండాలంటే వెంట నీళ్ల బాటిల్ ఉంచుకోవడం అస్సలు మరువకండి.

రోజుకు రెండుసార్లు స్నానం.. ఆ భాగాలపై ప్రత్యేక శ్రద్ధ..

వేసవిలో పర్సనల్ హైజీన్ చాలా అవసరం. చెమట, చర్మంపై పేరుకునే మురికి వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు, చెమటకాయలు వచ్చే ప్రమాదం ఉంది. రోజుకు కనీసం ఒకసారైనా యాంటి బాక్టీరియల్ సబ్బుతో పూర్తిగా స్నానం చేయండి. ఎక్కువగా చెమట పట్టే చంకలు, పాదాల భాగాలను శుభ్రం చేయడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. స్నానం ముగిశాక పొడి టవల్‌తో ఒంటిని తుడుచుకోవాలి. ముఖ్యంగా జిమ్ లేదా వ్యాయామం చేసిన వెంటనే స్నానం చేయడం వల్ల చర్మంపై చికాకు తగ్గుతుంది.

స్నానపు నీటిలో ఆ నూనెలు.. రోజంతా రిఫ్రెషింగ్

ఎండ ఎక్కువగా ఉందని వేడి నీళ్లతో అస్సలు స్నానం చేయకూడదు. ఇది శరీర ఉష్ణోగ్రతను మరింత పెంచి, అధికంగా చెమట పట్టేలా చేస్తుంది. ఎల్లప్పుడూ చల్లని లేదా గోరువెచ్చని నీటిని ఎంచుకోండి. మీరు స్నానం చేసే బకెట్ నీటిలో కొన్ని చుక్కల పుదీనా లేదా యూకలిప్టస్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకోండి. ఇది మీ శరీరానికి తక్షణ ఉత్సాహాన్ని ఇవ్వడమే కాకుండా రోజంతా అద్భుతమైన సువాసనతో రిఫ్రెషింగ్‌గా ఉంచుతుంది.

దుస్తుల ఎంపికలో మార్పు.. కాటనే బెస్ట్

వేసవిలో మీరు వేసుకునే బట్టలు మీ శరీర వేడిపై నేరుగా ప్రభావం చూపుతాయి. బిగుతుగా ఉండే సింథటిక్, నైలాన్ దుస్తులు చెమటను పీల్చుకోవు సగా పైన ఉక్కపోతను పెంచుతాయి. కాబట్టి ఈ కాలంలో కాటన్ లేదా లినెన్ వంటి తేలికపాటి, వదులుగా ఉండే దుస్తులనే ధరించాలి. వీటి గుండా గాలి సులభంగా ప్రసరించి చెమట త్వరగా ఆరిపోతుంది.

బ్యాగ్‌లో రిఫ్రెషింగ్ వైప్స్ తప్పనిసరి

ఆఫీస్ పనుల మీద బయటకు వెళ్లినప్పుడు ప్రతిసారీ ముఖం కడుక్కోవడం సాధ్యం కాకపోవచ్చు. అటువంటి సమయంలో రిఫ్రెషింగ్ ఫేషియల్ వైప్స్ అద్భుతంగా పనిచేస్తాయి. మీ బ్యాగ్‌లో ఎల్లప్పుడూ ఒక వైప్స్ ప్యాకెట్ ఉంచుకోండి. ముఖంపై జిడ్డుగా లేదా అలసటగా అనిపించినప్పుడు మెడ, ముఖం, చంకలను వీటితో క్లీన్ చేసుకోండి. ముఖ్యంగా కలబంద లేదా దోసకాయ సారం ఉన్న వైప్స్ వాడితే చర్మానికి తక్షణ ఉపశమనం లభిస్తుంది.

పీక్ అవర్స్ ఎండకు దూరంగా ఉండండి

సూర్యుడి నుండి వచ్చే హానికరమైన యూవీ కిరణాల నుండి చర్మాన్ని కాపాడుకోవడానికి మధ్యాహ్నం 11 నుండి సాయంత్రం 4 గంటల వరకు వీలైనంత వరకు నీడలోనే ఉండటానికి ప్రయత్నించండి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే.. వెడల్పాటి అంచు ఉన్న టోపీ, సన్‌గ్లాసెస్ ధరించండి. వీలైతే సూర్యరశ్మిని అడ్డుకునే UPF ప్రొటెక్షన్ ఉన్న తేలికపాటి దుస్తులను వాడటం చాలా మంచిది.

Follow Us