IPL 2026 : క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..ఐపీఎల్ 2026 షెడ్యూల్ ఫిక్స్..మార్చి 12న బీసీసీఐ బిగ్ అనౌన్స్‌మెంట్
IPL 2026 : ఐపీఎల్ లవర్స్‌కు అదిరిపోయే వార్త వచ్చేసింది. గత కొన్ని రోజులుగా ఊరిస్తున్న ఐపీఎల్ 2026 (IPL 2026) షెడ్యూల్‌పై ఎట్టకేలకు ఒక క్లారిటీ వచ్చింది. నిజానికి టీ20 వరల్డ్ కప్ ఫైనల్ రోజే ఈ షెడ్యూల్ విడుదలవుతుందని అందరూ భావించారు..

IPL 2026 : ఐపీఎల్ లవర్స్‌కు అదిరిపోయే వార్త వచ్చేసింది. గత కొన్ని రోజులుగా ఊరిస్తున్న ఐపీఎల్ 2026 (IPL 2026) షెడ్యూల్‌పై ఎట్టకేలకు ఒక క్లారిటీ వచ్చింది. నిజానికి టీ20 వరల్డ్ కప్ ఫైనల్ రోజే ఈ షెడ్యూల్ విడుదలవుతుందని అందరూ భావించారు.. కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా షెడ్యూల్ విడుదలపై కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఎప్పుడు షెడ్యూల్ వస్తుంది? ఎందుకు ఆలస్యం అవుతోంది? అనే విషయాలను ఆయన వెల్లడించారు.
మార్చి 12న మొదటి విడత షెడ్యూల్
మీడియాతో మాట్లాడిన దేవజిత్ సైకియా.. మార్చి 12 లోపు ఐపీఎల్ 2026 షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. అయితే, ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. మొత్తం టోర్నీ షెడ్యూల్‌ను ఒకేసారి ప్రకటించడం లేదు. ప్రస్తుతం కేవలం మొదటి 20 రోజుల షెడ్యూల్‌ను మాత్రమే బీసీసీఐ విడుదల చేయనుంది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఇప్పటికే మొదటి విడత మ్యాచుల జాబితాను సిద్ధం చేసింది. మిగిలిన మ్యాచుల వివరాలను తర్వాతి దశలో ప్రకటిస్తారు.
అందుకే ఈ ఆలస్యం
ఐపీఎల్ షెడ్యూల్ విడుదలలో ఆలస్యానికి ప్రధాన కారణం ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే. 2026లో పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లోనూ ఐపీఎల్ టీమ్స్ ఉండటం, అక్కడ హోమ్ గ్రౌండ్ మ్యాచులు జరగాల్సి ఉండటంతో భద్రతా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా బీసీసీఐ జాగ్రత్త పడుతోంది. ఎన్నికల తేదీలకు అనుగుణంగా మ్యాచులను సర్దుబాటు చేయాల్సి రావడంతో షెడ్యూల్‌ను విడతల వారీగా ప్రకటిస్తున్నారు.
“We plan to announce IPL 2026 schedule by March 12. For now, we are going to announce the IPL 2026 schedule for first 20 days,” BCCI Secretary Devajit Saikia told IANS. pic.twitter.com/91eaQHAQP1
— IANS (@ians_india) March 10, 2026
లీగ్ ప్రారంభం ఎప్పుడంటే?
బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రానప్పటికీ, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మే 31వ తేదీన గ్రాండ్ ఫైనల్ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. గతంలో మార్చి 26 నుంచే టోర్నీ మొదలవుతుందని ప్రచారం జరిగినప్పటికీ, ఇప్పుడు ఆ తేదీ రెండు రోజులు వెనక్కి వెళ్ళినట్లు తెలుస్తోంది. మార్చి 12న వచ్చే షెడ్యూల్ తో తొలి మ్యాచ్ ఎవరి మధ్య ఉంటుంది? వేదికలు ఎక్కడ? అనే దానిపై పూర్తి క్లారిటీ రానుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
