AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: చిరంజీవి దగ్గరకు చేరిన పర్సంటేజ్‌ ఫైట్‌ !

యస్... అనుకున్నదే జరిగింది...! ఎగ్జిబిటర్లు వెళ్లి కలవడంతో టాలీవుడ్‌ పర్సంటేజ్‌ ఫైట్‌లోకి చిరంజీవి ఎంట్రీ అనివార్యమైంది...! ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌తో భేటీ అయిన చిరంజీవి... ప్రొడ్యూసర్స్‌ని కూడా కలిసే చాన్స్‌ కనిపిస్తోంది. మరి ఇరువర్గాలతో చర్చల తర్వాత చిరంజీవి ఎలాంటి సూచనలు చేయనున్నారు...? ఫిల్మ్‌ ఛాంబర్‌ వేసిన కమిటీ నివేదిక ఆధారంగానే చిరు డైరెక్షన్స్ ఉంటాయా...?

Tollywood: చిరంజీవి దగ్గరకు చేరిన పర్సంటేజ్‌ ఫైట్‌ !
Exhibitors Association Met Chiranjeevi
Ram Naramaneni
|

Updated on: May 25, 2026 | 8:35 PM

Share

టాలీవుడ్‌లో హై-వోల్టేజ్ ‘బాక్సాఫీస్ వార్’ నడుస్తోందిప్పుడు…! థియేటర్లు నడపలేక మునిగిపోతున్నాం, మాకూ కలెక్షన్స్‌లో పర్సంటేజ్ కావాల్సిందేనని పట్టుబడుతున్న ఎగ్జిబిటర్లు ఒకవైపు..! బ్లాక్‌మెయిల్ రూల్స్ పెడితే ఒప్పుకోం, అసలు సింగిల్ స్క్రీన్స్ పతనానికి కారణమే మీ మల్టీప్లెక్స్ వ్యాపారాలంటూ కౌంటర్ ఇస్తున్న ప్రొడ్యూసర్స్ గిల్డ్ మరొకవైపు..! ఇలా దశాబ్దాలుగా సాగుతున్న ఈ వివాదం ఈ మధ్యే ముదిరి పాకాన పడింది. దీంతో ఫిల్మ్‌ ఛాంబర్ కూడా ఎంట్రీ ఇచ్చి… 21 మందితో కలిపి ఓ కమిటీని వేసింది. అన్ని క్షుణ్ణంగా స్టడీ చేసి కమిటీనే పర్సంటేజ్ లెక్క తేలుస్తుందని ఫిల్మ్‌ ఛాంబర్ క్లారిటీ ఇచ్చింది. దాని అందరూ సమ్మతమేనన్నారు. ఓ రెండు నెలల తర్వాత కమిటీ రిపోర్ట్ ఆధారంగా నిర్ణయాలుంటాయంటే ఓకే చెప్పేశారు. ఇప్పుడు ఆల్ ఆఫ్‌ సడెన్‌గా… పెద్ది సినిమాకు రిలీజ్‌ ముందే చిరంజీవిని ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ కలవడం హాట్‌టాపిక్‌గా మారింది.

చిరంజీవితో సమావేశమైన ఎగ్జిబిటర్లు.. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్ల పరిస్థితితో పాటు రెంటల్‌ విధానంలో నష్టాలను వివరించారు. పర్సంటేజ్ విధానం తెస్తేనే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుందని చిరుకి చెప్పారు. ఇక ఎగ్జిబిటర్ల సాదకబాధకాలు విన్న చిరంజీవి… ఫిల్మ్‌ ఛాంబర్ వేసిన కమిటీ నివేదికను తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు మంగళవారం సాయంత్రం ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తోనూ నిర్మాతలు భేటీకానున్నారు. చిత్ర పరిశ్రమలోని సమస్యలతో పాటు పర్సంటేజ్ విధానంపైనా పవన్‌తో చర్చించనున్నారు. ఇక ఈమధ్యే ఎగ్జిబిటర్స్‌ సమస్యలపై స్పందించిన బాలకృష్ణ… సినిమాను బతికించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. చిత్రసీమను ఆదుకునేందుకు ఏపీ సర్కార్‌ సిద్ధంగా ఉందన్నారు. దీంతో పవన్‌-నిర్మాతల భేటీ ఆసక్తికరంగా మారింది.

మొత్తంగా… ఓవైపు అన్నయ్య, మరోవైపు తమ్ముడు… ఇద్దరూ పర్సంటేజ్‌ విధానంపై ఎలా స్పందిస్తారు…? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు…? అన్నదే ఇప్పుడు హాట్‌టాపిక్‌…!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రోహిణి కార్తెలో వంకాయ తింటే ఏమవుతుందో తెలుసా..?
రోహిణి కార్తెలో వంకాయ తింటే ఏమవుతుందో తెలుసా..?
చిరంజీవితో సమావేశమైన ఎగ్జిబిటర్స్ అసోసియేషన్‌..
చిరంజీవితో సమావేశమైన ఎగ్జిబిటర్స్ అసోసియేషన్‌..
రైలులో దోపిడీ దొంగల బీభత్సం.. ప్రయాణీకుడిలా వచ్చి.. మెరుపు వేగంతో
రైలులో దోపిడీ దొంగల బీభత్సం.. ప్రయాణీకుడిలా వచ్చి.. మెరుపు వేగంతో
మహిళలకు తెలంగాణ సర్కార్ మరో గుడ్ న్యూస్..
మహిళలకు తెలంగాణ సర్కార్ మరో గుడ్ న్యూస్..
రామ్ చరణ్ కొత్త బాడీగార్డ్ ఎవరో తెలుసా? రోజుకు జీతం ఎంతంటే?
రామ్ చరణ్ కొత్త బాడీగార్డ్ ఎవరో తెలుసా? రోజుకు జీతం ఎంతంటే?
భగ్గుమంటున్న ఎండలు.. చెట్లపైనే కాలి రాలిపోయిన మూగజీవాలు.. పండ్లల
భగ్గుమంటున్న ఎండలు.. చెట్లపైనే కాలి రాలిపోయిన మూగజీవాలు.. పండ్లల
ఒక్కరిద్దరు కాదు ఏకంగా ఐదుగురు ప్లేయర్లకు హ్యాండివ్వనున్న ఢిల్లీ
ఒక్కరిద్దరు కాదు ఏకంగా ఐదుగురు ప్లేయర్లకు హ్యాండివ్వనున్న ఢిల్లీ
మొదటిసారి గృహ రుణం తీసుకుంటున్నారా? ఈ కీలక విషయాలు తెలుసుకోండి..!
మొదటిసారి గృహ రుణం తీసుకుంటున్నారా? ఈ కీలక విషయాలు తెలుసుకోండి..!
గరం మసాలాను డ్రగ్స్‌గా భావించిన అధికారులు.. అతనికి 57 రోజుల జైలు
గరం మసాలాను డ్రగ్స్‌గా భావించిన అధికారులు.. అతనికి 57 రోజుల జైలు
డాలర్ ఢమాల్..! ప్రపంచ దేశాలకు రాబర్ట్ కియోసాకి వార్నింగ్..
డాలర్ ఢమాల్..! ప్రపంచ దేశాలకు రాబర్ట్ కియోసాకి వార్నింగ్..