AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోవిడ్ తెచ్చిన సరికొత్త ముప్పు, భారత్‌లో సైలెంట్ క్రైసిస్.. యువతలో పెరిగిన జాయింట్ రిప్లేస్‌మెంట్లు.. !

కోవిడ్‌ మహమ్మారి ముగిసిపోయి చాలా కాలం అవుతున్నా, భారతీయుల ఆరోగ్యంపై అది వేసిన ముద్ర అంత తేలిగ్గా చెరిగిపోవడం లేదు. కరోనా వైరస్ ఊపిరితిత్తులను మాత్రమే కాకుండా మానవ శరీరంలోని ఎముకల ఆరోగ్యాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీసిందని తాజా వైద్య నివేదికలు వెల్లడిస్తున్నాయి. భారతదేశంలో ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్న ఒక భయంకరమైన ఆరోగ్య సమస్య ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సాధారణంగా వృద్ధాప్యంలో వచ్చే ఈ సమస్య, ఇప్పుడు దేశంలోని యువ జనాభాను వేధించడం వైద్యులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసలు సమస్య ఏంటంటే..

కోవిడ్ తెచ్చిన సరికొత్త ముప్పు, భారత్‌లో సైలెంట్ క్రైసిస్.. యువతలో పెరిగిన జాయింట్ రిప్లేస్‌మెంట్లు.. !
Post Covid Complications
Jyothi Gadda
|

Updated on: May 25, 2026 | 6:42 PM

Share

కరోనా మహమ్మారి ముగిసిపోయినప్పటికీ, అది మానవ శరీరంపై వదిలివెళ్లిన దుష్ప్రభావాలు మాత్రం ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా, భారతీయ వైద్య నిపుణులు ఒక షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. సాధారణంగా వృద్ధులలో లేదా 60 ఏళ్లు పైబడిన వారిలో కనిపించే నడుము నొప్పులు, కీళ్ల సమస్యలు ఇప్పుడు 30 ఏళ్ల వయసున్న భారతీయ యువతలో తీవ్రంగా కనిపిస్తున్నాయి. ఎంతో మంది యువతీ యువకులు హఠాత్తుగా హిప్ రిప్లేస్‌మెంట్ (నడుము కీలు మార్పిడి) శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తోందని వైద్యులు చెబుతున్నారు.

ఎముకలు కుళ్ళిపోవడానికి (AVN) కారణం ఏమిటి?:

వైద్య పరిభాషలో ఈ సమస్యను అవాస్కులర్ నెక్రోసిస్ (Avascular Necrosis – AVN) లేదా బోన్ డెత్ అని పిలుస్తారు. కోవిడ్ బారిన పడినప్పుడు రోగుల ప్రాణాలను కాపాడటానికి వైద్యులు స్టెరాయిడ్స్ (Steroids) ను ఎక్కువగా ఉపయోగించారు. ఈ స్టెరాయిడ్ల వాడకం వల్ల లేదా కోవిడ్ వైరస్ నేరుగా రక్తనాళాలపై చూపే ప్రభావం వల్ల, నడుము కీలు భాగానికి (Femur Head) జరిగే రక్తప్రసరణ ఆగిపోతుంది. రక్తం అందకపోవడంతో ఆ ప్రాంతంలోని ఎముక కణజాలం క్రమంగా బలహీనపడి, కుళ్ళిపోయి ముక్కలవుతుంది.

30 ఏళ్ల వయసులోనే నడవలేని స్థితి:

ఈ సమస్య బారిన పడిన యువకులు తీవ్రమైన నడుము నొప్పి, నడవడానికి, కూర్చోవడానికి ఇబ్బంది పడుతూ ఆసుపత్రులకు వస్తున్నారు. వ్యాధి ముదిరిన స్టేజ్-3 లేదా స్టేజ్-4 లో ఉన్న రోగులకు హిప్ రిప్లేస్‌మెంట్ సర్జరీ ఒక్కటే మార్గమని వైద్యులు పేర్కొంటున్నారు. ఎంతో యాక్టివ్‌గా ఉండాల్సిన వయసులో ఇలాంటి మేజర్ సర్జరీలు అవ్వడం యువత భవిష్యత్తుపై, వారి వృత్తిపరమైన జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

ఇవి కూడా చదవండి

వైద్యుల సూచన:

గతంలో కోవిడ్ బారిన పడిన వారు లేదా స్టెరాయిడ్లు తీసుకున్న చరిత్ర ఉన్నవారు తమ నడుము, తొడలు లేదా మోకాళ్ల భాగంలో నిరంతరంగా నొప్పి ఉంటే వెంటనే ఆర్థోపెడిక్ వైద్యుడిని సంప్రదించాలి. ఎక్స్-రే (X-Ray) లలో ప్రాథమిక దశలో ఈ సమస్య సరిగ్గా కనిపించకపోవచ్చు, కాబట్టి ఎమ్‌ఆర్‌ఐ (MRI) స్కాన్ చేయించుకోవడం ద్వారా దీనిని ముందే గుర్తించవచ్చు. తొలి దశలోనే గుర్తిస్తే మందులు, వ్యాయామా, చిన్నపాటి చికిత్సల ద్వారా ఎముకను, కీళ్లను శస్త్రచికిత్స లేకుండా కాపాడుకోవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
కోవిడ్ తెచ్చిన సరికొత్త ముప్పు,యువతలో పెరిగిన నడుము కీలు మార్పిడి
కోవిడ్ తెచ్చిన సరికొత్త ముప్పు,యువతలో పెరిగిన నడుము కీలు మార్పిడి
ఫెంగ్ షుయ్ వాస్తు.. ఈ విగ్రహాలను ఇంటికి తెచ్చుకుంటే డబ్బే డబ్బు..
ఫెంగ్ షుయ్ వాస్తు.. ఈ విగ్రహాలను ఇంటికి తెచ్చుకుంటే డబ్బే డబ్బు..
వాస్తు ప్రకారం ఈ వస్తువులను చేతికి ఇవ్వడం అశుభం.. లేకపోతే నష్టాలు
వాస్తు ప్రకారం ఈ వస్తువులను చేతికి ఇవ్వడం అశుభం.. లేకపోతే నష్టాలు
దోసె పిండి పొంగడం లేదా? ఇలా చేయండి..బెస్ట్‌ కిచెన్‌ టిప్స్‌..!
దోసె పిండి పొంగడం లేదా? ఇలా చేయండి..బెస్ట్‌ కిచెన్‌ టిప్స్‌..!
‘పద్మశ్రీ’ అందుకున్న లేడీ రోహిత్..
‘పద్మశ్రీ’ అందుకున్న లేడీ రోహిత్..
చెట్లను నరకకుండా నిర్మించిన ఇల్లు.. ఆనంద్ మహీంద్రా ఫిదా..!
చెట్లను నరకకుండా నిర్మించిన ఇల్లు.. ఆనంద్ మహీంద్రా ఫిదా..!
పెళ్లి చేసుకోవడం కంటే ఆ పని చేయడం వంద రెట్లు బెటర్..
పెళ్లి చేసుకోవడం కంటే ఆ పని చేయడం వంద రెట్లు బెటర్..
BEL జాబ్స్ బంపర్ ఆఫర్.. ఇంజినీరింగ్ అభ్యర్థులకు 60 వేల జీతం!
BEL జాబ్స్ బంపర్ ఆఫర్.. ఇంజినీరింగ్ అభ్యర్థులకు 60 వేల జీతం!
తెలంగాణ వ్యాప్తంగా 37 లక్షల గృహ ఎల్‌పీజీ సిలిండర్లు..!
తెలంగాణ వ్యాప్తంగా 37 లక్షల గృహ ఎల్‌పీజీ సిలిండర్లు..!
డ్రైవర్‌ను తక్కువ చేసి నవ్విన అమ్మాయిలు..ఫైర్ అవుతున్న నెటిజన్లు
డ్రైవర్‌ను తక్కువ చేసి నవ్విన అమ్మాయిలు..ఫైర్ అవుతున్న నెటిజన్లు