గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
బంగారం, వెండి ధరలు ఇటీవల తగ్గుముఖం పట్టాయి. మూడు రోజులుగా గోల్డ్ ధరలు తగ్గుతుండగా, బుధవారం 24 క్యారెట్ల బంగారంపై రూ.320, 22 క్యారెట్లపై రూ.300 తగ్గింది. వెండి ధర స్థిరంగా ఉంది. దేశంలోని వివిధ నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం, వెండి ధరల వివరాలను తెలుసుకోండి. కొన్ని రోజులుగా సామాన్యులకు అందకుండా పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి.
కొన్ని రోజులుగా సామాన్యులకు అందకుండా పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. మూడురోజులుగా వీటి ధరలకు తగ్గుతూ వస్తున్నాయి. మంగళవారం ఒక్కరోజే ఏకంగా రూ.3,050లు తగ్గిన బంగారం బుధవారం కూడా స్వల్పంగా తగ్గింది. 24 క్యారెట్ల బంగారంపై బుధవారం రూ.320లు తగ్గి రూ.1,35,880 పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.300 తగ్గి రూ.1,24,550లు పలుకుతోంది. ఇక వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతూ రూ.2,58,000 పలుకుతోంది. ఇక దేశంలోని వివిధ నగరాల్లో డిసెంబరు 30 బుధవారం బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,36,030, పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,24,700 పలుకుతోంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1, 35,880 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,24,550 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,910, ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,500గా ఉంది. కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,880 ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,24,550 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1, 35,880 ఉంటే.. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,24,550 పలుకుతోంది. కిలో వెండి ధర రూ.2,58,000 పలుకుతోంది. ఈ ధరలు ఉదయం 11 గంటలకు నమోదైనవి. ఇవి పెరగవచ్చు, తగ్గవచ్చు. బంగారం కొనడానికి వెళ్లేముందు మరోసారి ధరలు చెక్‌చేసుకుంటే మంచిది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
న్యూ ఇయర్ ట్రిప్‌కి పూజా, మాళవిక, మౌని రాయ్
దేశ ప్రజలకు కేంద్రం భారీ శుభవార్త..జనవరి 1 నుంచి
బంగారం కోసం ఇంటి ఓనర్ను చంపి గోదావరిలో పడేసిన యువకులు
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

