AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్రీ బస్‌లో ఇక ఆధార్‌‌తో పనిలేదు మరి ఎలాగంటే..

ఫ్రీ బస్‌లో ఇక ఆధార్‌‌తో పనిలేదు మరి ఎలాగంటే..

Phani CH
|

Updated on: Dec 31, 2025 | 9:37 PM

Share

దక్షిణ కొరియాలో పాత ఎయిర్ కండిషనర్లలో 24 క్యారెట్ల బంగారు లోగోలు ఉన్నాయని వైరల్ వీడియో వెల్లడించింది. 2005, 2008లో పరిమిత సంఖ్యలో ఉత్పత్తి చేసిన ఏసీ మోడల్స్‌లో ఈ లోగోలు ఉన్నాయని తెలిసింది. దీనితో ప్రజలు తమ పాత ఏసీలను పరిశీలించడం ప్రారంభించారు. ఒక లోగోకు $482 డాలర్ల వరకు విలువ లభిస్తోంది, ఇది వినియోగదారులకు పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించింది.

తెలంగాణలో మహాలక్ష్మీ పథకం పేరుతో మహిళలకు అందిస్తున్న ఉచిత బస్సు ప్రయాణంలో పలు కీలక మార్పులు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రవాణా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు.. అత్యాధునిక సాంకేతికతను జోడించే దిశగా ఆర్టీసీ ఉన్నతాధికారులు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని మహిళలందరికీ ‘స్మార్ట్ కార్డు’లను పంపిణీ చేసే దిశగా వారు నిర్ణయం తీసుకున్నారు. అలాగే, కామన్ మొబిలిటీ కార్డుల రూపకల్పనకు ప్రభుత్వం ఇప్పటికే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. కామన్ మొబిలిటీ కార్డులు కేవలం బస్సు పాస్ మాత్రమే కాకుండా.. మల్టీ పర్పస్ డిజిటల్ వాలెట్ కింద ఉపయోగించేలా రూపకల్పన చేస్తున్నారు. ఈ కార్డు ద్వారా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయడమే కాకుండా.. ఇందులో కొంత నగదు ఉండేలా చూసుకోవటం ద్వారా మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లలోనూ ప్రయాణం చేయవచ్చు. భవిష్యత్తులో ఇదే కార్డుకు రేషన్, ఆరోగ్య సేవలు, ఇతర ప్రభుత్వ పధకాలను కూడా అనుసంధానం చేయాలనేది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఈ కార్డు ఉంటే.. ఇకపై ప్రయాణీకులు ఆధార్ కార్డును ప్రతీసారి తమ వెంట తీసుకెళ్ళాల్సిన పని ఉండదు. ఈ కార్డుల ద్వారా ప్రతీ ప్రయాణం ఇక డిజిటల్‌గా రికార్డు అవుతుంది కాబట్టి.. దానికి తగ్గట్టుగా రద్దీ ఉన్న ప్రాంతాల్లో మరిన్ని బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ భావిస్తోంది. అలాగే ఈ డిజిటల్ కార్డుల ద్వారా ప్రజా రవాణా వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కాగా, రాష్ట్ర ప్రజలందరికీ ఈ స్మార్ట్ కార్డులను అందుబాటులోకి తీసుకొస్తే.. తెలంగాణ డిజిటల్ విప్లవానికి ఇదే నాంది కానుంది. కాగా, ఇప్పటివరకు మహాలక్ష్మీ పధకం కింద సుమారు సుమారు 255 కోట్ల ఉచిత ప్రయాణాలు జరగగా.. ప్రభుత్వం రూ. 8,500 కోట్ల నిధులను ఆర్టీసీకి మంజూరు చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రైలు పట్టాలపై నడవదు.. అయస్కాంత శక్తితో పరుగులు పెట్టే బుల్లెట్‌ ట్రైన్‌..

డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం

చైనా ఇంజనీర్ల మరో అద్భుతం.. అరుదైన ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్‌ నిర్మాణం

పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి

జీమెయిల్ వాడుతున్నారా..? ఎగిరి గంతేసే వార్త చెప్పిన గూగుల్