దేశ ప్రజలకు కేంద్రం భారీ శుభవార్త..జనవరి 1 నుంచి
కేంద్ర ప్రభుత్వం ఓలా, ఉబర్, ర్యాపిడోలకు పోటీగా భారత్ టాక్సీ సేవలను త్వరలో ప్రారంభించనుంది. అధిక ఛార్జీల సమస్యకు పరిష్కారంగా, ప్రయాణికులకు తక్కువ ధరకే ప్రయాణ సౌకర్యాన్ని ఇది అందిస్తుంది. బైక్, ఆటో, కార్ బుకింగ్ ఆప్షన్లతో పాటు డ్రైవర్లకు మెరుగైన ఆదాయాన్ని కల్పిస్తుంది. ఇది దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది.
ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి కంపెనీలకు పోటీగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా భారత్ టాక్సీ సేవలను ప్రారంభించేందుకు సిద్దమవుతోంది. జనవరి 1వ తేదీన లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. దీంతో కొత్త సంవత్సరం నుంచి దేశ ప్రజలు తక్కువ ధరకే తమ గమ్యస్థానాలకు ప్రయాణం చేసే సౌకర్యం లభించనుంది. ప్రైవేట్ క్యాబ్ యాప్‌లు ప్రజల నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్నాయి. వర్షం పడే సమయం, ఉదయం లేదా సాయంత్రం రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో ఛార్జీలను మరింత పెంచుతోంది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు అధిక మొత్తం చెల్లించి వీటిని బుక్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కేంద్రం ప్రజలకు ఈ భారీ ధరలనుంచి కాస్త ఉపశమనం కలిగిస్తూ భారత్ ట్యాక్సీని ప్రవేశపెడుతోంది. భారత్ ట్యాక్సీ యాప్ రాకతో దేశంలోని ప్రజలు తక్కువ ధరకే ఎక్కడికైనా ప్రయాణం చేయగలుగుతారు. ప్రైవేట్ సర్వీసుతో పోలిస్తే ఈ ఫ్లాట్‌ఫామ్‌లో ఛార్జీలు చాలా తక్కువగా ఉంటాయి. దీంతో ప్రైవేట్ క్యాబ్‌లను ఆశ్రయించేవారికి డబ్బులు భారీగా ఆదా అవుతాయి. భారత్ ట్యాక్సీ యాప్‌లో బైక్, ఆటో, కారు బుక్ చేసుకోవచ్చు. ప్రైవేట్ యాప్‌ల తరహాలోనే ఇందులోనూ డ్రైవర్లు రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రజలకు సేవలు అందించవచ్చు. దీని వల్ల రైడర్లకు కూడా ఆదాయం లభించనుంది. ఇప్పటికే కొన్ని నగరాల్లో ప్రయోగాత్మకంగా ఈ యాప్ సేవలను ప్రారంభించగా.. సక్సెస్ అయింది. దీంతో జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా కేంద్రం ప్రారంభించనుంది. ప్రైవేట్ యాప్స్‌లో రైడ్‌ను బుక్ చేసుకున్న తర్వాత పలుమార్లు రైడర్లు రద్దు చేస్తున్నారు. అలాగే కొన్నిసార్లు డ్రైవర్లు కూడా అందుబాటులో ఉండకపోవడం వల్ల రైడ్ బుకింగ్ చేసుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. అయితే భారత్ ట్యాక్సీ యాప్‌లో ఎక్కువమంది డ్రైవర్లు బుక్ చేసుకునేలా కేంద్రం ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. దీని వల్ల ఎక్కువమంది రిజిస్టర్ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీని వల్ల ప్రజలకు వెంటనే బుకింగ్ అవుతుంది. తక్కువ ధరకే సేవలు అందించడంతో పాటు యాప్‌ను సజావుగా నడిపిస్తే కేంద్ర ప్రభుత్వంలోని భారత్ ట్యాక్సీ యాప్ ప్రైవేట్ కంపెనీలకు పోటీ ఇవ్వడం పెద్ద కష్టం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక డ్రైవర్లకు కూడా ఎక్కువ బుకింగ్స్ వచ్చి సంపాదన పెరిగితే యాప్ మరింతగా ప్రజల్లోకి వెళ్లనుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బంగారం కోసం ఇంటి ఓనర్‌ను చంపి గోదావరిలో పడేసిన యువకులు
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
ఫ్రీ బస్‌లో ఇక ఆధార్‌తో పనిలేదు మరి ఎలాగంటే..
రైలు పట్టాలపై నడవదు.. అయస్కాంత శక్తితో పరుగులు పెట్టే బుల్లెట్ ట్రైన్..
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

