AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోహిణి కార్తెలో వంకాయ తింటే ఏమవుతుందో తెలుసా..? ఈ విషయాలు తెలిస్తే నోరెళ్లబెడతారు..

రోహిణి కార్తెలో రోళ్లు పగులుతాయి అనే సామెతను నిజం చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో ఎండలు 45 డిగ్రీల మార్కును దాటేస్తున్నాయి. భానుడు అగ్నిగోళాన్ని తలపిస్తున్న ఈ తరుణంలో మనం తినే ఆహారంలో ఒక కూరగాయను అస్సలు ముట్టుకోకూడదని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు. కూరగాయల రాజుగా పిలిచే వంకాయను ఈ టైంలో తింటే శరీరానికి ఎలాంటి ముప్పు పొంచి ఉందో తెలుసుకుందాం..

రోహిణి కార్తెలో వంకాయ తింటే ఏమవుతుందో తెలుసా..? ఈ విషయాలు తెలిస్తే నోరెళ్లబెడతారు..
Why You Should Avoid Eating Brinjal In Summer
Krishna S
|

Updated on: May 25, 2026 | 8:35 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో భానుడు అగ్నిగోళాన్ని తలపిస్తున్నాడు. “రోహిణి కార్తెలో రోళ్లు పగులుతాయి” అనే సామెతను నిజం చేస్తూ.. అత్యంత పవర్‌ఫుల్ రోహిణి కార్తె ఎండలు దేశాన్ని, ముఖ్యంగా ఏపీ, తెలంగాణలను వణికించడానికి సిద్ధమయ్యాయి. జ్యోతిష్య, ఆయుర్వేద శాస్త్రాల ప్రకారం.. ఈ సమయంలో సూర్యుడి కిరణాలు భూమిపై నిట్టనిలువుగా పడటం వల్ల మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌కు మించి నమోదయ్యే అవకాశం ఉంది. ఈ ఎండల్లో ఆరోగ్యంగా ఉండటానికి ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం అత్యవసరం. అయితే ఈ రోహిణి కార్తె తొలినాళ్లలో ఒక కూరగాయను మాత్రం అస్సలు ముట్టుకోకూడదని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదేంటో కాదు.. మనందరికీ ఇష్టమైన వంకాయ. రోహిణి కార్తెలో వంకాయను ఎందుకు నిషేధించారో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆయుర్వేదం ప్రకారం వంకాయ వేడి శరీరానికి శత్రువు

సాధారణంగా వంకాయతో రకరకాల వంటకాలు చేసుకుని ఇష్టంగా తింటాం. కానీ ఆయుర్వేద శాస్త్రం ప్రకారం వంకాయ అనేది తీవ్రమైన వేడి స్వభావం కలిగిన కూరగాయ. రోహిణి కార్తెలోని ఈ మొదటి తొమ్మిది రోజులలో వంకాయను మీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల బాడీలో ఇంటర్నల్ హీట్ విపరీతంగా పెరిగిపోయి, అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

వంకాయ తినడం వల్ల వచ్చే సమస్యలు ఇవే..

జీర్ణక్రియ అస్తవ్యస్తం: రోహిణి కార్తెలో వాతావరణంలో ఉండే అధిక వేడి వల్ల మన జీర్ణవ్యవస్థ ఇప్పటికే చాలా బలహీనపడుతుంది. ఈ టైంలో వేడి, బరువైన ఆహారమైన వంకాయను తింటే అది అరగడానికి చాలా సమయం పడుతుంది. దీనివల్ల అజీర్ణం, తీవ్రమైన ఎసిడిటీ, గుండెల్లో మంట, చంచలత్వం, వాంతులు అయ్యే ప్రమాదం ఉంది.

చర్మ సమస్యలు: వంకాయలోని ఉష్ణ తత్వం వల్ల ఈ రోజుల్లో చర్మంపై దద్దుర్లు, వేడి గడ్డలు, చెమటకాయలు లేదా విపరీతమైన దురద వంటి అలర్జీ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

మరి ఈ రోజుల్లో ఏం తినాలి? ఏం తాగాలి?

ఎండల తీవ్రతను తట్టుకుని శరీరం చల్లగా, హైడ్రేటెడ్‌గా ఉండాలంటే రోహిణి కార్తె ముగిసే వరకు తేలికైన, నీటి శాతం ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు:

నీటి శాతం ఉన్న పండ్లు: పుచ్చకాయ, మస్క్ మిలన్, దోసకాయలను ఎక్కువగా తీసుకోవాలి.

చల్లని పానీయాలు: రోజుకు రెండు మూడు సార్లు నిమ్మరసం, పల్చటి మజ్జిగ లేదా లస్సీ తాగడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది.

సీజనల్ ఫ్రూట్స్: ఈ కాలంలో లభించే తాజా పండ్లను తీసుకోవడం వల్ల వడదెబ్బ తగలకుండా కాపాడుకోవచ్చు.

కూరగాయల్లో వంకాయ టేస్టే వేరైనా.. ఈ కార్తె ముగిసే వరకు దానికి కాస్త దూరంగా ఉండటమే మీ ఆరోగ్యానికి శ్రీరామరక్ష. సాధ్యమైనంత వరకు చలవచేసే ఆహార పదార్థాలు తింటూ సురక్షితంగా ఉండండి..

Follow Us
రోహిణి కార్తెలో వంకాయ తింటే ఏమవుతుందో తెలుసా..?
రోహిణి కార్తెలో వంకాయ తింటే ఏమవుతుందో తెలుసా..?
చిరంజీవితో సమావేశమైన ఎగ్జిబిటర్స్ అసోసియేషన్‌..
చిరంజీవితో సమావేశమైన ఎగ్జిబిటర్స్ అసోసియేషన్‌..
రైలులో దోపిడీ దొంగల బీభత్సం.. ప్రయాణీకుడిలా వచ్చి.. మెరుపు వేగంతో
రైలులో దోపిడీ దొంగల బీభత్సం.. ప్రయాణీకుడిలా వచ్చి.. మెరుపు వేగంతో
మహిళలకు తెలంగాణ సర్కార్ మరో గుడ్ న్యూస్..
మహిళలకు తెలంగాణ సర్కార్ మరో గుడ్ న్యూస్..
రామ్ చరణ్ కొత్త బాడీగార్డ్ ఎవరో తెలుసా? రోజుకు జీతం ఎంతంటే?
రామ్ చరణ్ కొత్త బాడీగార్డ్ ఎవరో తెలుసా? రోజుకు జీతం ఎంతంటే?
భగ్గుమంటున్న ఎండలు.. చెట్లపైనే కాలి రాలిపోయిన మూగజీవాలు.. పండ్లల
భగ్గుమంటున్న ఎండలు.. చెట్లపైనే కాలి రాలిపోయిన మూగజీవాలు.. పండ్లల
ఒక్కరిద్దరు కాదు ఏకంగా ఐదుగురు ప్లేయర్లకు హ్యాండివ్వనున్న ఢిల్లీ
ఒక్కరిద్దరు కాదు ఏకంగా ఐదుగురు ప్లేయర్లకు హ్యాండివ్వనున్న ఢిల్లీ
మొదటిసారి గృహ రుణం తీసుకుంటున్నారా? ఈ కీలక విషయాలు తెలుసుకోండి..!
మొదటిసారి గృహ రుణం తీసుకుంటున్నారా? ఈ కీలక విషయాలు తెలుసుకోండి..!
గరం మసాలాను డ్రగ్స్‌గా భావించిన అధికారులు.. అతనికి 57 రోజుల జైలు
గరం మసాలాను డ్రగ్స్‌గా భావించిన అధికారులు.. అతనికి 57 రోజుల జైలు
డాలర్ ఢమాల్..! ప్రపంచ దేశాలకు రాబర్ట్ కియోసాకి వార్నింగ్..
డాలర్ ఢమాల్..! ప్రపంచ దేశాలకు రాబర్ట్ కియోసాకి వార్నింగ్..