AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kuja Blessings: కుజుడి కటాక్షం.. మేషం, మకరం సహా ఈ రాశులకు గోల్డెన్ టైమ్..!

ప్రస్తుతం తన స్వస్థానమైన మేష రాశిలో సంచారం చేస్తున్న కుజ గ్రహం.. జూన్ వరకు అయిదు రాశుల వారిని ఉచ్ఛ స్థితికి తీసుకువెళ్లే అవకాశం ఉంది. అధికారానికి, ఆస్తిపాస్తులకు కారకుడైన కుజుడు మేషం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకర రాశులకు శీఘ్ర పురోగతిని అనుగ్రహించడం జరుగుతుంది. అంతకన్నా ఎక్కువగా తప్పకుండా విజయాలను, సాఫల్యాలను అనుగ్రహించడం జరుగుతుంది. అంగారక స్తోత్రం పఠించినా, పగడపు ఉంగరం వేలికి పెట్టుకున్నా, ఎర్రటి వస్త్రాలు ధరించినా, సుబ్రహ్మణ్యాష్టకం చదువుకున్నా కుజుడి అనుగ్రహం రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 25, 2026 | 4:27 PM

Share
మేషం: రాశ్యధిపతి కుజుడు స్వస్థానంలో బలమైన సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి తప్పకుండా అధికార యోగం పడుతుంది. ఏ రంగంలో ఉన్నా ఉన్నత స్థానాలకు వెళ్లడం జరుగుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసుల్లో విజయాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఎటువంటి పోటీలు, సవాళ్లు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోవడం, విజయం సాధించడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితిని బాగా మెరుగుపరచుకుంటారు. ఉద్యోగంలో సీనియర్లను కాదని అధికారం చేపట్టడం జరుగుతుంది.

1 / 5
కర్కాటకం: ఈ రాశి మీద కుజుడి దృష్టి పడడం వల్ల ఈ రాశివారిలో ఆత్మవిశ్వాసం, ధైర్య సాహసాలు ఇనుమడిస్తాయి. ఎటువంటి సవాలునైనా ఎదుర్కోవడం జరుగుతుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. శత్రువులు, ప్రత్యర్థులు, పోటీదార్ల మీద పైచేయిగా ఉంటుంది. రుణ, రోగ సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఏ రంగంలో ఉన్నా దూసుకుపోతారు. పని తీరులో సహోద్యోగులను మించిపోతారు. ఆదాయ వృద్ధి ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి.

2 / 5
తుల: ఈ రాశి మీద కుజుడి సప్తమ దృష్టి పడినందువల్ల  ఈ రాశివారికి కొద్ది ప్రయత్నంతో ఆదాయం అత్యధికంగా వృద్ది చెందుతుంది. విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నవారి పంట పండుతుంది. ప్రతి సమస్యనూ పట్టుదలగా పరిష్కరించుకుంటారు. ఆస్తి వివాదాలు, కోర్టు కేసుల్లో సానుకూల ఫలితాలు పొందుతారు. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. రావలసిన సొమ్మును రాబట్టుకుంటారు.

3 / 5
వృశ్చికం: రాశినాథుడైన కుజుడు అష్టమ దృష్టితో ఈ రాశిని వీక్షించడం వల్ల జూన్ 20 వరకు జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఆదాయ వృద్దికి ఎటువంటి ప్రయత్నం చేపట్టినా సఫలమవుతుంది. ఆర్థిక బలం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో అధికార యోగం కలగడంతో పాటు ఆర్థికంగా పురోగతి ఉంటుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. ఆస్తి వివాదాల్ని రాజీమార్గంలో పరిష్కరించుకుంటారు.

4 / 5
మకరం: తనకు ఉచ్ఛ క్షేత్రమైన మకర రాశిని కుజుడు ఎక్కువగా అనుగ్రహిస్తాడు. కుజుడికి ఎక్కడ బలం పట్టినా ఈ రాశికి శుభ యోగాలు కలుగుతాయి. ప్రస్తుతం కుజుడి మేష సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాధాన్యం పెరిగి అధికార యోగం పడుతుంది. రాజకీయాలు, రియల్ ఎస్టేట్, లిక్కర్, ఎక్సైజ్, ప్రభుత్వం వంటి రంగాలవారు ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది. రాజకీయ ప్రాబల్యం పెరుగుతుంది.

5 / 5
Follow Us
విద్యార్థినులతో కలిసి బరిబాతగా ప్రిన్సిపల్‌ స్విమ్మింగ్!

కోచ్ ఒకలా.. కెప్టెన్ మరోలా.. కుల్‌దీప్ డ్రాప్ వెనుక కొత్త నాటకం?

టీమిండియా నెక్స్ట్ టెస్ట్ ఎవరితో? షెడ్యూల్, టైమింగ్స్ ఇవే..?

కార్లు, బైక్‌లను మర్చిపోండి.. ఇదిగో ఇనుప గుర్రం వచ్చేసింది.. !

గుడిమెట్లమీద కూర్చున్న స్టార్ హీరో.. బిచ్చగాడు అనుకోని..

చెక్ బుక్ వాడుతున్నారా? కొత్త రూల్స్ వచ్చేశాయి..ఆ చెక్‌లు చెల్లవు

తెలంగాణలో జోరు వానలు.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..

మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం దక్కించుకున్న కజియా

తల్లిదండ్రులను హత్య చేసిన నర్సు సురేఖ కథ..విషాదాంతం! ఏం జరిగింది?

LPG గ్యాస్ వినియోగదారులకు షాక్.. ఆ ఇళ్లల్లో కనెక్షన్లు రద్దు..!