బంగారం కోసం ఇంటి ఓనర్ను చంపి గోదావరిలో పడేసిన యువకులు
హైదరాబాద్ నాచారంలో దారుణం జరిగింది. అద్దెదారుడు అంజిబాబు, అతడి స్నేహితులు బంగారం కోసం ఇంటి యజమాని సుజాతను హత్య చేశారు. సుజాత గొంతు నులిమి 11 తులాల బంగారాన్ని దోచుకున్నారు. అనంతరం మృతదేహాన్ని గోదావరి నదిలో పడేశారు. పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అద్దెకు దిగిన వారే ఇంటి యజమానికి కాలయముళ్లయ్యారు.
హైదరాబాద్లో దారుణం జరిగింది. బంగారమే ప్రాణం తీసింది… నాచారంలో ఇంటి యజమానిని ముగ్గురు యువకులు హత్య చేశారు. అద్దెకు దిగిన వారు యజమాని ఇంటి కాలయముళ్లుగా మారారు. బంగారం కోసం ఇంటి యజమాని సుజాతను చంపిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొన్నాళ్ల క్రితం కోనసీమజిల్లాకు చెందిన అంజిబాబు.. సుజాత ఇంట్లో అద్దెకు దిగాడు. అంజిబాబు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. రెండు నెలల క్రితమే ఇంట్లోకి అద్దెకు వచ్చిన అంజిబాబు ఒంటరిగా ఉంటున్న సుజాత దగ్గర నగలు ఉన్నాయని గమనించాడు. నగదు ఉందని చూసి వాటిని కాజేయడానికి స్కెచ్ వేశాడు. ఈ నెల 19వ రాత్రి సుజాతను గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు. ఆమె శరీరంపై ఉన్న పదకొండు తులాల బంగారాన్ని తీసుకున్నాడు. మృతదేహాన్ని మాయం చేసేందుకు తన స్నేహితులైన యువరాజు, దుర్గారావుల హెల్స్ తీసుకున్నాడు. ముగ్గురు కారును అద్దెకు తీసుకుని సుజాత మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి గోదావరి నదిలో పడేశారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరస్పాండెంట్ ప్రణీత అందిస్తారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
ఫ్రీ బస్‌లో ఇక ఆధార్‌తో పనిలేదు మరి ఎలాగంటే..
రైలు పట్టాలపై నడవదు.. అయస్కాంత శక్తితో పరుగులు పెట్టే బుల్లెట్ ట్రైన్..
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
చైనా ఇంజనీర్ల మరో అద్భుతం.. అరుదైన ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్ నిర్మాణం
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

