కొబ్బరి నీళ్లు తాగుతున్నారా..? ముందు ఈ విషయాలు తెలుసుకోండి..

Krishna

25 May 2026

కొబ్బరినీళ్ల బాటిల్ లేదా ప్యాకెట్ ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత.. ఖచ్చితంగా 1 నుండి 2 రోజులలోపు తాగేయాలి. ఓపెన్ చేసిన వెంటనే దానిని ఫ్రిజ్‌లో భద్రపరచడం చాలా ముఖ్యం. ఒకవేళ బయటే ఉంచితే వాటిని తాగకపోవడం మంచిది.

ఓపెన్ చేశాక

కొబ్బరినీళ్లకు గాలి తగిలితే అందులోని పోషకాలు వేగంగా నశించిపోతాయి. వేసవి ఉష్ణోగ్రతల వల్ల ఓపెన్ చేసిన బాటిల్‌ను బయట వదిలేస్తే.. కేవలం 2 నుండి 4 గంటల్లోనే అది పులిసిపోవడం ప్రారంభమవుతుంది.

గాలి తగిలితే..

కొబ్బరినీళ్లు తాగేటప్పుడు కొద్దిగా పొంగు వచ్చినట్లు అనిపించినా లేదా రుచి కొంచెం పుల్లగా మారినా అది పాడైపోయిందని అర్థం. అలాంటి నీటిని వెంటనే పారబోయాలి. నిల్వ ఉంచేటప్పుడు బాటిల్ మూత గట్టిగా పెట్టాలి.

పాడైందని ఇలా

కొబ్బరినీళ్లలో పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. ఎండకు చెమట రూపంలో శరీరం కోల్పోయే లవణాలను ఇవి వెంటనే భర్తీ చేస్తాయి. ఎలాంటి ఆర్టిఫిషియల్ కెమికల్స్ లేని ఒక అద్భుతమైన నేచురల్ ఎనర్జీ డ్రింక్ ఇది.

ఎలక్ట్రోలైట్ బూస్టర్

ఇది జీర్ణక్రియకు చాలా తేలికగా ఉంటుంది. శరీరంలో చక్కెర స్థాయిలను అస్సలు పెంచదు. క్యాలరీలు చాలా తక్కువగా ఉండటం వల్ల బరువు పెరుగుతామనే భయం లేకుండా రోజంతా హ్యాపీగా సిప్ చేయవచ్చు.  

తక్కువ క్యాలరీలు

ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొబ్బరినీళ్లు తాగడం వల్ల శరీర మెటబాలిజం చురుగ్గా మారుతుంది. బాడీని హైడ్రేట్ చేయడమే కాకుండా ఇందులోని లారిక్ యాసిడ్ రోగనిరోధక శక్తిని పెంచి, బరువును అదుపులో ఉంచుతుంది.

పరగడుపున తాగితే

వ్యాయామం చేసేవారికి కొబ్బరినీళ్లు బెస్ట్ ఫ్రెండ్. వర్కవుట్‌కు ముందు తాగితే శరీరానికి అవసరమైన ఇంధనం అందుతుంది. వర్కవుట్ పూర్తయిన తర్వాత తాగితే అలసిపోయిన శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.

వర్కవుట్స్‌కు ముందు

రాత్రి పడుకునే ముందు కొబ్బరినీళ్లు తాగడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారుతుంది. నిద్రపోతున్న సమయంలో బాడీని డిటాక్స్ చేయడానికి, మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది.

 పడుకునే ముందు