AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అర్ధరాత్రి రైలులో దోపిడీ దొంగల బీభత్సం.. ప్రయాణీకుడిలా వచ్చి.. మెరుపు వేగంతో చోరీ

రైలు ప్రయాణాల్లో ప్రయాణీకుల భద్రతపై మళ్లీ ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. అర్ధరాత్రి వేళ రైలు ఆగిన తరుణాన్ని ఆసరాగా చేసుకుని, ఏసి బోగీలోకి చొరబడిన ఒక దొంగ మహిళా ప్రయాణీకురాలి చేతిలోని విలువైన బ్యాగును లాక్కెళ్లిన ఘటన బాపట్ల జిల్లా చీరాల రైల్వే స్టేషన్‌లో కలకలం రేపింది. ఈ ఘటనతో తోటి ప్రయాణీకులు ఒక్కసారిగా హడలిపోయారు.

అర్ధరాత్రి రైలులో దోపిడీ దొంగల బీభత్సం.. ప్రయాణీకుడిలా వచ్చి.. మెరుపు వేగంతో చోరీ
Ac Coach Theft
Fairoz Baig
| Edited By: |

Updated on: May 25, 2026 | 8:38 PM

Share

అది బాపట్లజిల్లా చీరాల రైల్వే స్టేషన్‌… అర్ధరాత్రి వేగంగా దూసుకొచ్చిన ఓ రైలు ప్లాట్‌ఫాం నెమ్మదిగా ఆగింది… తిరుచానూరు To హజుర్ సాహిబ్ నాందేడ్ ఎక్స్ ప్రెస్ రైలులో ఏసి కంపార్ట్‌మెంట్‌లో అందరూ నిద్రమత్తులో ఉన్నారు… ఒకరిద్దరు కిందకు దిగి మంచినీటి బాటిల్స్‌ కొనుగోలు చేస్తున్నారు… అదే సమయంలో ఓ వ్యక్తి ప్రయాణీకుడిలా రైల్లో ఎక్కాడు… చుట్టూ కలియచూశాడు… ఓ మహిళ నిద్రపొతూ చేతుల్లో జాగ్రత్తగా పట్టుకున్న బ్యాగును చూశాడు… తనను ఎవరూ గమనించడం లేదని గ్రహించి ఒక్కదుటున ఆ మహిళ చేతిలోని బ్యాగు లాక్కుని రైలు నుంచి ప్లాట్‌ఫాంపైకి దూకి పరారయ్యాడు… క్షణాల్లో జరిగిన ఈ ఘటనతో ఆ మహిళా ప్రయాణికురాలు బిత్తరపోయింది… అనంతరం తేరుకుని కేకలు వేయడంతో ప్రయాణీకులు అప్రమత్తమయ్యారు… అప్పటికే ఆ దొంగ బ్యాగుతో సహా పరారై చీకట్లో కలిసిపోయాడు…

చీరాలలో 45 నిమిషాల పాటు ఆగిన నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్లోని ఏసి బోగీ D2లో ఈ ఘటన జరిగింది… తిరుపతి నుంచి హెద్రాబాద్ కు ప్రయాణిస్తున్న ఓ కుటుంబంలోని మహిళ రిజర్వేషన్‌ మరో బోగీలో దొరకడంతో తన పిల్లలతో కలిసి మరో బోగీలో ప్రయాణిస్తోంది… కుటుంబంలో మిగిలిన వారు పక్కబోగీలో ఉన్నారు… చీరాలలో రైలు ఆగిన సమయంలో ఏసిబోగీలో ప్రవేశించిన దొంగ మహిళ చేతిలోని బ్యాగును లాక్కుని పరారవడంతో తోటి ప్రయాణీకులు అప్రమత్తమైనా, అప్పటికే అతను మెరుపు వేగంతో రైలు దిగి ప్లాట్‌ ఫాం నుంచి కిందకు దూకి చీకట్లోకి పరుగులు పెట్టాడు.

ఈ పరిణామంతో ఖంగుతున్న బాధిత ప్రయాణీకురాలు కన్నీరుమున్నీరుగా విలపించింది… బ్యాగులో విలువైన వస్తువులు ఉన్నాయని రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది… బాధితురాలి ఫిర్యాదు మేరకు ప్రభుత్వ రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు… ఈ గొడవతో రైలు మరో 15 నిమిషాలు నిలిచిపోయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి…

Follow Us
టీమ్ ఆఫ్ ది లీగ్‌.. కెప్టెన్‌గా ప్రిన్స్.. కోహ్లీకి మొండి చెయ్యి
టీమ్ ఆఫ్ ది లీగ్‌.. కెప్టెన్‌గా ప్రిన్స్.. కోహ్లీకి మొండి చెయ్యి
రోహిణి కార్తెలో వంకాయ తింటే ఏమవుతుందో తెలుసా..?
రోహిణి కార్తెలో వంకాయ తింటే ఏమవుతుందో తెలుసా..?
చిరంజీవితో సమావేశమైన ఎగ్జిబిటర్స్ అసోసియేషన్‌..
చిరంజీవితో సమావేశమైన ఎగ్జిబిటర్స్ అసోసియేషన్‌..
రైలులో దోపిడీ దొంగల బీభత్సం.. ప్రయాణీకుడిలా వచ్చి.. మెరుపు వేగంతో
రైలులో దోపిడీ దొంగల బీభత్సం.. ప్రయాణీకుడిలా వచ్చి.. మెరుపు వేగంతో
మహిళలకు తెలంగాణ సర్కార్ మరో గుడ్ న్యూస్..
మహిళలకు తెలంగాణ సర్కార్ మరో గుడ్ న్యూస్..
రామ్ చరణ్ కొత్త బాడీగార్డ్ ఎవరో తెలుసా? రోజుకు జీతం ఎంతంటే?
రామ్ చరణ్ కొత్త బాడీగార్డ్ ఎవరో తెలుసా? రోజుకు జీతం ఎంతంటే?
భగ్గుమంటున్న ఎండలు.. చెట్లపైనే కాలి రాలిపోయిన మూగజీవాలు.. పండ్లల
భగ్గుమంటున్న ఎండలు.. చెట్లపైనే కాలి రాలిపోయిన మూగజీవాలు.. పండ్లల
ఒక్కరిద్దరు కాదు ఏకంగా ఐదుగురు ప్లేయర్లకు హ్యాండివ్వనున్న ఢిల్లీ
ఒక్కరిద్దరు కాదు ఏకంగా ఐదుగురు ప్లేయర్లకు హ్యాండివ్వనున్న ఢిల్లీ
మొదటిసారి గృహ రుణం తీసుకుంటున్నారా? ఈ కీలక విషయాలు తెలుసుకోండి..!
మొదటిసారి గృహ రుణం తీసుకుంటున్నారా? ఈ కీలక విషయాలు తెలుసుకోండి..!
గరం మసాలాను డ్రగ్స్‌గా భావించిన అధికారులు.. అతనికి 57 రోజుల జైలు
గరం మసాలాను డ్రగ్స్‌గా భావించిన అధికారులు.. అతనికి 57 రోజుల జైలు