మధుమేహం ఉన్నవారికి ఈ పప్పు సూపర్‌ ఫుడ్‌..!

31 December 2025

Jyothi Gadda

మినప్పప్పు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకమైనది. ఇందులో అనేక పోషకాలు ఉన్నాయి. దాదాపు ప్రతి భారతీయ ఇంటిలోనూ మినప్పప్పు సులభంగా లభిస్తుంది.

మినప్పప్పులో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి, భాస్వరం, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

మినప్పప్పులో పోషకాలు, ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నాయి. ఆరోగ్యంగా ఉండటానికి ఇలాంటి పోషకమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం.

మినప పప్పులో ఫైబర్ అధిక మొత్తంలో, కొవ్వు తక్కువగా ఉంటుంది. కాబట్టి, దీన్ని ఆహారంలో భాగం చేసుకుంటే జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగు చేస్తుంది.  

పొట్టు మినపప్పుతో మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా ఈ పప్పును పోషకాల గనిగా అని పిలుస్తారు.

ఈ పప్పులో ఉండే ఫైబర్, ప్రొటీన్లతో పాటు ఇతర పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచుతాయి. షుగర్‌ బాధితులకు మరీ మంచిది.

మినప పప్పులో సమృద్ధిగా ఉండే కాల్షియం, పాస్పరస్ ఎముకల ఆరోగ్యానికి మంచిది. అంతేకాదు, బరువు తగ్గాలనుకునేవారికి రెట్టింపు ప్రయోజనం కలిగిస్తుంది.

మినప పప్పులో ఐరన్ పుష్కలంగా ఉండి రక్తహీనతను తగ్గిస్తుంది. కిడ్నీల సంరక్షణకు మరింత మంచిది. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రలో ఉంటాయి.