Liquor Sales: న్యూ ఇయర్ జోష్.. మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డ్.. ఈ సారి ఎంతంటే..?
ఏపీ, తెలంగాణలో మద్యం అమ్మకాలు రికార్డ్ స్థాయిలో జరుగుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే రికార్డ్ దిశగా సేల్స్ కొనసాగుతున్నాయి. న్యూ ఇయర్ కావడంతో మందుబాబుల్లో జోష్ నెలకొంది. ఫ్రెండ్స్‌తో కలిసి తాగుతూ ఫుల్ చిల్ అవ్వుతున్నారు. ఈ ఏడాది సేల్స్ ఇలా..

కొత్త సంవత్సరం సందర్భంగా తెలంగాణలో మద్యం ఏలురై పారుతోంది. డిసెంబర్ 31న రాత్రి బార్లు, పబ్బులు, క్లబుల్లో మద్యం విక్రయాలు భారీగా జరుగుతున్నాయి. ఇక వైన్ షాపులు వద్ద భారీగా మందుబాబులు క్యూ కట్టి మద్యం కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఎక్కడ బట్టినా నగరంలో మందుబాబుల సందడి కనిపిస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం అర్థరాత్రి ఒంటి గంటల వరకు మద్యం దుకాణాలకు సమయమిచ్చింది. బార్లు, రెస్టారెంట్లు, పబ్స్ రాత్రి ఒంటి గంటల వరకు మద్యం సర్వ్ చేయడానికి అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో తెలంగాణలో లిక్కర్ సేల్స్ రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి.
ఇప్పటికే రూ.5 వేల కోట్ల సేల్స్
న్యూఇయర్ జోష్ వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే రూ.5 వేల కోట్ల విలువ చేసే మద్యం సేల్స్ జరిగినట్లు ఎక్సైజ్ గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది న్యూ ఇయర్‌కు మద్యం అమ్మకాలు మరింత పెరిగాయి. గత ఏడాదిలో పోలిస్తే ఈ సారి అదనంగా వెయ్యి కోట్ల రూపాయల లిక్కర్ సేల్స్ ఎక్కువగా జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ రాత్రి అమ్మకాల లెక్కలు ఇంకా బయటకు రాలేదు. అవి బయటకు వస్తే ఈ సారి ఆల్ టైం రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు జరగనున్నాయని తెలుస్తోంది. మద్యం పాలసీ మార్చడం వల్లే లిక్కర్ సేల్స్ పెరిగిపోయాయని అధికారులు చెబుతున్నారు.
ఏపీలో భారీగా అమ్మకాలు
అటు ఏపీలో కూడా భారీ స్థాయిలో లిక్కర్ సేల్స్ జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా రాత్రి 12 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చారు. వైన్ షాపులు, బార్లు, పబ్బులు, ఈవెంట్లలో లిక్కర్ సర్వ్ చేయడానికి 12 గంటల వరకు పర్మిషన్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం రేట్లతో తగ్గించడంతో పాటు బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఏపీలో కూడా లిక్కర్ సేల్స్ రికార్డు స్థాయిలో జరగనున్నాయని తెలుస్తోంది.
